Vijaya Sai Railway Zone : రైల్వేజోన్ రాకపోతే రాజీనామా - విజయసాయిరెడ్డి ప్రతిజ్ఞ !
రైల్వే జోన్ రాకపోతే రాజీనామా చేస్తానని వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. రైల్వే జోన్ ఇచ్చేది లేదని కేంద్రం చెప్పలేదంటున్నారు.
Vijaya Sai Reddy Railway Zone : ఉత్తరాంధ్ర వాసులు సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న రైల్వేజోన్ ఆర్థికంగా లాభదాయకం కాదని .. అందుకే జోన్‌ను ఏర్పాటు చేసే ఉద్దేశం లేదని రైల్వే బోర్డు చైర్మన్ త్రిపాటి స్పష్టం చేసినట్లుగా వచ్చన వార్తలను.. వైఎస్ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి ఖండించారు. అసలు విభజన హామీలపై కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రైల్వేజోన్ అంశం చర్చకు రాలేదని ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. కావాలనే కొన్ని మీడియా సంస్థలు వైఎస్ఆర్‌సీపీకి ఇబ్బందులు సృష్టించేందుకు ఇలాంటి వార్తలు ప్రసారం చేస్తున్నారని ఆరోపించారు. రైల్వే జోన్ లేదని .. రైల్వే బోర్డు ప్రకటిచిందంటూ మీడియాలో వచ్చిన వార్తలపై ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు.
రైల్వే జోన్‌పై ఢిల్లీలో చర్చ జరగలేదన్న విజయసాయిరెడ్డి
విశాఖపట్నానికి రైల్వే జోన్ వచ్చి తీరుతుందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. రైల్వే జోన్ రాకపోతే తాను రాజ్యసబ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించారు. విశాఖకు రైల్వే జోన్ ఇస్తామని కేంద్ రైల్వే మంత్రి తనతో చెప్పారని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. విభజన హామీైల పరిష్కారం కోసం ఏర్పాటైన సమావేశంలో రైల్వే బోర్డు చైర్మన్ చేసినట్లుగా చెబుతున్న వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఏపీ ప్రభుత్వానికి ఇవి ఇబ్బందికరంగా మారాయి. అందుకే విజయసాయిరెడ్డి వెంటనే స్పందించారు.
రైల్వే జోన్ రాకపోతే రాజీనామా చేస్తానన్న ఎంపీ
విశాఖ రైల్వే జోన్ విషయంలో కేంద్రం 2018లోనే నిరణయం తీసుకుంది. అయితే ఇప్పటి వరకూ ఒక్క అడుగు ముందుకు వేయలేదు జోన్ ఏర్పాటు చాలా సుదీర్ఘ ప్రక్రియ కేంద్రం వాయిదా వేస్తూ వస్తోంది. గత ఫిబ్రవరిలో దేశంలో ఇక కొత్త రైల్వే జోన్‌లను ఏర్పాటు చేసే ఉద్దేశం లేదని పార్లమెంట్‌లోనే కేంద్రం తేల్చిచెప్పింది. అయితే ఆల్రెడీ విశాఖ రైల్వే జోన్ ప్రకటించినందున… అది లెక్కలోకి రాదని అప్పట్లో వైఎస్ఆర్‌సీపీ నేతలు వివరిచారు. అయితే ఆ తర్వాత కూడా రైల్వే జోన్ విషయంలో ముందడుగు పడలేదు. విశాఖ రైల్వే జోన్‌ను ప్రకటించంారన్న కారణంగా అత్యంత లాభదాయకమైన వాల్తేర్ డివిజన్‌ను ఒడిషాలో కలిపారు. విశాఖ రైల్వే జోన్ పనులు అసలు ప్రాథమికంగా కూడా ప్రారంభం కాలేదు కానీ వాల్తేర్‌ను రాయగడలో కలుపుకునే పనులు మాత్రం పూర్తయ్యాయి.
రైల్వే జోన్ ప్రకటించి ఐదేళ్లవుతున్నా అడుగు ముందుకు పడని పనులు
విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుకు అన్ని రకాల సౌకర్యాలు విశాఖలో ఉన్నాయని ఆర్థికంగా కూడా భారం కాదని ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీల నేతలు చెబుతున్నారు. డీపీఆర్‌లో ఇప్పటికే ఈ విషయాన్ని స్పష్టం చేశారు. రైల్వేజోన్‌ను ఏర్పాటుచేసేందుకు విశాఖలో భవనాలు సిద్ధంగా ఉన్నాయని.. తీసుకోవాల్సింది అధికారిక నిర్ణయమేనని చెబుతున్నారు. కానీ రైల్వే జోన్ విషయంలో మాత్రం ఎప్పటికప్పుడు నిర్ణయం పెండింగ్‌లో పడుతోంది. అంతే కాదు.. తరచూ రైల్వే జోన్ సాధ్యం కాదనే విషాయన్ని వీలైనప్పుడల్లా బయటకు చెబుతోంది. దీంతో రైల్వే జోన్ పరిస్థితి ఏమవుతుందోనని ఉత్తరాంధ్రలో ఆందోళన వ్యక్తమవుతోంది.