అన్వేషించండి

CM Jagan Siddam Meeting: సీఎం జగన్ వైపు దూసుకొచ్చిన అభిమాని - దెందులూరు 'సిద్ధం' సభలో అనూహ్య ఘటన

Strange Incident in Siddam: దెందులూరు 'సిద్ధం' సభలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఓ అభిమాని సీఎం జగన్ వైపు దూసుకొచ్చేందుకు యత్నించాడు.

Ysrcp Fan Rushed Towards CM Jagan in Denduluru Meeting: ఏలూరులోని దెందులూరు (Denduluru) 'సిద్ధం' సభలో శనివారం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. సభలో వైసీపీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం సీఎం జగన్ (CM jagan) ప్రజలకు అభివాదం చేస్తుండగా.. ఓ అభిమాని సెక్యూరిటీని దాటుకుంటూ ఆయన వైపు దూసుకొచ్చాడు. ఇది గమనించిన భద్రతా సిబ్బంది అతన్ని అడ్డుకునేందుకు యత్నించారు. అయితే, వారిని వారించిన జగన్.. సదరు అభిమానిని దగ్గరకు తీసుకుని.. అతని కోరిక మేరకు సెల్ఫీ దిగారు. అనంతరం భద్రతా సిబ్బంది అతన్ని కిందకు తరలించారు. కాగా, 'ఇదీ జగనన్న అంటే', 'ప్రజలపై ఆయనకున్న అభిమానం అంటే ఇదే', 'సరిహద్దులు లేని అభిమానం' అంటూ వైసీపీ శ్రేణులు ఆ వీడియోను షేర్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ అవుతోంది.

'చంద్రముఖి నిద్ర లేస్తుంది' 

వచ్చే ఎన్నికల్లో వైసీపీకి మరోసారి విజయాన్ని అందించాలని ప్రజలను సీఎం జగన్ కోరారు. 'సిద్ధం' సభలో ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. '57 నెలల్లో మీ బిడ్డ మీ మంచి కోసం 124 సార్లు బటన్ నొక్కాడు. ఈ మంచి ఇలాగే జరగాలంటే.. నాకోసం 2 బటన్స్ నొక్కండి. ఒకటి ఎమ్మెల్యే ఎన్నికల కోసం.. మరొకటి ఎంపీ ఎన్నిక కోసం. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మెజార్టీతో గెలిపించండి. లేకుంటే గత ఎన్నికల్లో ఓటుతో మీరు పెట్టెలో బంధించిన చంద్రముఖి మళ్లీ నిద్రలేస్తుంది. సైకిల్ ఎక్కి టీ గ్లాస్ పట్టుకునిపేదల రక్తం తాగేందుకు 'లక లక' అంటూ ప్రతీ ఇంటింటికీ వస్తుంది. అబద్ధాలతో తలుపు తట్టి ప్రజల రక్తం తాగుతుంది. 2024లో జగనన్నకు ఓటేస్తే ఆ చంద్రముఖి బెడద మీకు శాశ్వతంగా తప్పుతుంది. చంద్ర గ్రహణాలు ఉండవు' అంటూ సీఎం పేర్కొన్నారు. ప్రజలే తనకు స్టార్ క్యాంపెయినర్లు అన్న ఆయన.. అభివృద్ధి, సంక్షేమం ఇలాగే కొనసాగాలంటే జగనన్న ఉంటేనే సాధ్యమని.. వైసీపీకి మరో చారిత్రాత్మక విజయం అందించేందుకు అంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

Also Read: CM Jagan: 'మీరు కృష్ణుడైతే నేను అర్జుడిని' - నా కోసం మీరు ఒక్కసారి ఆ బటన్ నొక్కాలన్న సీఎం జగన్

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Breaking News: నల్లచెరువు పునరుద్ధరణపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
నల్లచెరువు పునరుద్ధరణపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
AP JAC Demand: ఏపీ ప్రభుత్వంపై ఉద్యోగుల ఆగ్రహం - పీఆర్‌సీ, ఐఆర్‌కై ఏపీ జేఏసీ ఉద్యమ శంఖారావం - సచివాలయంలో నిరసనలకు రెడీ
ఏపీ ప్రభుత్వంపై ఉద్యోగుల ఆగ్రహం - పీఆర్‌సీ, ఐఆర్‌కై ఏపీ జేఏసీ ఉద్యమ శంఖారావం - సచివాలయంలో నిరసనలకు రెడీ
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 బైక్‌లే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ లిమిటెడ్ ఎడిషన్‌కు అతి భారీ డిమాండ్
కేవలం 3 నిమిషాల్లోనే అమ్ముడైన రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 X రఫ్ క్రాఫ్ట్స్ - ఏంటి దీని స్పెషాలిటీ?
మేష రాశి ఆగస్టు 2-8 వారఫలం: కుజుడి సంచారంతో అదృష్ట యోగం, విజయాలు!
మేష రాశి ఆగస్టు 2-8 వారఫలం: కుజుడి సంచారంతో అదృష్ట యోగం, విజయాలు!
Embed widget