Weather Latest Update: 48 గంటల్లో బంగాళాఖాతంలో తుపాను, ఏపీ తెలంగాణపై ఎఫెక్ట్ ఉంటుందా?: ఐఎండీ
Weather in Hyderabad: హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతం అయి కనిపించనుంది. ఉదయం వేళల్లో హైదరాబాద్ నగరంలో పొగ మంచు ఏర్పడే అవకాశం ఉంటుంది.
Weather Latest News: ఈ రోజు కింది స్థాయిలోని గాలులు ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఈ రోజు, రేపు తెలంగాణా రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి రాష్ట్రంలో తెలికపాటి నుండి మోస్తారు వర్షాలు కొన్ని చొట్ల కురిసే అవకాశం ఉంది. వాతావరణ హెచ్చరికల్లో భాగంగా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్ని జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.
హైదరాబాద్లో వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతం అయి కనిపించనుంది. ఉదయం వేళల్లో హైదరాబాద్ నగరంలో పొగ మంచు ఏర్పడే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 21 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో ఆగ్నేయ దిశలో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 29.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 21.6 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 80 శాతంగా నమోదైంది.
ఆంధ్రప్రదేశ్లో వాతావరణం
దక్షిణ అండమాన్ సముద్రం, దానిని ఆనుకొని ఉన్న మలక్కా జలసంధి మీదుగా ఏర్పడ్డ అల్పపీడన ప్రాంతం నవంబర్ 28 నాటికి దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా పశ్చిమ దిశగా పయనించింది. ఇది నవంబర్ 30 నాటికి పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్ప పీడనంగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇది వాయువ్య దిశగా కదిలి మరింత బలపడి 48 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంపై తుపానుగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
దక్షిణ బంగ్లాదేశ్, దానిని ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీదుగా సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం ఇప్పుడు బలహీనపడింది. ఆంధ్రప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణలో తూర్పు, ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
వీటి ప్రభావం ఏపీపై కాస్త ఉండనుంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులు రెండు మూడు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులు రెండు మూడు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు.
రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులు రెండు మూడు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు.