అన్వేషించండి

ఇవే చివరి ఎన్నికలు అంటున్న వైసీపీ నేతలు.. సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా..!

Andhra Pradesh: వైసీపీలో సీనియర్ నేతలుగా చలామణి అవుతున్న పలువురు రానున్న ఎన్నికలు నేపథ్యంలో సెంటిమెంట్ పండించే ప్రయత్నం చేస్తున్నారు. సీనియర్ నేతలు ఉండడం గమనార్హం.

YSRCP Leaders : రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో అధికార వైసిపి అడుగులు వేస్తోంది. వై నాట్ 175 అంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) వార్ డిక్లేర్ చేస్తే.. వై నాట్ పులివెందుల(Pulivendula) అంటూ తెలుగుదేశం(Telugu Desam ) పార్టీ జనసేన(Janasena ) కూడా యుద్ధానికి సిద్ధం అంటోంది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు గేర్పే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. రానున్న ఎన్నికలు ప్రతిష్టాత్మకం కావడంతో వైసిపి ముఖ్య నేతలు అస్త్ర, శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఒకవైపు ఎన్నికల వ్యూహాలను రచించుకుంటూనే.. మరోవైపు సెంటిమెంట్ పండించే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ నేతలు. గత కొన్నాళ్ల నుంచి రాజకీయంగా కీలక పదవులను అనుభవించిన ఎంతోమంది నేతలు.. వచ్చే ఎన్నికల్లో విజయం కోసం సెంటిమెంట్ పండించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ జాబితాలో వైసీపీకి చెందిన సీనియర్ నేతలు ఉండడం గమనార్హం. 

ఇవే చివరి ఎన్నికలు అంటూ సెంటిమెంట్

వైసీపీలో సీనియర్ నేతలుగా చలామణి అవుతున్న పలువురు రానున్న ఎన్నికలు నేపథ్యంలో సెంటిమెంట్ పండించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవే తమ చివరి ఎన్నికలు అంటూ ఓట్లు పొందే ప్రయత్నం చేస్తున్నారు. చివరి ఎన్నికలు అని చెబుతున్న వారిలో సీనియర్ నేతలు ఉండడం గమనార్హం. ఈ జాబితాలో సీనియర్ మంత్రులుగా కొనసాగుతున్న బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, ఫైర్ బ్రాండ్ గా పేరుగాంచిన కొడాలి నాని(Kodali Nani) ఉన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ నేతలు తమ రాజకీయ భవిష్యత్తుపై వ్యాఖ్యలు చేస్తుండడం ఆసక్తిని కలిగిస్తోంది. 

చివరి ఎన్నికలు అవకాశం ఇవ్వాలన్న ధర్మాన

శ్రీకాకుళం(Srikakulam) జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు(Dharmana Prasada Rao) ఆదివారం కళింగ కోమట్లతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు రానున్న ఎన్నికలే చివరివని, మరోసారి అవకాశాన్ని కల్పించాలని కోరారు. ఈ ఎన్నికల్లోనే తాను రిటైర్ కావాలని భావించాలని, జగన్, తన కుమారుడి ఒత్తిడితోనే పోటీలోకి మళ్ళీ దిగుతున్నట్లు పేర్కొన్న ధర్మాన.. వచ్చే ఎన్నికల నాటికి తాను రాజకీయాల్లో ఉండనని స్పష్టం చేశారు. పార్టీ కష్ట కాలంలో వదిలేసాను అన్న అపవాదు తనపై రాకూడదు అన్న ఉద్దేశంతోనే పోటీ చేస్తున్నట్లు వివరించారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో వైశ్యుల అభ్యున్నతికి ఎంతో కృషి చేశానని, చివరిసారిగా తనకు మరొక అవకాశాన్ని ఇవ్వాలని ఈ సందర్భంగా ధర్మాన విజ్ఞప్తి చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రాజకీయాల్లో కొనసాగడం పై ధర్మాన చేసిన ఈ వ్యాఖ్యలు ఆసక్తిని రేపాయి. 

ఇదే తరహాలో మాట్లాడిన బొత్స

వైసీపీలో సీనియర్ నేతగా ఉన్న మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) కూడా ఇదే తరహాలో మాట్లాడడం గమనార్హం. సోమవారం సాయంత్రం విశాఖలో మీడియాతో మాట్లాడిన మంత్రి బొత్స.. తనకు రానున్న ఎన్నికలే చివరివని స్పష్టం చేశారు. 2024 ఎన్నికల తర్వాత ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలగం ఉన్నట్లు బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఓటమి భయం ఉన్నవారే తరచూ నియోజకవర్గాలు మారుతారు అంటూ గంటాపై సెటైర్లు విసిరిన మంత్రి బొత్స.. 2029 ఎన్నికల నాటికి మాత్రం పోటీలో ఉండబోనని స్పష్టం చేశారు. వయసు పైబడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. 

58 ఏళ్ల తర్వాత పోటీ చేయబోనన్న కొడాలి

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ నేతగా పేరుగాంచిన కొడాలి నాని కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు. గడిచిన నాలుగు ఎన్నికల్లో విజయాలు సాధిస్తూ వస్తున్న కొడాలి నాని.. వచ్చే ఎన్నికల్లోను విజయమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రస్తుతం తనకు 53 ఏళ్లు వచ్చాయని, 2029 నాటికి 58 ఏళ్లు వస్తాయన్నారు. 58 ఏళ్ల వయసులో పోటీ చేయలేమని, ఈ ఎన్నికల తనకి చివరవని స్పష్టం చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా వైసీపీ నేతలు చేస్తున్న తాజా వ్యాఖ్యలు.. రాజకీయంగా సెంటిమెంట్ రగిలించేందుకే చేస్తున్నారా, లేక నిజంగానే ఎన్నికల బరిలో నుంచి తప్పించుకునే ఉద్దేశంతోనే అంటున్నారా అన్నది ఆ నేతలకే తెలియాల్సి ఉంది. వైసిపి ముఖ్య నేతలు ఈ తరహా ప్రకటనలు పట్ల టిడిపి, జనసేన నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఓటమి భయంతోనే వైసీపీ నేతలు ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Fuel Filling Tips: బైక్ లేదా పెట్రోల్‌ను ట్యాంక్ ఫుల్ చేస్తున్నారా? - అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
బైక్ లేదా పెట్రోల్‌ను ట్యాంక్ ఫుల్ చేస్తున్నారా? - అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
Aus VS Ind Series: ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడుశ్రీతేజ్‌ హెల్త్‌‌ బులెటిన్ రిలీజ్, బిగ్ గుడ్ న్యూస్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Fuel Filling Tips: బైక్ లేదా పెట్రోల్‌ను ట్యాంక్ ఫుల్ చేస్తున్నారా? - అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
బైక్ లేదా పెట్రోల్‌ను ట్యాంక్ ఫుల్ చేస్తున్నారా? - అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
Aus VS Ind Series: ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
Google Chrome AI Mode: గూగుల్ సెర్చ్‌లో ఏఐ మోడ్ - ఛాట్‌జీపీటీ పోటీని తట్టుకోవడానికి!
గూగుల్ సెర్చ్‌లో ఏఐ మోడ్ - ఛాట్‌జీపీటీ పోటీని తట్టుకోవడానికి!
Russia Ukraine War: ట్విన్ టవర్స్ పై  9/11 అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
రష్యాపై 9/11 తరహా దాడి.. కజాన్ నగరంలో భారీ టవర్స్‌పై డ్రోన్లతో ఎటాక్ర- వీడియో
UPSC Civils Interview: సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ షెడ్యూలు విడుదల - తేదీలు, సమయం ఇవే
సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ షెడ్యూలు విడుదల - తేదీలు, సమయం ఇవే
Bajaj Chetak 35: కొత్త బజాజ్ చేతక్ 35 సిరీస్ వచ్చేసింది - ధర ఎంతంటే?
కొత్త బజాజ్ చేతక్ 35 సిరీస్ వచ్చేసింది - ధర ఎంతంటే?
Embed widget