Weather Updates: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. మరో మూడు రోజులు తప్పని కుండపోత.. వాతావరణ కేంద్రం వెల్లడి
AP Rain Updates: ఏపీలో నేటి నుంచి మరో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Weather Updates In AP and Telangana: నైరుతి బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మరికొన్ని రోజులు వర్షాలు కురవనున్నాయి. ఏపీలో నేటి నుంచి మరో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణలో గత ఐదు రోజులుగా వర్షాలు కురుస్తుండగా.. ఏపీలో గత మూడు రోజులుగా కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. వర్షాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో చలి ప్రభావం పెరిగింది.
కోస్తాంధ్ర, యానాంలో జనవరి 17వ తేదీ వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. వారానికి పైగా వర్ష సూచన నేపథ్యంలో వాతావరణ కేంద్రం రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, యానాం (పుదుచ్చేరి), పశ్చిమ గోదావరి జిల్లాలలో ఉరుములు, మెరుపులతో అక్కడక్కడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.
దక్షిణ కోస్తాంధ్రలోనూ ఓ మోస్తరు వర్షాలు..
దక్షిణ కోస్తాంధ్రలో కనిష్ట ఉష్ణోగ్రతలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నేడు సైతం తేలికపాటి జల్లులు కురవనున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో జనవరి 18 వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు కురవనున్నాయి. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. అకాల వర్షాల నేపథ్యంలో రైతులు తమ ధాన్యం, పంట ఉత్పత్తులను నీటి పాలు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అత్యల్పంగా నందిగామలో 18.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, జంగమేశ్వరపురంలో 20 డిగ్రీలు, కళింగపట్నంలో 19 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
View this post on Instagram
ఏపీలోని రాయలసీమలో నేడు ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. మరో మూడు రోజులపాటు సీమలో వానలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. జనవరి 18 వరకు రాయలసీమకు వర్ష సూచన ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాయలసీమలోని ఆరోగ్యవరంలో 19.5 డిగ్రీలు, నంద్యాలలో 20 డిగ్రీలు, కర్నూలులో 20 డిగ్రీలు, తిరుపతిలో 22.4 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత నాలుగైదు రోజులుగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో చలి తీవ్రత పెరుగుతోంది.
తెలంగాణ వెదర్ అప్‌డేట్..
గత ఐదు రోజులుగా తెలంగాణలో పలు జిల్లాల్లో వానలు పడుతున్నాయి. ఉరుములు, మెరుపులతో తెలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు జనవరి 17 వరకు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర వెల్లడించింది. మరి కొన్ని రోజులపాటు వర్ష సూచన నేపథ్యంలో వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగాం, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వడగండ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
Also Read: ఓర్నీ.. చేప వీర్యంతో స్పెషల్ కర్రీ.. అంత కరువేంది బ్రో!
Also Read: Gold Silver Price Today: మళ్లీ భగ్గుమన్న బంగారం ధర.. స్వల్పంగా తగ్గిన వెండి.. లేటెస్ట్ రేట్లు ఇవే..
Also Read: Hyderabad: దేశంలోనే హైదరాబాద్ టాప్.. పదేళ్లలో ఎంత మార్పో..! కేంద్రం తాజా నివేదికలో స్పష్టం
Also Read: బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్, ఉపకారవేతనాలు వెంటనే చెల్లించాలి