World Adivasi Day 2023: రేపే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం - సమస్యల పరిష్కారం కోసం 4కి.మీ డోలీ యాత్రతో నిరసన
World Adivasi Day 2023: అనకాపల్లి జిల్లా రోలుగుండ మండలంలోని ఆదివాసీ ప్రజలంతా నాలుగు కిలో మీటర్ల మేర డోలీ యాత్ర చేపట్టారు. తమ సమస్యలకు పరిష్కారం చూపాలని కోరుతూ.. రోడ్డెక్కారు.
![World Adivasi Day 2023: రేపే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం - సమస్యల పరిష్కారం కోసం 4కి.మీ డోలీ యాత్రతో నిరసన World Adivasi Day 2023 Celebrations Tribal People Dolly Yatra Four KM to get Solutions For Their Problems World Adivasi Day 2023: రేపే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం - సమస్యల పరిష్కారం కోసం 4కి.మీ డోలీ యాత్రతో నిరసన](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/08/ad99ef5c8a377ec47ad56b3be06367741691501180831519_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
World Adivasi Day 2023: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీలు నాలుగు కిలో మీటర్ల మేర డోలీ యాత్ర చేపట్టారు. తమ గ్రామాలకు రోడ్లు వేయాలని, నీలబంధ గ్రామానికి విద్యుత్ సరఫరా సౌకర్యం కల్పించాలని కోరుతూ.. ఆదివాసీ ప్రజలంతా రోడ్డెక్కారు. ఈ నెల 9వ తేదీన అంటే బుధవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. ఈ సందర్భంగానే సోమవారం గిరిజనులంతా రోడ్డెక్కారు. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం ఆర్ల పంచాయితీ నిలబంధ గ్రామంలో డోలీ యాత్ర ప్రారంభించి పిత్రుగెడ్డ, పెద్దగరువు గ్రామాల మీదుగా జాజులబంద వరకు వెళ్లి అక్కడ ముగించారు. అర్ల నుంచి పెద్దగరువు, పిత్రుగెడ్డ, జాజులబంద వంటి కొండ శిఖర గ్రామాలకు తక్షణమే రోడ్లు వేయాలని వారంతా డిమాండ్ చేశారు.
ఆయా ప్రాంతాల్లో ఎస్‌టీ కోందు తెగకు చెందిన సుమారు 300 మంది కొండపైనే జీవనం సాగిస్తున్నారు. 2020లో ఒక్కో ఇంటికి రూ.10వేల చొప్పున చందాలు పోగు చేసుకుని రూ.7లక్షల సొంత ఖర్చుతో ఆదివాసీలే రోడ్డు నిర్మించుకున్నారు. అయితే వర్షాకాలం నేపథ్యంలో ఆ రోడ్డు కాస్త కొట్టుకుపోయింది. అదే విధంగా జ్వరాల బారిన పడితే కి.మీ మేర రోగుల్ని డోలీల్లో మోసుకుంటూ ఆస్పత్రులకు తీసుకు వెళ్లాల్సి వస్తోంది. కుంబర్ల గ్రామానికి చెందిన పాంగి రోజా అనే మహిళ అత్యవసర వేళ సరైన సౌకర్యాలు లేకపోవడంతో అడవి తల్లి ఒడిలోనే కన్నుమూసింది. ఈ విధంగా అనేక మంది మర్గ మధ్యంలోనే మృతి చెందుతున్న పరిస్థితులు ఉన్నాయి.
దీంతో సోమవారం భారీ సంఖ్యలో గిరిజనులు చేరుకుని ‘పలకరా అన్నలూ..ఎన్నాళ్లీ డోలీ మోతలు’ అని నినాదాలు చేసుకుంటూ డోలీయాత్రం నిర్వహించా.రు ఈ కార్యక్రమం ఆదివాసీ గిరిజన సంఘము 5వ షెడు ల్యూ సాధన కమిటీ జిల్లా గౌరవ అధ్యక్షులు కే. గోవిందరావు పి. టీ. జి సంఘము అధ్యక్షులు కొండతాంబెలి వెంకటరావు కార్యదర్శి కొర్ర సుబ్బారావు కొర్ర కొండబాబు పాల్గొన్నారు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)