Weather Update: అలర్ట్.. మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు పడే అవకాశం
తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
దక్షిణ థాయిలాండ్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం వ్యాపించి ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి డిసెంబరు 2వ తేదీ నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. ఆ తర్వాత 24 గంటల్లో తీవ్రమై తుపానుగా మారే అవకాశం ఉందని తెలిపింది. మరింత బలపడిన తర్వాత.. డిసెంబరు 4వ తేదీన ఉత్తరాంధ్ర-ఒడిశా తీరానికి వచ్చే అవకాశం ఉంది. ఈ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
— IMD_Metcentrehyd (@metcentrehyd) November 30, 2021
అల్పపీడనం తుపానుగా మారి డిసెంబరు 4వ తేదీ వరకు పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుందని.. ఉత్తర కోస్తాంధ్ర- ఒడిశా తీరాలకు దగ్గరగా వచ్చే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. డిసెంబరు 2 నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ కారణంగా కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుపాను కారణంగా కోస్తాంధ్ర తీరం వెంట 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Impact based forecast for Andhrapradesh dated 30-11-2021 https://t.co/pP5Sxq33fo
— MC Amaravati (@AmaravatiMc) November 30, 2021
Government of India
— MC Amaravati (@AmaravatiMc) November 30, 2021
India Meteorological Department
Meteorological centre Amaravati
Weather briefing for Andhra Pradesh in Telugu Dated:- 30.11.2021. pic.twitter.com/dzE4DCShhL