Vizianagaram News: విజయనగరంలో దారుణం... పెళ్లిచేసుకోబోయే యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన యువకుడు... ఘటనపై సీఎం ఆరా
విజయనగరం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అనుమానంతో పెళ్లి చేసుకోబోయే యువతిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టాడో ఓ ఉన్మాది.
ఆంధ్రప్రదేశ్ లో మహిళలు, బాలికలపై దాడులు ఆగడం లేదు. ప్రభుత్వం కఠిన చట్టాలు అమలు చేస్తున్నా.. మృగాళ్లలో మార్పు రావడం లేదు. మొన్న గుంటూరు నగరంలో పట్టపగలే ఓ కిరాతకుడు బీటెక్ విద్యార్థినిని కత్తితో పొడిచి చంపాడు. ఆ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. మహిళలకు రాష్ట్రంలో భద్రత లేదని ప్రతిపక్షం విమర్శలు గుప్పించింది. ఈ ఘటన ఇంకా మరవక ముందే విజయనగరం జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది.
విజయనగరంలో దారుణం
విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చౌడవాడలో యువతిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టాడో ఓ యువకుడు. యువకుడ్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన యువతి అక్క, ఆమె కుమారుడికి కూడా గాయాలయ్యాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధిత యువతిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. యువతి అక్క, ఆమె కుమారుడిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించి ప్రాథమిక చికిత్స చేశారు. మెరుగైన చికిత్స కోసం వారిని విజయనగరం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు అన్నారు.
Also Read: Hyderabad: ఇంట్లోకి చొరబడి దొంగతనం.. కానీ మంచోడట! అవాక్కైన బాధితుడు.. ఎలాగంటే..
అనుమానంతో దాడి
కొద్ది రోజుల క్రితం ఈ యువతికి జిల్లాలోని నరవ గ్రామానికి చెందిన రాంబాబు అనే యువకుడితో వివాహం నిశ్చయం అయ్యింది. అయితే యువతి మరొకరితో ఫోన్‌లో మాట్లాడుతుందనే అనుమానంతో ఆ యువకుడు పెళ్లి రద్దు చేసుకున్నాడు. చివరికి పోలీసులు ఇరు కుటుంబాల మధ్య రాజీ కుదుర్చడంతో ఆమెను వివాహం చేసుకునేందుకు రాంబాబు ఒప్పుకున్నాడు. నిన్న రాత్రి చౌడువాడలోని యువతి ఇంటికి వచ్చిన రాంబాబు.. యువతితో గొడవకు దిగాడు. యువతి తానెవరితోనూ ఫోన్ మాట్లాడటం లేదని చెప్పినా వినకుండా దాడి చేశాడు. తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ యువతిపై పోసి నిప్పు అంటించాడు. అడ్డుకోబోయిన యువతి అక్క, ఆమె కుమారుడిపై కూడా రాంబాబు పెట్రోల్ పోశాడు. యువతిని కాపాడే ప్రయత్నంలో వారిద్దరికీ కూడా గాయాలయ్యాయి.
Also Read: Avanthi Srinivas Audio Tape: మంత్రి ఆడియో టేప్ హల్‌చల్.. మహిళతో ఆ మాటలు, స్పందించిన అవంతి శ్రీనివాస్
యువతి పరిస్థితి విషమం
దాడి అనంతరం రాంబాబు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువతి పరిస్థితి విషయంగా ఉన్నట్లు విజయనగరం జిల్లా ఆసుపత్రి వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
ఘటనపై సీఎం జగన్ ఆరా
విజయనగరం జిల్లాలో యువతిపై పెట్రోలు దాడి ఘటనపై సీఎం జగన్ ఆరా తీశారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉండాలని మంత్రులకు సూచించారు. వైద్య సేవలను పర్యవేక్షించాలన్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు బాధితురాలిని ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి, మంత్రి బొత్స సత్యనారాయణ పరామర్శించారు. యువతికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
Also Read: Taliban in Kabul: అరాచకంగా తాలిబన్ల తీరు.. మూసేసిన భారత ఎంబసీల్లోకి చొరబడి వాటిని ఎత్తుకెళ్లారు