IPL, 2022 | Match 66 | Dr. DY Patil Sports Academy, Navi Mumbai - 18 May, 07:30 pm IST
(Match Yet To Begin)
KKR
KKR
VS
LSG
LSG
IPL, 2022 | Match 67 | Wankhede Stadium, Mumbai - 19 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RCB
RCB
VS
GT
GT

Budvelu YSRCP Win : బద్వేలులో వైఎస్ఆర్‌సీపీ విజయం.. మెజార్టీ 90,089 !

బద్వేలు నియోజకవర్గంలో వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థి డాక్టర్ సుధ విజయం సాధించారు. ఈవీఎం ఓట్లలో 89, 660 మెజార్టీ సాధించారు. పోస్టల్ ఓట్లు కలుపుకుంటే మెజార్టీ 90,089 కి చేరింది.

FOLLOW US: 

బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగి ఉపఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధ ఈవీఎంలలో 89, 660 ఓట్ల మెజార్టీ సాధించారు. పోస్టల్ ఓట్లతో కలుపుకుని 90,089 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.  మొత్తం పన్నెండు రౌండ్ల కౌంటింగ్‌లో ఆమెకు 1, 11, 227 ఓట్లు రాగా సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి పనతల సురేష్‌కు 21567 ఓట్లు పోలయ్యాయి. దీంతో 89, 660 ఓట్ల తేడాతో డాక్టర్ సుధ విజయం సాధించినట్లయింది. పోస్టల్ ఓట్ల ఆధిక్యం కలుపుకుంటే మెజార్టీ కాస్త పెరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి కమలమ్మకు 6191 ఓట్లు పోలయ్యాయి. నోటాకు 3616 ఓట్లు వచ్చాయి. ఇది గత ఎన్నికల్లో కంటే ఎక్కువ. పోస్టర్ ఓట్లలో 362 వైఎస్ఆర్‌సీపీకి దక్కగా బీజేపీకి 40 ఓట్లు మాత్రమే వచ్చాయి.

Also Read : "సమైక్య రాష్ట్రంగా మళ్లీ ఏపీ" ! సాధ్యమా ? రాజకీయమా?

బద్వేలు నియోజకవర్గంలో మొత్తం 2,15,240  ఓట్లు ఉండగా, 1,47,213 ఓట్లు పోలయ్యాయి. పోలయిన ఓట్లలో 76.23 శాతం వైసీపీ అభ్యర్థికే పోలయ్యాయి. బద్వేలులో వైసీపీ విజయంపై ఎవరికీ అనుమానాల్లేవు. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన కూడా బరిలో నిలబడలేదు. లక్ష ఓట్ల మెజార్టీని లక్ష్యంగా పెట్టుకోవాలని సీఎం జగన్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసి పంపించారు.  దానికి తగ్గట్లుగానే ఎన్నికల బాధ్యతలు తీసుకున్న పెద్దిరెడ్డి శ్రమించారు. 

Also Read : తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల... తెలంగాణలో 6, ఏపీలో 3 స్థానాల్లో ఎన్నికలు

తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక వ్యూహాన్ని పక్కాగా అమలు చేసి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బద్వేలు బాధ్యతల్ని కూడా నిర్వర్తించారు. ఆయన ఎన్నిక గురించి ప్రతి విషయాన్ని పక్కాగా పరిశీలించి పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. ప్రచారంలో ఎక్కడా తగ్గలేదు.  సీరియస్‌గా ప్రచారం చేశారు. ఎలక్షనీరింగ్ కూడా లోపాలు లేకుండా చేసుకున్నారు. ఓటర్లందర్నీ బూత్‌ల వద్దకు తరలించుకోగలిగారు. ఆ ఫలితం కౌంటింగ్‌లో కనిపించింది. అయితే ఓటింగ్ శాతం గత ఎన్నికల కంటే ఎనిమిది శాతం వరకూ తగ్గడంతో లక్ష మెజార్టీని అందుకోలేకపోయారు. 

Also Read: కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి సమైక్య రాగం... ఆ విషయంలో కేసీఆర్ కు మద్దతిస్తానని కీలక వ్యాఖ్యలు

బద్వేలులో గత ఎన్నికల్లో బీజేపీ నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ఈ సారి దాదాపుగా 21వేలకుపైగా ఓట్లు సాధించారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి నలభై వేల ఓట్ల మెజార్టీ వచ్చింది.  ఈ సారి అది రెండింతలు అయింది. ఇది తమ ప్రభుత్వ పాలనకు ప్రజామోదానికి సాక్ష్యమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Also Read: తెలంగాణలో రాజకీయ శూన్యత... అందుకే కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి... మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 02 Nov 2021 12:35 PM (IST) Tags: Badvelu YSR Congress party Dr Sudha YSRCP candidate win Badvelu lakh majority

సంబంధిత కథనాలు

Pithapuram News : పిఠాపురంలో దారుణ హత్య, భార్యను కాపురానికి పంపలేదని అత్తపై అల్లుడు దాడి

Pithapuram News : పిఠాపురంలో దారుణ హత్య, భార్యను కాపురానికి పంపలేదని అత్తపై అల్లుడు దాడి

AB Venkateswararao : ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం, ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేత

AB Venkateswararao : ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం,  ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేత

Breaking News Live Updates : ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేసిన ఏపీ ప్రభుత్వం 

Breaking News Live Updates : ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేసిన ఏపీ ప్రభుత్వం 

Chandrababu Tour : నేడు కడప జిల్లాలో చంద్రబాబు టూర్, పార్టీ నేతలతో విస్తృత స్థాయి సమావేశం

Chandrababu Tour : నేడు కడప జిల్లాలో చంద్రబాబు టూర్, పార్టీ నేతలతో విస్తృత స్థాయి సమావేశం

Prakasam Road Accident : ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మిత్రులు సజీవదహనం

Prakasam Road Accident : ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మిత్రులు సజీవదహనం
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Rajiv Gandhi Assassination Case: రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీం సంచలన తీర్పు- 31 ఏళ్ల తర్వాత పెరరివలన్ రిలీజ్

Rajiv Gandhi Assassination Case: రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీం సంచలన తీర్పు- 31 ఏళ్ల తర్వాత పెరరివలన్ రిలీజ్

ఊరేగింపులో వరుడు, అతడు వచ్చేసరికి వేరే వ్యక్తిని పెళ్లాడిన వధువు

ఊరేగింపులో వరుడు, అతడు వచ్చేసరికి వేరే వ్యక్తిని పెళ్లాడిన వధువు

Sheena Bora murder Case: షీనా బోరా హత్య కేసు అప్‌డేట్- ఇంద్రాణి ముఖర్జీకి బెయిల్

Sheena Bora murder Case: షీనా బోరా హత్య కేసు అప్‌డేట్- ఇంద్రాణి ముఖర్జీకి బెయిల్

Bigg Boss OTT Winner: బిగ్ ఓటీటీ ఫినాలే - గెలిచేదెవరు?

Bigg Boss OTT Winner: బిగ్ ఓటీటీ ఫినాలే - గెలిచేదెవరు?