అన్వేషించండి

YS Jagan Congress: కాంగ్రెస్ అధ్యక్షుడితో వైసీపీ ఎంపీ భేటీ - జగన్ డబుల్ గేమ్ ఆడుతున్నారా ?

Meda Raghunath Reddy: కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేతో వైసీపీ ఎంపీ భేటీపై రాజకీయవర్గాల్లో భిన్న ప్రచారం జరుగుతోంది. ముందస్తు రాజకీయంలో భాగంగా జగన్ పరిచయాలు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు.?

YSRCP MP meeting with Congress President Kharge: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన రాధాకృష్ణన్‌కు మద్దతు ఇస్తున్నామని ఆయనకే ఓటు వేస్తామని విశాఖలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ.. వైసీపీ విధానాన్ని ప్రకటించారు. దానికి ఆయన ఏ కారణం చెప్పినా.. సాయంత్రానికి వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డి  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేతో సమావేశం అయ్యారు. ఇదేమీ సాధారణ సమావేశం కాదు. చక్కగా బోకేతో పాటు వెళ్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీలాగా ఆయనతో సమావేశం అయ్యారు. ఇది రాజకీయవర్గాలను ఆశ్చర్య పరిచింది. 

ఎంపీ కాంగ్రెస్‌లో చేరరు - కానీ సీక్రెట్ ఎజెండా ?                  

మేఢా రఘునాథ్ రెడ్డి వైసీపీ రాజ్యసభ ఎంపీ. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం లేదు.  ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి బలం లేదు. అందుకే వెంటనే వివరణ ఇచ్చారు. తనకు ఖర్గే..కర్ణాటకలో హోంమంత్రిగా ఉన్నప్పటి నుండి పరిచయం ఉందని.. అందుకే మర్యాదపూర్వకంగా కలిశానన్నారు. పార్టీ మార్పు ప్రచారాలు ఉత్తవేనన్నారు. కానీ ఆయన కాంగ్రెస్ లో చేరుతారన్న ప్రచారం జరగలేదు. గతంలో బీజేపీలో చేరుతారని మాత్రం ప్రచారం జరిగింది.కానీ ఆయన సైలెంట్ గా ఉన్నారు. మరి ఎందుకు సమావేశం అయ్యారు. 

కాంగ్రెస్‌కు  వైసీపీ నుంచి సందేశం పంపించారా ?                  

వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఏడాది కిందట ఢిల్లీలో ధర్నాలు చేపట్టినప్పుడు ఇండీ కూటమి పార్టీలు మద్దతు పలికాయి. ఎన్డీఏ కూటమి పార్టీలు, ఏపీలో ఎన్డీఏ పాలనను విమర్శించాయి. కానీ జగన్మోహన్ రెడ్డి క్లిష్టసమయాల్లో.. బీజేపీ ప్రభుత్వానికే అండగా నిలిచారు. ఎన్డీఏ ప్రవేశ పెట్టిన బిల్లులకే మద్దతు తెలిపారు.తాజాగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ అదే చేశారు. దీంతో ఇక ముందు ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ.. వైసీపీని సమర్థించ అవకాశం ఉండదు. బీజేపీతో ఎలాగూ జగన్ కలవలేరు. అందుకే..తనకు ఢిల్లీ స్థాయిలో మద్దతు ఉండాలంటే.. కాంగ్రెస్ కూటమి సపోర్టు అవసరమని జగన్ భావిస్తున్నారని.. ఆ సందేశాన్ని..  మేడా రఘునాథ్ రెడ్డి ద్వారా పంపించారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

సేఫ్ గేమ్ ఆడటం ప్రారంభించారా ?            

ఎన్డీఏ కూటమి చాలా బలంగా ఉంది. టీడీపీ, జనసేనలను బీజేపీ  వదులుకునే అవకాశం కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో.. రాను రాను వైసీపీ బలం తగ్గిపోతుంది. మరో రెండు, మూడేళ్లలో రాజ్యసభ స భ్యుల పదవి కాలం అయిపోతుంది. ఖాళీ అయ్యే సీట్లన్నీ ఎన్డీఏ ఖాతాలో పడిపోతాయి. అప్పుడు వైసీపీ అవసరం బీజేపీకి అసలు ఉండదు. ఇప్పుడు కూడా ఉండదు కానీ.. అవసరం లేకపోయినా.. వైసీపీ మద్దతు ఇచ్చేందుకు ఆసక్తి చూపుతోంది. దీని వల్ల రాజకీయంగా సమస్యలు వస్తాయని తెలిసినా తప్పడం లేదు. ముందు జాగ్రత్తగా కాంగ్రెస్ కూటమితోనూ సంబంధాలు కొనసాగించే ప్రయత్నాలను తమ ఎంపీల ద్వారా ప్రారంభించారన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. 

టాప్ హెడ్ లైన్స్

YSRCP DSC Protests: ఏపీలో డీఎస్సీ సెగ!అక్రమాలు జరిగాయని  వైఎస్‌ఆర్‌సీపీ నిరసనలు! తాడిపత్రిసహా పలు చోట్ల తీవ్ర ఉద్రిక్తత!
ఏపీలో డీఎస్సీ సెగ!అక్రమాలు జరిగాయని  వైఎస్‌ఆర్‌సీపీ నిరసనలు! తాడిపత్రిసహా పలు చోట్ల తీవ్ర ఉద్రిక్తత!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Vizag and Vijayawada Metro Rail:విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
AP Municipal Elections: ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
SlumDog Update : విజయ్ సేతుపతి స్లమ్ డాగ్ నుంచి బిగ్ సర్ప్రైజ్ - టబు As డిప్యూటీ కమిషనర్ గౌరీ హెగ్డే
విజయ్ సేతుపతి స్లమ్ డాగ్ నుంచి బిగ్ సర్ప్రైజ్ - టబు As డిప్యూటీ కమిషనర్ గౌరీ హెగ్డే
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - ఈ వారం థియేట్రికల్ రిలీజెస్... మీరు ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - ఈ వారం థియేట్రికల్ రిలీజెస్... మీరు ఛాయిస్ ఏంటి?
Embed widget