అన్వేషించండి

YSRCP Bus Yathra : ప్రతిపక్షాల ఆరోపణలకు సమాధానంగా బస్సు యాత్ర- వ్యతిరేకత రాకుండా వైసీపీ స్కెచ్‌

YSRCP Bus Yathra: రాష్ట్రాన్ని ప్రగతి పథాన నడిపించడంలో జగన్ ఫెయిల్ అయ్యారన్న ప్రతిపక్షాల ప్రచారానికి చెక్‌ పెట్టేలా వైసీపీ స్కెచ్ వేసింది. అన్నింటికి సమాధానం చెప్పేలా మంత్రులతో బస్సయాత్రకు సిద్ధమైంది.

YSRCP Bus Yathra: జయహో జగనన్న నినాదంతో సిక్కోలు నుంచి ప్రారంభించనున్న వైసీపీ బస్సుయాత్రకు ఆ పార్టీ కేడర్ సిద్ధమైంది. 'సామాజిక న్యాయభేరి' పేరిట చేపట్టనున్న యాత్ర నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు బుధవారం సాయంత్రానికి జిల్లాకు చేరుకున్నారు. అభివృద్ధి.. సంక్షేమం.. సామాజిక విప్లవం మూడేళ్ల సాధించిన విజయాలపై ప్రధానంగా ఈ బస్సుల యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి వివరించేందుకు రాష్ట్రవ్యాప్తంగా నాలుగు రోజులు పాటు పర్యటనపై ఇప్పటికే షెడ్యూలు ప్రకటించారు. కోనసీమలో చెలరేగిన వివాదాలు నేపథ్యంలో వాయిదా పడుతుందని పుకార్లు వచ్చినప్పటికి తొలి ప్రకటించిన షెడ్యూలు మేరకు యాత్ర సాగనుంది. 

నిన్నే చేరుకున్న మంత్రులు

సిక్కోలు నుంచే యాత్ర ప్రారంభించనుండటంతో రాష్ట్ర మంత్రి ధర్మాన ప్రసాదరావు, జిల్లా ఇన్చార్జి మంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణ దాస్ ఈ ఏర్పాట్లపై చర్చించారు. వారితో పాటు మరో మంత్రి అప్పలరాజు నియోజకవర్గ ఎమ్మెల్యేలు, విజయనగరం ఎంపీ ఈ యాత్రను విజయవంతం చేయాలని క్యాడర్‌కు పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారన్న ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణపై సమాధానం చెప్పేందుకే ఈ యాత్రకు సిద్ధమయ్యారు. 

ప్రజలకు వివరించేలా

ప్రధానంగా రాజ్యసభ విషయంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఇద్దరిని ఎంపిక చేసిన తరువాత ఏర్పడిన పరిణామాలతో ఈ యాత్రకు పార్టీ నిర్ణయం తీసుకుందనే చెప్పాలి. అంతకు వరకు గడపగడపకు ప్రభుత్వం అనే నినాదాంతో ప్రజలలో పథకాల కోసం వివరిస్తుండగా ఆకస్మికంగా ఈ యాత్రకు సిద్ధమయ్యారు. నేను విన్నాను.. నేను ఉన్నాను.. అంటూ 2019 సాధారణ ఎన్నికలకు ముందు చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ఈ మూడేళ్లలో తీర్చగలిగామని ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రకటిస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లి వివరిస్తున్నారు. అక్కడక్కడ ప్రతి ఘటనలు ఎదురైన వాటిని సర్దుకుంటూ ముందుకు వెళ్తున్నారు. 

పథకాలపై ప్రచారం

బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ పదవుల కేటాయింపులో సామాజిక విప్లవాన్ని సృష్టించిన తీరును ప్రజల్లోకి వెళ్లి వివరించడం ద్వారా వారిలో ఉండే అపోహాలను తొలగించవచ్చని అధిష్టానం భావిస్తోంది. ఈనేపథ్యంలో బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలకు చెందిన 17 మంది మంత్రులు ఈ బస్సు యాత్రలో భాగస్వామ్యం అవుతున్నారు. ప్రతిపక్షాల జోరుకు బ్రేకులు వేయాలంటే మంత్రులు నాలుగు రోజులపాటు యాత్ర చేసి, ప్రభుత్వ పథకాలపై మరింత ఎక్కువగా ప్రచారం చేసి, తమ పాలనపై ప్రజలలో మరింత అవగాహన పెంచాలన్న ఉద్దేశంతో ఈ బస్ టూర్‌కు శ్రీకారం చుట్టారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Asifabad Student Dies: ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
Earthquake In Prakasam: 5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
Agriculture: వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Asifabad Student Dies: ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
Earthquake In Prakasam: 5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
Agriculture: వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
Virat Kohli News: వారం రోజుల్లో తప్పు సరిదిద్దుకో- కోహ్లీకి నోటీసులు
వారం రోజుల్లో తప్పు సరిదిద్దుకో- కోహ్లీకి నోటీసులు
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
UI Movie Leaked Online: రియల్ స్టార్ ఉపేంద్రకు షాక్... విడుదలైన గంటల్లోనే ఆన్‌లైన్‌లో 'యూఐ' మూవీ లీక్
రియల్ స్టార్ ఉపేంద్రకు షాక్... విడుదలైన గంటల్లోనే ఆన్‌లైన్‌లో 'యూఐ' మూవీ లీక్ చేసేశారు
Embed widget