అన్వేషించండి

Weather Latest Update: బలహీనపడ్డ తీవ్ర వాయుగుండం, ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు - ఐఎండీ అలర్ట్

Weather Warnings: ఈరోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో చాలా జిల్లాలలో ఉరుములు, ఈదురుగాలులు గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో వీచే అవకాశం వుంది.

Weather Latest News: సెప్టెంబరు 9న హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పశ్చిమ-మధ్య, పరిసర వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న  తీవ్ర వాయుగుండం ఈరోజు ఉదయం(సెప్టెంబర్ 9న ) 0830 గం.లకు వాయువ్య  బంగాళాఖాతంలో పూరి కి (ఒడిశా ) తూర్పు - ఆగ్నేయ దిశలో 50 కి. మీ., పరాదీప్ కు (ఒడిశా ) నైరుతి దిశలో 90 కి. మీ. మరియు కళింగపట్నంకు (ఆంధ్రప్రదేశ్ ) తూర్పు - ఈశాన్య దిశలో 260 కి. మీ. దూరంలో కేంద్రీకృతమై ఉన్నది. 

ఇది వాయువ్య దిశగా కదులుతూ ఒడిశా తీరాన్ని, పూరి వద్ద ఈరోజు అనగా సెప్టెంబర్ 9న రాబోయే 3 గం.లలో దాటే అవకాశం వుంది. ఋతుపవన ద్రోని ఈరోజు సగటు సముద్ర మట్టానికి బికానర్, సికార్, ఖజురహో , బిలాస్పూర్, పూరి, వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న  తీవ్ర వాయుగుండం యొక్క కేంద్రం గుండా  కొనసాగుతున్నది.

రాగల 3 రోజులకు వాతావరణ సూచన: (Weather Forecast):

ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు చాలాచోట్ల, రేపు మరియు ఎల్లుండి కొన్ని చోట్ల  కురిసే అవకాశం ఉంది.

వాతావరణ హెచ్చరికలు (weather warnings):

ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉంది. ఈరోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో చాలా జిల్లాలలో ఉరుములు మరియు  ఈదురుగాలులు గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో వీచే అవకాశం వుంది.

ఈరోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో చాలా జిల్లాలలో ఉరుములు మరియు  ఈదురుగాలులు గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో వీచే అవకాశం వుంది. నేడు భారీ వర్షాలు తెలంగాణలోని ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్  జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. నగరంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. 28 నుంచి 23 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 28 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు వాయువ్య దిశలో వీచే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 8 - 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 28.5 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23.6 డిగ్రీలుగా నమోదైంది. 89 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.

ఏపీలో వాతావరణం ఇలా
Andhra Pradesh Weather News: వాయువ్య, దానిని ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గత 6 గంటల్లో గంటకు 10 కిలో మీటర్ల వేగంతో దాదాపు ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ 2024 సెప్టెంబర్ 9న ఉదయం 8.30 గంటలకు వాయువ్య బంగాళాఖాతంలో 19.6 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 86.2 డిగ్రీల తూర్పు రేఖాంశంలో పూరీకి తూర్పు ఆగ్నేయంగా 50 కిలో మీటర్ల దూరంలో పారాదీప్ కు నైరుతి దిశగా 90 కిలో మీటర్ల దూరంలో గోపాల్ పూర్ కు తూర్పు, ఈశాన్యంగా 140 కిలో మీటర్ల దూరంలో, కళింగపట్నానికి తూర్పు ఈశాన్యంగా 260 కిలో మీటర్ల దూరంలో ఉంది.

ఇది వాయువ్య దిశగా పయనించి తదుపరి 3 గంటల్లో పూరీ సమీపంలో ఒడిశా తీరం దాటే అవకాశం ఉంది. ఒడిశా మీదుగా మరింత వాయువ్య దిశగా కదులుతూ సాయంత్రం వరకు తీవ్ర వాయుగుండం తీవ్రతను కొనసాగించి, 9వ తేదీ అర్థరాత్రికి క్రమంగా వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉంది. ఆ తర్వాత రాగల 24 గంటల్లో ఛత్తీస్ గడ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉంది.

ఈ ప్రభావంతో ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది.  భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తాలోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు కొన్ని చోట్ల 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

రాయలసీమలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బలమైన ఈదురు గాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Prajapalana Day: 'బానిస సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం' - అమరవీరులకు నివాళులర్పించిన సీఎం రేవంత్, దాశరథి కవితతో ప్రసంగం ప్రారంభం
'బానిస సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం' - అమరవీరులకు నివాళులర్పించిన సీఎం రేవంత్, దాశరథి కవితతో ప్రసంగం ప్రారంభం
Ganesh Immersion Live Updates: కాసేపట్లో బాలాపూర్‌ గణేషుడి లడ్డూ వేలం
కాసేపట్లో బాలాపూర్‌ గణేషుడి లడ్డూ వేలం
Keerthi Richmond Villas Ganesh Laddu 2024: కోటి 87లక్షల గణపయ్య లడ్డూ - కీర్తి రిచ్ మండ్ విల్లాస్‌లో రికార్డు ధర
గణపయ్య లడ్డూ కోటి 87లక్షలు - కీర్తి రిచ్ మండ్ విల్లాస్‌లో రికార్డు ధర
Ganesh Nimajjanam : వినాయక నిమజ్జనంలో బోల్తాపడ్డ రేవంత్ సర్కార్-కోర్టుకు చిక్కినట్లేనా..?
వినాయక నిమజ్జనంలో బోల్తాపడ్డ రేవంత్ సర్కార్-కోర్టుకు చిక్కినట్లేనా..?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నిజాం రాజ్యం ఇండియాలో విలీనమయ్యాక ఖాసిం రజ్వీ ఏమయ్యాడు?Operation Kagar Maoists Death Toll | ప్రాణాలు కోల్పోతున్న అడవిలో అన్నలు | ABP Desamసింపుల్‌గా గుడిలో పెళ్లి చేసుకున్న అదితి రావు, సిద్దార్థ - ఫొటోలు వైరల్ట్రాఫిక్ వాలంటీర్లుగా గౌరవంగా బతుకుతామంటున్న ట్రాన్స్‌జెండర్స్‌

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Prajapalana Day: 'బానిస సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం' - అమరవీరులకు నివాళులర్పించిన సీఎం రేవంత్, దాశరథి కవితతో ప్రసంగం ప్రారంభం
'బానిస సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం' - అమరవీరులకు నివాళులర్పించిన సీఎం రేవంత్, దాశరథి కవితతో ప్రసంగం ప్రారంభం
Ganesh Immersion Live Updates: కాసేపట్లో బాలాపూర్‌ గణేషుడి లడ్డూ వేలం
కాసేపట్లో బాలాపూర్‌ గణేషుడి లడ్డూ వేలం
Keerthi Richmond Villas Ganesh Laddu 2024: కోటి 87లక్షల గణపయ్య లడ్డూ - కీర్తి రిచ్ మండ్ విల్లాస్‌లో రికార్డు ధర
గణపయ్య లడ్డూ కోటి 87లక్షలు - కీర్తి రిచ్ మండ్ విల్లాస్‌లో రికార్డు ధర
Ganesh Nimajjanam : వినాయక నిమజ్జనంలో బోల్తాపడ్డ రేవంత్ సర్కార్-కోర్టుకు చిక్కినట్లేనా..?
వినాయక నిమజ్జనంలో బోల్తాపడ్డ రేవంత్ సర్కార్-కోర్టుకు చిక్కినట్లేనా..?
RG Kar Corruption Case: టీఎంసీ మెడకు ఆర్‌జీకర్ కేసు- ఎమ్‌ఎల్‌ఏ సుదీప్తో రాయ్‌ నివాసంలో సీబీఐ సోదాలు
టీఎంసీ మెడకు ఆర్‌జీకర్ కేసు- ఎమ్‌ఎల్‌ఏ సుదీప్తో రాయ్‌ నివాసంలో సీబీఐ సోదాలు
NDA 3.O @ 100 Days: వంద రోజులు పూర్తి చేసుకున్న మోదీ 3.0 సర్కారు తీసుకున్న కీలక నిర్ణయాలివే !
వంద రోజులు పూర్తి చేసుకున్న మోదీ 3.0 సర్కారు తీసుకున్న కీలక నిర్ణయాలివే !
Mokshagna Teja Debut Movie: 100 కోట్లతో నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ మూవీ... బాలయ్య తనయుడి ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
100 కోట్లతో నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ మూవీ... బాలయ్య తనయుడి ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Actress Indraja: ముఖ్యమంత్రి భార్యగా ఇంద్రజ - 'సీఎం పెళ్లాం' సమాజంలోకి వస్తే...
ముఖ్యమంత్రి భార్యగా ఇంద్రజ - 'సీఎం పెళ్లాం' సమాజంలోకి వస్తే...
Embed widget