Dollar Seshadri: పాల శేషాద్రి.. డాలర్ శేషాద్రిగా ఎలా మారారు.. సామాన్యుల నుంచి వీవీఐపీల వరకు సుపరిచితులు!
Dollar Seshadri Latest News: తిరుపతి గోవిందదామంలో డాలర్ శేషాద్రి అంతిమ సంస్కారాలు మంగళవారం జరగనున్నాయి. నేటి ఉదయం తిరుమల ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి విశాఖలో కన్నుమూశారు.
Dollar Seshadri Dies: విశాఖలో నేటి ఉదయం తిరుమల ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి కన్నుమూశారు. గుండెపోటు రావడంతో హఠాన్మరణం చెందిన ఆయన భౌతికకాయాన్ని ఆంధ్ర మెడికల్ కాలేజీకి తరలించారు. రేపు మధ్యాహ్నం డాలర్ శేషాద్రి అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు రోడ్డు మార్గాన వైజాగ్ నుంచి తిరుపతికి శేషాద్రి పార్దివదేహం తరలించగా.. అర్దరాత్రికి తిరుపతికి చేరుకోనుంది. రేపు ఉదయం ప్రజల సందర్శనార్థం తిరుపతిలో సిరిగిరి అపార్ట్మెంట్‌లో శేషాద్రి పార్థీవదేహాన్ని ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అదే రోజు మధ్యాహ్నం 2 నుంచి 3 గంటలకు వరకు పూజలు నిర్వహించిన అనంతరం తిరుపతి గోవిందదామంలో అంతిమ సంస్కారాలు జరిపిస్తారు.
1948 జూలై 15న జన్మించిన డాల్లర్ శేషాద్రి అసలు పేరు పాల శేషాద్రి. మెడలో పోడువైన డాలర్ ధరించి ఉండడంతో ఆ పేరుతో ఫేమస్ అయ్యారు. వీరి పూర్వికులది తమిళనాడు రాష్ర్టంలోని కంచి ప్రాంతం. శేషాద్రి స్వామి తండ్రి తిరుమల నంబి ఆలయంలో గుమస్తాగా విధులు నిర్వర్తించారు. తిరుపతిలోనే జన్మించి అక్కడే విద్యాభ్యాసం పూర్తిచేశారు. పీజీ చదివారు. 1978లో టీటీడీలో చేరిన శేషాద్రి 2006 జూన్ లో రిటైరయ్యారు. అప్పటినుంచి ఓఎస్డీగా సేవలు అందిస్తున్నారు.
అనారోగ్యం.. వివాదాలు
డాలర్ శేషాద్రికి 2013లో కిడ్ని ట్రాన్స్ ప్లాంటేషన్ జరిగింది. 2006లో డాల్లర్ శేషాద్రిపై బంగారు డాలర్లు మిస్సింగ్ అభియోగాలు నమోదయ్యాయి. అదే ఏడాది జూలైలో రిటైరయ్యారు. 2009లో అప్పటి ఈవో క్రిష్ణారావు ఆదేశాలు మేరకు తొమ్మిది నెలలు విధులుకు దూరమయ్యారు. కోర్టు ఆదేశాలతో తిరిగి విధులలో చేరారు. 2016లో తీవ్ర అస్వస్థతకు గురై.. కొన్ని రోజులకు కోలుకున్నారు. సర్వీసులో 15 నెలలు కాలం మినహయిస్తే, పూర్తిగా శ్రీవారి సన్నిధిలో విధులు నిర్వర్తించారు.
Also Read: YV Subba Reddy: డాలర్ శేషాద్రి మరణం తీరని లోటు: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సంతాపం
సామాన్యుల నుంచి వీవీఐపీల వరకు..
డాలర్ శేషాద్రి సామాన్యుల నుంచి వీవీఐపీల వరకు సుపరిచితులుగా ఉన్నారు. తిరుపతికి వీఐపీలు, వీవీఐపీలు వచ్చారంటే అక్కడ డాలర్ శేషాద్రి కచ్చితంగా ఉండాల్సిందే. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణతో సన్నిహిత సంబంధాలున్నాయి. తిరుమల పర్యటన సందర్భంగా ఎన్వీ రమణ ప్రతిసారి శేషాద్రి ఇంటికి వెళ్లేవారు. ఇటీవల తిరుమలకు వచ్చేసిన సందర్భంగా.. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని, మరోసారి తిరుమలకు వచ్చినప్పుడు కలుస్తానని శేషాద్రికి సీజేఐ ఎన్వీ రమణ చెప్పారు.
Also Read: తిరుమల శ్రీవారి ఆలయం ఓఎస్డీ డాలర్ శేషాద్రి కన్నుమూత