Weather Update: ఏపీలో మరో నాలుగు రోజులపాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం
ఏపీలో మరో నాలుగు రోజులపాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కొనసాగుతున్నాయి. నైరుతి రుతుపవనాల ఉపసంహరణ రేఖ కోహిమా, సిల్చార్, కృష్ణానగర్ బారిపాడు, మల్కాన్‌గిరి, నల్గొండ, బాగల్కోట్, వెంగూర్ల, గుండా వెళుతుంది. దీని ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఇవాళ యానాం, ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు జల్లులు ఒకటి లేక రెండు ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్రాలోనూ నాలుగు రోజులపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు జల్లులు ఒకటి లేక రెండు ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది.
Mid-day forecast for Andhra Pradesh in telugu dated 19.10.2021 pic.twitter.com/t7EpK4W6dK
— MC Amaravati (@AmaravatiMc) October 19, 2021
రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు జల్లులు ఒకటి లేక రెండు ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. నైరుతి రుతుపవనాల నిష్క్రమణ వేగంగా సాగుతోంది. బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి మరింత వైదొలిగాయి. రానున్న 2 రోజుల్లో మహారాష్ట్ర, ఒడిశా, ఈశాన్య భారత్‌లోని మరికొన్ని ప్రాంతాల నుంచి రుతుపవనాలు నిష్క్రమించనున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణలోనూ మూడు రోజులపాటు సాధారణ వర్షపాతం నమోదు కానుంది. రాబోయే నాలుగు రోజుల పాటు ఎలాంటి హెచ్చరికలు లేవని తెలిపింది. తెలంగాణలో పొడి వాతావరణం ఉండనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడనున్నాయని వెల్లడించింది.
— IMD_Metcentrehyd (@metcentrehyd) October 19, 2021
Also Read: టీడీపీ ఆఫీసులపై దాడులు స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం... సీఎం, డీజీపీలకు తెలిసే దాడులు జరిగాయి... చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు
Also Read: టీడీపీ ఆఫీసులపై దాడులతో వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదు... ఇది చంద్రబాబు ఆడిస్తున్న డ్రామా.. వైఎస్ఆర్సీపీ నేతల ఆరోపణ
Also Read: ప్రజలు ఆవేశాలకు గురికావద్దు.. సంయమనం పాటించండి : డీజీపీ ఆఫీస్
Also Read: కుక్కకు రూ.15 కోట్ల ఆస్తి రాసేసిన ప్లేబాయ్ మోడల్, కారణం తెలిస్తే షాకవ్వడం ఖాయం!
Also Read: చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలకు షాకిచ్చిన కేంద్రం .. ఇక అన్నీ చెప్పాల్సిందే..!
Also Read: ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి