Weather Updates: ఇక క్రమంగా పెరుగుతున్న ఎండలు! ఏపీ, తెలంగాణలో నేటి వాతావరణ పరిస్థితి ఇదీ
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. రాష్ట్రమంతా ఎలాంటి వర్ష సూచన లేదు. వాతావరణం అంతా పొడిగానే ఉంటుంది.
ఏపీ, తెలంగాణలో నేడు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి, హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రాల అధికారులు వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించారు. అదే సమయంలో క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని తెలిపారు. అమరావతిలోని వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. ఆంధ్రప్రదేశ్, యానాంలో ఈశాన్య గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణం పొడిగానే ఉండనుంది.
ఈ ఈశాన్య గాలుల ప్రభావంతో రాగల మూడు రోజుల వరకూ ఎలాంటి వర్షం ఉండబోదని వెల్లడించారు. ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. కనిష్ణ ఉష్ణోగ్రతలు నెమ్మదిగా పెరిగే అవకాశం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఇక గత 24 గంటల్లో సముద్రంలో ఏర్పడ్డ మేఘాల వల్ల నిన్న రాత్రి విశాఖపట్నంలోని ఉత్తర భాగాల్లో వర్షాలు కురిసాయని ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ తెలిపారు. రాత్రి సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయని అన్నారు.
Synoptic features of weather inference for Andhra Pradesh in Telugu language dated 12.02.2022. https://t.co/wU7SLahI6T
— MC Amaravati (@AmaravatiMc) February 12, 2022
తెలంగాణలో ఇలా..
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. రాష్ట్రమంతా ఎలాంటి వర్ష సూచన లేదు. వాతావరణం అంతా పొడిగానే ఉంటుంది. ఇలాంటి పరిస్థితే మరో మూడు నాలుగు రోజులు ఉండనుందని అంచనా వేశారు.
— IMD_Metcentrehyd (@metcentrehyd) February 12, 2022
హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. ఉదయం సమయంలో పొగ మంచు ఏర్పడే అవకాశం ఉంది. నిర్మలంగా ఉంటుంది. ఉదయం సమయంలో కొన్ని చోట్ల పొగమంచు ఏర్పడే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 31 డిగ్రీలు, 17 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంటుంది. తూర్పు దిశ నుంచి ఉపరితల గాలులు గంటకు 4 కిలో మీటర్ల నుంచి 6 కిలో మీటర్ల వరకూ వీచే అవకాశం ఉంటుంది. ముందు రోజు గరిష్ఠ ఉష్ణోగ్రత 30.6 డిగ్రీలుగా, కనిష్ఠ ఉష్ణోగ్రత 17.6 డిగ్రీలుగా నమోదైంది.
— IMD_Metcentrehyd (@metcentrehyd) February 12, 2022