Budvel By Election : బద్వేల్ ఏకగ్రీవమా ? నామమాత్ర పోటీనా ?
బద్వేలు ఎన్నికల్లో పోటీ చేస్తామని చెబుతున్నా బీజేపీ, కాంగ్రెస్ ముందడుగు వేయడం లేదు. చివరికి ఏకగ్రీవానికి సహకరించే ప్రకటన చేయవచ్చంటున్నారు. స్వతంత్రులు ఎవరూ పోటీ చేయకపోతే ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది.
బద్వేలు ఎన్నికల్లో ఏకగ్రీవానికి సహకరిస్తామంటూ టీడీపీ, జనసేన పార్టీలు పోటీ నుంచి వైదొలిగాయి. బీజేపీ , కాంగ్రెస్‌ల వైఖరిపై స్పష్టత లేదు. దీంతో ఏకగ్రీవం అవుతుందా ? నామమాత్రపు పోటీ జరుగుతుందా అన్న ఉత్కంఠ ప్రారంభమయింది. దీనికి కారణం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇంకా ఏ విషయం ప్రకటించలేదు. బీజేపీ, కాంగ్రెస్‌లు పోటీలో ఉంటామని ఇప్పటి వరకూ ప్రకటనలు చేస్తున్నాయి. కానీ అభ్యర్థుల్ని ప్రకటించలేదు. పార్టీ హైకమాండ్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా మాత్రం చెబుతున్నారు.
Also Read : ఏపీలో బీజేపీ - జనసేన అనధికారిక కటీఫ్ ! బద్వేలు పోటీనే తేల్చేసిందా ?
సిట్టింగు ఎమ్మెల్యే చనిపోతే వారి స్థానంలో వారి కుటుంబసభ్యుడిని అభ్యర్థిగా ప్రకటిస్తే ప్రధాన పార్టీలు ఎన్నికలకు దూరంగా ఉంటూ వస్తున్నాయి. ఇప్పుడు ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ బద్వేలు ఉపఎన్నికలో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు జనసేన, టీడీపీ ప్రకటించాయి. టీడీపీ అభ్యర్దిని ప్రకటించినా చివరికి వెనక్కి తగ్గింది. బీజేపీ - జనసేన పొత్తులో ముందుగా పోటీ చేయాలని భావించాయి. బద్వేలులొ బలిజల ఓట్లు అధికంగా ఉండటంతో జనసేన పోటీ చేస్తే కొంత పోటీ ఇచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం వినిపించింది. అయితే పవన్ కల్యాణ్ సంప్రదాయాన్ని పాటించాలని నిర్ణయించారు.
Also Read : అభ్యర్థిని ప్రకటించి మరీ వెనక్కి తగ్గిన టీడీపీ ! సంప్రదాయమా ? పలాయనమా ?
జనసేన ప్రకటనతో బీజేపీ కూడా ఎన్నికల బరి నుంచి వైదొలుగుతుందని అందరూ భావించారు. కానీ బీజేపీ మాత్రం పోటీ చేస్తామని చెబుతోంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సొమువీర్రాజు, మాజీ మంత్రి అదినారాయణరెడ్డిలు జిల్లా క్యాడర్ తో అభ్యర్ది ఎంపికపై సంప్రదింపులు చేపట్టారు. అభ్యర్దిత్వం కోసం తమకు వచ్చిన వినతులను కేంద్రపార్టీకి పంపామని... తమ పార్టీ నిర్ణయం మేరకు నడుచుకుంటామమని ఆయన ప్రకటించారు. ఉపఎన్నిక జరుగుతున్న హుజురాబాద్‌కు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ హైకమాండ్ .. బద్వేలు విషయంలో మాత్రం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.
Watch Video : బద్వేల్ ఉపఎన్నికను బహిష్కరించిన చిన్నరాజు పల్లె. ఎందుకంటే ?
ఓ వైపు తాము ఎన్నికకు సిద్దమంటూనే తమ పార్టీ ఎలా చెబితే అలా నడుచుకుంటామంటూ సోము వీర్రాజు చెప్పడంతో బీజేపీ కూడా సంప్రదాయం పాటించే ఆలోచనలో ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ సైతం పోటిలో ఉంటామని చెప్పినా ఇంత వరకు క్లారిటి లేదు. వీరు పోటికి దూరంగా ఉండే అవకాశం ఉందన్న అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది. అయితే ప్రధాన పార్టీలు దూరమైన కొంత మంది స్వతంత్రులు పోటీలో ఉండేదుకు ఆసక్తి చూపిస్తున్నారు. వారు బరిలో ఉంటే నామమాత్రపు పోటీ ఉంటుంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవం కావాలనుంటే ఆ ఇండిపెండెంట్లను లేదా బీజేపీ, కాంగ్రెస్ తరపున ఎవరైనా అభ్యర్థులు నిలబడితే వారిని బుజ్జగించడానికి పెద్దకష్టపడాల్సిన అవసరం లేదన్న అభిప్రాయం మాత్రం రాజకీయవర్గాల్లో ఉంది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తల్చుకుంటే ఏకగ్రీవం ఖాయమని చెప్పుకోవచ్చు .
Also Read : బద్వేలులో జనసేన పోటీ చేయడం లేదు... స్పష్టం చేసిన పవన్ కల్యాణ్...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి