News
News
X

BJP Vishnu : బైక్ సేల్స్ దేశమంతా వృద్ధి - ఏపీలో మాత్రం డౌన్ ! జగన్ పాలనా నిర్వాకమేనన్న ఏపీ బీజేపీ

దేశమంతా వాహనాల అమ్మకాలు పెరుగుతూంటే .. ఏపీలో మాత్రం దారుణంగా తగ్గిపోయాయి. ఇదంతా ఏపీ ప్రభుత్వ పాలనా నిర్వాకరమేనని బీజేపీ మండిపడింది.

FOLLOW US: 

BJP Vishnu On Vehicle Sales :   దేశంలో అభివృద్ధికి సూచికలుగా రియల్ ఎస్టేట్‌తో పాటు వాహనాల అమ్మకాలను చూస్తారు. వాహనాలు అమ్మకాలు ఎంత పెరిగేతే అంత అభివృద్ది చెందినట్లుగా భావిస్తారు. ద్విచక్ర వాహనాలు పెరిగితే మధ్యతరగతి వర్గం బాగుపడుతోందని అంచనా వేస్తారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో  దేశంలో  ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో వృద్ధి 26 శాతంగా నమోదైంది. దేశం అంటే రాష్ట్రాలు... అన్ని రాష్ట్రాల్లోని అమ్మకాలు కలుపుకుంటే అంత శాతం నమోదైంది. కానీ ఏపీలో మాత్రం  ఏ మాత్రం వృద్ధి లేకపోగా 6.5 శాతం తక్కువ నమోదైంది. అంటే నెగెటివ్ వృద్ధి. 

దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విధంగా ఏపీలో నెగెటివ్ వృద్ధి ! 

దేశంలో అన్ని రాష్ట్రాల్లో వాహనాల అమ్మకాలు పెరిగాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే బైక్ సేల్స్ తగ్గిపోయాయి. ఒక్క బైకుల విషయంలోనే కాదు.. అన్ని రకాల వాహనాల్లోనూ గత ఏడాదితో పోలిస్తే 1.7శాతం తక్కువ నమోదయ్యాయి.   గత ఏడాది ఏప్రిల్ - సెప్టెంబర్ మధ్య ఏపీలో 3,31,695  ద్విచక్ర వాహనాలు అమ్ముడయ్యా.ి ఈ ఏడాది ఏప్రిల్ - సెప్టెంబర్ మధ్య వీటి సంఖ్య 3,10,054 . అదే జాతీయ స్థాయిలో గత ఏడాది 53,37,389 ద్విచక్ర వాహనాలు అమ్ముడైతే.. ఈ ఏడాది వాటి సంఖ్య..  67,27,806. అంటే ఇరవై ఆరు శాతం వృద్ధి. ఇలా నెగెటివ్ వృద్ధిరేటు ఉన్న రాష్ట్రం దేశంలో ఏపీ ఒక్కటే. పొరుగున ఉన్న కర్ణాటకలో అయితే.. ఏకంగా 58 శాతం అమ్మకాలు పెరిగాయి. తమిళనాడులో ఈ పెరుగుదల శాతం 31. 

ఏపీ ప్రజల కొనుగోలు శక్తి  పడిపోయిందన్న అభిప్రాయం !

News Reels

దేశం మొత్తం వృద్ధి ట్రెండ్ ఉంటే.. ఏపీలో మాత్రమే నెగెటివ్ ట్రెండ్ ఉండటానికి కారణం ఏపీ ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడమేనంటున్నారు ఆర్థిక నిపుణులు. కరోనా కారణంగా  ఏపీ ప్రజలు ఆర్థికంగా చితికిపోయారు. ప్రభుత్వ విధానాల కారణం...  పథకాల డబ్బులతో గడిపేసేవారు పెరిగిపోయారని  ఇతర పార్టీలు కొంతకాలంగా ఆరోపిస్తున్నాయి. మూడు రాజధానుల వివాదం కారణంగా రియల్ ఎస్టేట్ ఆగిపోయింది. ఏపీలో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య తగ్గిపోయింది. ఉపాధి మొత్తం ఇతర రాష్ట్రాలకు ఎక్కువ మంది వెళ్లిపోతున్నారు. ఇలాంటి కారణాలతో  ఏపీ ప్రజల ఆదాయం పడిపోయిందని అంటున్నారు. రుణాల లభ్యత ఎక్కువగా.. రుణం పెట్టి తీసుకునేందుకు కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. కట్టలేని పరిస్థితులు ఉండటం వల్ల వెనుకడుగు వేస్తున్నారని మోటార్ ఇండస్ట్రీ ప్రతినిధులు  చెబుతున్నారు. 

అధ్వాన్నమైన రోడ్లు -  అధిక పన్నులు కూడా కారణమే !

ఏపీలో యాభై వేల పైబడిన బైకులకు పన్నెండు శాతం పన్ను విధిస్తున్నారు. ఏ బైక్ అయినా ఇప్పుడు యాభై వేలకు తక్కువ లేదు. ఈ కారణంగా అదనంగా మరో రూ. 163 కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం పొందాలని లక్ష్యంగా పెట్టుకుంది. అదే సమయంలో పెట్రోల్ రేటు ఏపీలోనే అత్యధికంగా ఉంది. అదనంగా రోడ్ సెస్‌లు వేస్తున్నారు. రోడ్లను వేయడం లేదు. అత్యంత దారుణంగా రోడ్ల పరిస్థితి ఉంది. అందుకే సేల్స్ పడిపోయాయిని చెబుతున్నారు. ఇదే విషయాన్ని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ట్విట్టర్‌లో వెల్లడించారు. ఇదంతా ఏపీ పాలన దుష్పరిణామమేనని అంటున్నారు.   

కారణం ఏదైనా.. దేశం మొత్తం వృద్ధి చెందుతూంటే.. ఏపీ మాత్రం వెనుకబడిపోతోందని ఇలాంటి గణాంకాలు వెల్లడయినప్పుడు విపక్షాలు విమర్శిస్తూ ఉంటాయి. 

Published at : 30 Oct 2022 04:26 PM (IST) Tags: BJP leader Vishnuvardhan Reddy Sales of vehicles falling sales in AP

సంబంధిత కథనాలు

Konaseema District: చేపల వేట హద్దుల కోసం Boat Race, ఎంచక్కా వీడియో వీక్షించండి

Konaseema District: చేపల వేట హద్దుల కోసం Boat Race, ఎంచక్కా వీడియో వీక్షించండి

Vizag News: త్వరలోనే విశాఖలో ప్రభుత్వ డెంటల్ కాలేజీ ఏర్పాటు: వై.వి సుబ్బారెడ్డి

Vizag News: త్వరలోనే విశాఖలో ప్రభుత్వ డెంటల్ కాలేజీ ఏర్పాటు: వై.వి సుబ్బారెడ్డి

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

MP Vijayasai Reddy : త్వరలో 10 పోర్టులున్న రాష్ట్రంగా ఏపీ, దేశానికే రోల్ మోడల్ - ఎంపీ విజయసాయి రెడ్డి

MP Vijayasai Reddy :  త్వరలో 10 పోర్టులున్న రాష్ట్రంగా ఏపీ, దేశానికే రోల్ మోడల్ - ఎంపీ విజయసాయి రెడ్డి

టాప్ స్టోరీస్

WhatsApp Data Breach: వాట్సాప్ యూజర్లకు బిగ్ షాక్ - 50 కోట్ల మంది డేటా లీక్!

WhatsApp Data Breach: వాట్సాప్ యూజర్లకు బిగ్ షాక్ - 50 కోట్ల మంది డేటా లీక్!

Jio True 5G: 100 శాతం 5జీ కవరేజీ - మొదటి రాష్ట్రం గుజరాతే!

Jio True 5G: 100 శాతం 5జీ కవరేజీ - మొదటి రాష్ట్రం గుజరాతే!

Poland Vs Saudi Arabia: ప్రపంచకప్‌లో సౌదీకి తొలి ఓటమి - రౌండ్ ఆఫ్ 16 రేసులో పోలండ్!

Poland Vs Saudi Arabia: ప్రపంచకప్‌లో సౌదీకి తొలి ఓటమి - రౌండ్ ఆఫ్ 16 రేసులో పోలండ్!

Naresh Pavitra Lokesh : సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, సైబర్ క్రైమ్ పోలీసులకు నరేష్, పవిత్ర లోకేశ్ ఫిర్యాదు

Naresh Pavitra Lokesh : సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, సైబర్ క్రైమ్ పోలీసులకు నరేష్, పవిత్ర లోకేశ్ ఫిర్యాదు