By: ABP Desam | Updated at : 08 Jan 2022 09:58 AM (IST)
ఏపీ, తెలంగాణ వెదర్ అప్డేట్స్ (Representational Image)
Weather Updates: ఏపీ, తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గడంతో చలి తీవ్రత రోజురోజుకూ తగ్గుతోంది. ఈశాన్య, తూర్పు దిశల నుంచి ఏపీలో గాలులు తక్కువ ఎత్తులో వీస్తున్నాయిని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ఫలితంగా కోస్తాంధ్ర, యానాంలో నేటి నుంచి మరో రెండు రోజులపాటు వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతుండటంతో చలి ప్రభావం అంతగా కనిపించడం లేదని వాతావరణ కేంద్రం తెలిపింది.
మత్స్యకారులు వేటకు వెళ్లడానికి ఇబ్బంది లేదని వాతావరణ కేంద్రం సూచించింది. విశాఖ, విజయనగరం జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కళింగపట్నంలో 16.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, బాపట్లలో 17.5 డిగ్రీలు, నందిగామలో 17.2 డిగ్రీల మేర తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. దక్షిణ కోస్తాంధ్రలో వాతావరణంలో ఏ మార్పులు లేవు. మరో రెండు రోజులపాటు వాతావరణం పొడిగా ఉండనుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గడంతో వాతావరణం కాస్త వేడిగా మారింది. ఏపీలోని రాయలసీమలో వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక్కడ సైతం ఎలాంటి వర్ష సూచన లేదు. ఆరోగ్యవరంలో కనిష్టంగా 17.5 డిగ్రీలు, కర్నూలులో 18.7 డిగ్రీలు, నంద్యాలలో 19.4 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతున్నాయి.
తెలంగాణ వెదర్ అప్‌డేట్..
ఆగ్నేయం, తూర్పు దిశ నుంచి తెలంగాణలో తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉదయం వేళ కొన్ని ప్రాంతాల్లో పొగ మంచు కురుస్తుంది. డిసెంబర్ 9 నుంచి మూడు రోజులపాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ సైతం జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల నుంచి గరిష్ట ఉష్ణోగ్రతలు 28 డిగ్రీల వరకు ఉంటాయని వాతావరణ శాఖ పేర్కొంది.
— IMD_Metcentrehyd (@metcentrehyd) January 7, 2022
Also Read: వనమా రాఘవ ఆగడాలకు అడ్డేలేదా?... ఆది నుంచి ఆరోపణల పర్వమే...!
Alluri Sitarama Raju: తెల్లవాళ్లు అల్లూరి తలకి వెల కడితే... ఆయన వాళ్ళ శవాలకు కట్టాడు
PM Modi: అల్లూరి యుగ పురుషుడు, ఈ నేల ఎంతో ప్రేరణనిచ్చింది-భీమవరంలో ప్రధాని మోదీ
Breaking News Live Telugu Updates: అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ - సీతారామరాజు వారసులకు సత్కారం
CM Jagan Speech: దేశానికి గొప్ప స్ఫూర్తిప్రదాత అల్లూరి, అందుకే అల్లూరి జిల్లా ఏర్పాటు చేసుకున్నాం - సీఎం జగన్
Alluri Jayanthi: తెలుగు జాతికి గర్వకారణం అల్లూరి, జాతీయ స్థాయిలో అంతగా గుర్తింపు రాలేదు: చంద్రబాబు
Talasani Srinivas: మోదీ సభ చప్పగా ఉంది, కేసీఆర్ అడిగిన ప్రశ్నల సంగతేంటి?
Khammam Bike Fire Accident: పెట్రోల్ కొట్టించగానే బైక్ నుంచి మంటలు - అలర్ట్ అయిన యువకులు ఏం చేశారంటే !
Chocolate: మూడ్ బాగోలేదా? వెంటనే ఓ చాక్లెట్ ముక్కను నోట్లో వేసుకోండి
Maharashtra Floor Test Result: బలపరీక్షలో ఏక్నాథ్ షిండే సర్కార్ గెలుపు