YV Subba Reddy: డాలర్ శేషాద్రి మరణం తీరని లోటు: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సంతాపం
Dollar Seshadri Dies: శ్రీపాల శేషాద్రి మరణం టీటీడీకి తీరని లోటు అని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. శ్రీవారి సేవే ఊపిరిగా జీవితంలో చివరి క్షణం వరకు శేషాద్రి పని చేశారు.
![YV Subba Reddy: డాలర్ శేషాద్రి మరణం తీరని లోటు: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సంతాపం Dollar Seshadri Death News: TTD Chairman YV Subba Reddy Response over Dollar Seshadris Demise YV Subba Reddy: డాలర్ శేషాద్రి మరణం తీరని లోటు: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సంతాపం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/29/2655353d5a02dd4bf487c0a62089092a_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
శ్రీపాల శేషాద్రి (డాలర్ శేషాద్రి) స్వామి మరణం టీటీడీకి తీరని లోటు అని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. నేటి ఉదయం గుండెపోటు రావడంతో డాలర్ శేషాద్రి కన్నుమూశారు. ఆయన హఠాన్మరణంపై టీటీడీ చైర్మన్ స్పందించారు. ‘తిరుమల శ్రీవారి సేవలో 1978 నుంచి తరిస్తున్న వ్యక్తి డాలర్ శేషాద్రి. వైజాగ్‌లో ఈ రోజు టీటీడీ నిర్వహించనున్న కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి శేషాద్రి స్వామి వెళ్లారు. శ్రీవారి సేవే ఊపిరిగా జీవితంలో చివరి క్షణం వరకు ఆయన సేవలు అందించారు.
డాలర్ శేషాద్రి జీవితమంతా స్వామివారి సేవలో తరించి ధన్య జీవి అయ్యారు. అందరితో ప్రేమగా, ఆలయ కార్యక్రమాల్లో అధికారులు, అర్చకులకు పెద్ద దిక్కుగా పని చేశారు. ఆయన మరణ వార్త తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని శ్రీవారిని ప్రార్థిస్తున్నానంటూ వైవీ సుబ్బారెడ్డి సంతాపం తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి మరణంపై ప్రముఖులు స్పందిస్తున్నారు. డాలర్ శేషాద్రి సతీమణి చంద్రను తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పరామర్శించారు. శేషాద్రి స్వామి మరణంపై పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.
Also Read: తిరుమల శ్రీవారి ఆలయం ఓఎస్డీ డాలర్ శేషాద్రి కన్నుమూత
తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి గారి మరణం టీటీడీ కి తీరని లోటు, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ శ్రీనివాసుడు శేషాద్రి గారి కుటుంబానికి ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని కోరుకుంటున్నా.#dollarseshadri #ttd #Tirumala pic.twitter.com/vEPJUjYxzD
— Vamsi Krishna Yadav (@Vamsi_YSR) November 29, 2021
కార్తీక దిపోత్సవంలో పాల్గొనేందుకు ఆయన విశాఖపట్నం వెళ్లారు. అక్కడ ఒక్కసారిగా ఛాతీలో నొప్పి రావడంతో డాలర్ శేషాద్రిని విశాఖలోని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా మార్గంమధ్యలోనే తుదిశ్వాస విడిచారని అధికారులు తెలిపారు. డాలర్ శేషాద్రి 1978లో తిరుమల శ్రీవారికి సేవలు చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో 2006లో ఆయన రిటైర్ అయ్యారు. ఆయన సేవలు తప్పనిసరి అని ఓఎస్టీగా టీటీడీ ఆయనకు బాధ్యతలు అప్పగించింది. చివరి క్షణం వరకు శ్రీవారిలో సేవలో ఉంటూ తరించారని టీటీడీ పేర్కొంది.
Andhra Pradesh CM YS Jagan Mohan Reddy expresses grief over the passing away of Tirumala Tirupathi Devasthaaam's OSD P Seshadri, popularly known as #DollarSeshadri. CM conveys his condolences to the bereaved family members of Seshadri.
— All India Radio News (@airnewsalerts) November 29, 2021
Also Read: AP Governor: ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ కు మరోసారి అస్వస్థత... హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రికి తరలింపు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)