అన్వేషించండి

YCP opposes capital bill: రాజధాని బిల్లును లోక్‌సభలో వ్యతిరేకించిన వైసీపీ - వాకౌట్ చేసిన ఎంపీలు

Capital Bill: రాజధాని బిల్లును వ్యతిరేకిస్తూ వైసీపీ ఎంపీలు లోక్‌సభ నుంచి వాకౌట్ చేశారు. ప్రస్తుత రూపంలో తాము బిల్లును వ్యతిరేకిస్తున్నట్లుగా మిథున్ రెడ్డి స్పష్టం చేశారు.

YSRCP  opposing Capital Bill: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతి బిల్లును లోక్ సభలో వ్యతిరేకించింది. అమరావతికి వ్యతిరేకం కాదని తాము చర్చలో పాల్గొంటామని మిథున్ రెడ్డి సమావేశం ప్రారంభానికి ముందు మీడియా ప్రతినిధులతో చెప్పారు. అయితే సభలో చర్చ ప్రారంభమయ్యే సరికి పూర్తిగా వ్యూహం మారిపోయింది. తాడేపల్లిలో జగన్ మోహన్ రెడ్డి ప్రెస్మీట్ చూసిన తర్వాత మిథున్ రెడ్డి తన వ్యూహం మార్చుకున్నారేమో కానీ..  ప్రస్తుత రూపంలో తాము బిల్లును వ్యతిరేకిస్తున్నామని చెప్పి వాకౌట్ చేస్తున్నట్లుగా ప్రకటించి . .. మిగిలిన ముగ్గురు ఎంపీలతో కలిసి బయటకు వెళ్లిపోయారు.               

అమరావతికి వ్యతిరేకం కాదు కానీ ..బిల్లుకు వ్యతిరేకమన్న మిథున్ రెడ్డి                 

ప్రసంగంలో మిథున్ రెడ్డి బిల్లును వ్యతిరేకిస్తూనే తమ పార్టీ అమరావతికి వ్యతిరేకం కాదని, కానీ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధిని ఆకాంక్షిస్తుందని స్పష్టం చేశారు. కేవలం ఒకే ప్రాంతానికి రూ. 15 వేల కోట్లు కేటాయించడం వల్ల మిగిలిన వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్రలు నిర్లక్ష్యానికి గురవుతాయన్నారు.   కేంద్రం ఇచ్చే ఈ నిధులు గ్రాంటుగా ఉండాలని, అప్పుల రూపంలో ఇస్తే రాష్ట్రం మరింత ఆర్థిక సంక్షోభంలో పడుతుందన్నారు. రాజధాని నిర్ణయం అన్నది రాష్ట్ర నిర్ణయం అని గతంలో కేంద్రం హైకోర్టులో అఫిడవిట్ వేసిందన్నారు. అమరావతి రైతులకు ప్లాట్లు ఎప్పుడిస్తారో బిల్లులో పెట్టాలన్నారు. ఇప్పటికే యాభై వేల ఎకరాలున్నాయని..మరో యాభై వేల ఎకరాలెందుకని మితున్ రెడ్డి ప్రశ్నించారు.                                   

విభజన హామీలను కేంద్ర విస్మరించిందని మిథున్ రెడ్డి విమర్శలు                         

విభజన చట్టంలోని హామీలను కేంద్రం అమలు చేయడం లేదన్నారు.  ఏడు వెనుకబడిన జిల్లాలకు ఇస్తామన్న బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీని వెంటనే విడుదల చేయాలని కోరారు.  రాజధాని కోసం తీసుకున్న రుణాలు భవిష్యత్తులో రాష్ట్ర ప్రజలపై భారంగా మారుతాయని, ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలని కోరారు. అలాగే, పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను విడుదల చేయాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని విస్మరించకూడదని ఆయన ప్రసంగంలో  చెప్పారు.    

వికేంద్రీకరణ ఆలోచనను కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదని వైసీపీ వాకౌట్                                  

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పట్ల చూపిస్తున్న వివక్షకు నిరసనగా వైఎస్సార్‌సీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. కేవలం ఒకే నగరానికి ప్రాధాన్యత ఇస్తూ, రాష్ట్రం మొత్తం సమతుల్యంగా ఎదగాలన్న వికేంద్రీకరణ ఆలోచనను కేంద్రం పరిగణనలోకి తీసుకోకపోవడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు.   రాష్ట్ర ప్రయోజనాల కోసం, వెనుకబడిన ప్రాంతాల హక్కుల కోసం తమ పోరాటం పార్లమెంటు లోపల , వెలుపల కొనసాగుతుందని చెప్పారు. 

 

టాప్ హెడ్ లైన్స్

Perni Nani Avigan: అవిగన్ రాజకీయం - వైఎస్‌ఆర్‌సీపీ మావిగన్‌పై మళ్లీ రూటు మార్చిందా?
అవిగన్ రాజకీయం - వైఎస్‌ఆర్‌సీపీ మావిగన్‌పై మళ్లీ రూటు మార్చిందా?
YS Jagan Kurnool Tour: కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన! ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై నిప్పులు! జైల్లో తనను అవమానించారని కామెంట్స్!
కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన! ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై నిప్పులు! జైల్లో తనను అవమానించారని కామెంట్స్!
Pawan Kalyan: ఏనుగుల సంరక్షణలో  ఆంధ్రప్రదేశ్‌ నూతన అధ్యాయం! విశాఖలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో పవన్  
ఏనుగుల సంరక్షణలో  ఆంధ్రప్రదేశ్‌ నూతన అధ్యాయం! విశాఖలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో పవన్  
Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Vishwanath And Sons Twitter Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
Agadha Twitter Review - అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
IND vs SL Spin Attack: లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
YS Jagan Kurnool Tour: కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన! ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై నిప్పులు! జైల్లో తనను అవమానించారని కామెంట్స్!
కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన! ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై నిప్పులు! జైల్లో తనను అవమానించారని కామెంట్స్!
Pawan Kalyan: ఏనుగుల సంరక్షణలో  ఆంధ్రప్రదేశ్‌ నూతన అధ్యాయం! విశాఖలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో పవన్  
ఏనుగుల సంరక్షణలో  ఆంధ్రప్రదేశ్‌ నూతన అధ్యాయం! విశాఖలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో పవన్  
కర్మను మించినది ఏదీ లేదు! శని దేవుడు నేర్పించే 7 పాఠాలు!
కర్మను మించినది ఏదీ లేదు! శని దేవుడు నేర్పించే 7 పాఠాలు!
Embed widget