అన్వేషించండి

Tirupati: డాలర్ శేషాద్రి మరణంపై ఉపరాష్ట్రపతి సంతాపం... శేషాద్రి అంతిమయాత్రలో పాడె మోసిన ఎమ్మెల్యేలు చెవిరెడ్డి, భూమన

డాలర్ శేషాద్రి అంతిమయాత్రలో ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి పాల్గొని పాడె మోశారు. పాల శేషాద్రి మృతికి ఉపరాష్ట్రపతి వెంకయ్య సంతాపం తెలిపారు.

డాలర్ శేషాద్రి మృతికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం వ్యక్తం చేశారు. డాలర్ శేషాద్రి సేవలను గుర్తుచేసుకుంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. తిరుమల శ్రీవారి సేవలో పాల శేషాద్రి జీవితాన్ని తరింపజేసుకున్నారని ఉపరాష్ట్రపతి వెంకయ్య అన్నారు. డాలర్ శేషాద్రి మరణ వార్త విని ఎంతో విచారించానన్నారు. శేషాద్రి చివరి రోజు కూడా శ్రీవారి సేవలో గడిపి ధన్య జీవి అయ్యారన్నారు. చాలా తక్కువ మందికి దక్కే అదృష్టం ఇది అన్న వెంకయ్య... చాలా మంది ఆయనన్ను అర్చకులు అనుకుంటారన్నారు. చిన్న ఉద్యోగంతో మొదలు పెట్టి శ్రీవారి సేవలో‌ కీలక వ్యక్తిగా మారడం వరకూ ఎంతో అంకిత భావంతో పని చేశారని ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు. 

Also Read: తిరుమల శ్రీవారి ఆలయం ఓఎస్డీ డాలర్‌ శేషాద్రి కన్నుమూతTirupati: డాలర్ శేషాద్రి మరణంపై ఉపరాష్ట్రపతి సంతాపం... శేషాద్రి అంతిమయాత్రలో పాడె మోసిన ఎమ్మెల్యేలు చెవిరెడ్డి, భూమన

ఓ ఆణిముత్యాన్ని కోల్పోయాం

'పదవులతో నిమిత్తం లేకుండా ఎంతో ఉత్సాహంగా స్వామివారి సేవలో పాల్గొనేవారు. 1978లో తిరుమల శ్రీవారి సేవకుడిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి, శ్రీవారి సేవల్లోనూ, కైంకర్యాల్లోనూ, సేవలందించే శేషాద్రి తెలియని వారు లేరు. శ్రీనివాసుడికి నిత్యం కైంకర్యాలు, ఆలయ సంప్రదాయాలు ఉత్సవాలు, సేవలు ఆలయ చరిత్ర విషయంలో ఆయనకు మంచి పట్టు ఉంది. నేను ఎప్పుడూ తిరుమలకు వెళ్లినా అధికారులందరూ మారే వారు కానీ శేషాద్రి మాత్రం అక్కడే కనిపించే వారు. ‌ఎంతో ఆప్యాయంగా పలకరించి స్వామి వారి దర్శనం సమయంలో ప్రక్కనే ఉండే వారు. ఎంతో ఓపికతో ఆలయ చరిత్రను వివరించేవారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమయంలో ఎన్నో విషయాలు ఓపికగా వివరించారు. పాల శేషాద్రి మరణ వార్తను వినగానే ఓ ఆణిముత్యాన్ని కోల్పోయామని అనిపించింది. జీవితం చివరి రోజుల్లో కూడా శ్రీనివాసుడి సేవల్లో‌ ఉంటూ పరమపదాన్ని పొందారు. శేషాద్రి ఆత్మశాంతి కలుగజేయాలని ప్రార్థిస్తూ వారి కుటుంబం సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నాను.' అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. 

Also Read: పాల శేషాద్రి.. డాలర్ శేషాద్రిగా ఎలా మారారు.. సామాన్యుల నుంచి వీవీఐపీల వరకు సుపరిచితులు!Tirupati: డాలర్ శేషాద్రి మరణంపై ఉపరాష్ట్రపతి సంతాపం... శేషాద్రి అంతిమయాత్రలో పాడె మోసిన ఎమ్మెల్యేలు చెవిరెడ్డి, భూమన

శేషాద్రి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం : వైవీ సుబ్బారెడ్డి

డాలర్ శేషాద్రి పార్థీవదేహానికి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నివాళులు అర్పించారు. శేషాద్రి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. డాలర్ శేషాద్రి మరణం తీరనిలోటు అని, ఆయన జీవితాన్ని స్వామి, భక్తుల సేవకే అంకితం చేశారన్నారు. ఆయనకు ఆరోగ్యం సహకరించకపోయినా స్వామిసేవను వీడలేదని, సంవత్సరం ముందు కరోనా బారిన పడినా కూడా మెరుగైన వైద్యమందించి ఆయన్ను కాపాడుకున్నామని ఛైర్మన్ తెలియజేశారు. ఆయన ఆరోగ్యం బాగోని కారణంగా విశాఖలో కార్తీక దీపోత్సవానికి వెళ్లొద్దని కోరామని, దేవునిసేవ కంటే తన ఆరోగ్యం ఎక్కువకాదని శేషాద్రి చెప్పేవారని, అలాగే భగవంతుని సేవలోనే తుదిశ్వాస విడిచారని బాధను వ్యక్తం చేశారు. డాలర్ శేషాద్రి కుటుంబ సభ్యులను టీటీడీ అన్ని విధాలా ఆదుకుంటుందని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. డాలర్ శేషాద్రి స్వామి అంతిమయాత్రలో ఎమ్మెల్యే  కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, తెలంగాణ ఆర్ అండ్ బి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు పాల్గొన్నారు. 

Also Read: ఆప్తుడి చెంతకు శేషాద్రి డాలర్.. భావోద్వేగంతో మెడలో వేసుకున్న టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC Group III: తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC Group III: తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Pushpa 2 Trailer: మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
Pushpa 2 Trailer Launch Live Updates: అల్లు అర్జున్ అంటే మినిమమ్ ఉంటుంది మరి... 'పుష్ప 2' ట్రైలర్ లాంచ్ అప్డేట్స్
అల్లు అర్జున్ అంటే మినిమమ్ ఉంటుంది మరి... 'పుష్ప 2' ట్రైలర్ లాంచ్ అప్డేట్స్
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Manipur: మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
Embed widget