News
News
X

Vizianagaram News: బొబ్బిలి రాజుల వారసులు ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా?

Vizianagaram News: బొబ్బిలి కోట గురించి, ఆనాడు తాండ్ర పాపారాయుడు చేసిన బొబ్బిలి యుద్ధం గురించి ప్రజలు ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉంటారు. అయితే ఇప్పుడు వారి వారసులెక్కడ ఉన్నారో తెలుసుకుందాం.  

FOLLOW US: 
Share:

Vizianagaram News: విజయనగరం జిల్లాలోని బొబ్బిలికోట జిల్లా కేంద్రానికి 60.కి.మీ దూరంలో ఉంది. ఈ కోట 17వ శతాబ్దంలో  నిర్మించారు. పెద్దరాయుడు (రాయుడప్ప రంగారావు) బొబ్బిలి కోట వ్యవస్థాపకుడు. ఇతను వెలుగోటి వంశీయులకు చెందిన వెంకటగిరి రాజుల 15వ వారసుడు. దక్షిణాదిలో చేసిన సేవలకు ప్రతిఫలంగా శ్రీకాకుళం(సిక్కోలు) నవాబు షేర్ మహ్మద్ ఖాన్‌కు బొబ్బిలిని ఇచ్చారు. రాజాం ఎస్టేటును వెలుగోటి వంశీయులకు చెందిన రాయప్పకు షేర్ ముహమ్మద్ ఖాన్ 1652లో బహూకరించారు. ఇతను పట్టణాన్ని స్థాపించి ఒక కోటను నిర్మించారు. పట్టణానికి గౌరవార్థం అతని పేరు మీద పెద్దపులి (బెబ్బులి) అని నామకరణం చేశారు. తర్వాత అది కాల క్రమేణా బొబ్బిలిగా రూపాంతరం చెందింది. ఈ రాజవంశీయులకు చెందిన ఆర్‌ఎస్‌ఆర్‌కె రంగారావు ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేశారు.

బొబ్బిలి... విజయనగర రాజుల వశం కాకూడదని పొరాడిన రాజాం సంస్థానాధీశుడు తాండ్ర పాపారాయుడు. బొబ్బిలి పట్టణం పేరు వినగానే 1757లో జరిగిన బొబ్బిలి యుద్ధం గుర్తుకు వస్తుంది. చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరిగినా బొబ్బిలి యుద్ధానికి ఉన్న ప్రత్యేకత వేరు. విజయనగరం జిల్లాలోని బొబ్బిలి పట్టణాన్ని పౌరుషానికి ప్రతీకగా అభివర్ణిస్తారు. పరాయి పాలనకు వ్యతిరేకంగా జరిగిన యుద్దంలో తాండ్ర పాపారాయుడు ప్రతాపానికి, వీరత్వం సాక్ష్యంగా నిలించింది. అందుకే ఈ యుద్దం వీరగాధ గురించి పాటగా, బుర్రకథగా, నాటకంగా, చలన చిత్రంగా ప్రజల‌్లో ప్రాచూర్యం పొందింది. అప్పటి యుద్దానికి చిహ్నంగా విజయనగరం జిల్లాలోని భైరవ సాగరం వద్ద స్మారక స్థూపం నిర్మించారు.

బొబ్బిలి కోట ప్రత్వేకతల విషయానికొస్తే.. ఆ రోజుల్లో దర్బార్లు నిర్వహించడం కోసం ప్రత్యేక మందిరాన్ని నిర్మించారు. ఈ దర్బార్‌ మహల్‌... కోటకు ఆకర్షణగా నేటికీ నిలుస్తోంది.

బొబ్బిలి రాజులకు చెందిన అతిథి గృహం గొప్ప ప్రాచుర్యం పొందింది. ఇప్పటికీ సందర్శకులు గెస్ట్‌ హౌస్‌ను చూసేందుకు వెళ్తుంటారు. ఇక్కడ సినిమా షూటింగ్‌లు కూడా జరుగుతూ ఉంటాయి. అప్పట్లో రాజులు వినియోగించిన సింహాసనాలు, పల్లకీలు రాచరిక భోగభాగ్యాలకు నిలువుటద్దంలా కనిపిస్తే, పురాతన నిర్మాణాలు, వస్తు సామగ్రి, వాహనాలు చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. రాణి చెల్లాయమ్మదేవి 18వ శతాబ్ధంలో నిర్మించిన మూడో కోట ఎంతో విశాలంగా, చరిత్రకు సాక్ష్యంగా కనిపిస్తుంది. దక్షిణ దేవుడు, పడమర దేవుడు, ఉత్తర దేవుడు అనే మూడు ముఖ ద్వారాలు ఈ కట్టడంలో ఉన్నాయి. రాజు వంశీయులు మాత్రమే ఉత్తర దేవుడు ద్వారా ప్రవేశం చేయడానికి అవకాశం ఉంటుంది. మిగిలిన రెండు ద్వారాలు సందర్శకులు నిత్యం వచ్చి వెళ్లేందుకు వీలు కల్పించారు. శత్రు దుర్భేద్యంగా కోట చుట్టూ నిర్మించిన ఎత్తైన ప్రహరీ సందర్శకులను ఆకట్టుకుంటుంది. సుమారు 40 అడుగుల ఎత్తుగల సింహద్వారాలు ఇప్పటికీ బలంగా ఉన్నాయి. కోట లోపల అనేక భవనాలు, లోగిళ్లు, మండపాలు కలిగి ఓ గ్రామంలా సందర్శకులకు కనువిందు చేస్తుంది.

బొబ్బిలి కోటలో నిర్మించిన ఏడు పురాతన భవనాలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. వీటిని సప్త మహాల్స్‌గా పిలుస్తారు. వందల సంవత్సరాలు గడిచినా ఈ భవనాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా చూపరులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అందులో ఒక దర్భార్‌ మహాల్‌ యూరోపియన్‌ కట్టడాన్ని తలపిస్తుంది. పూజమహాల్‌లో రాజవంశీయులు, ప్రస్తుతం మాజీమంత్రి సుజయ కృష్ణరంగారావు కుటుంబం నివాసం ఉంది. కృష్ట విలాస్‌లో ఎమ్మెల్యే సోదరుడు బేబినాయన నివాసం ఉంటున్నారు. మిగిలిన నాలుగింటిలో ప్రాంగ్‌మహాల్‌, సీతారామ మందిరం, రాణీ మహల్, లక్ష్మీవిలాస్‌ ఉన్నాయి. కోట నిర్మాణంలో బర్మా టేకు, రోజ్‌వుడ్‌ ఎక్కువగా వినియోగించారు.  కోట పడమట దిక్కున గోడకు సమీపంలో పార్కింగ్‌ స్థలంలో రాజులు ఉపయోగించిన పురాతన వాహనాలు ఇప్పటికీ కనిపిస్తాయి.

బొబ్బిలి కోటలో ప్రత్యేకంగా నిర్మించిన మ్యూజియంలో ప్రదర్శించిన యుద్ధ సామగ్రి, చిత్రాలు చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. రాజులు వినియోగించిన కత్తులు, కటారులు చూడముచ్చటగా కనిపిస్తాయి. బొబ్బిలి యుద్ధంలో తాండ్ర పాపారాయుడు వినియోగించిన ఖడ్గం ఇప్పటికీ మ్యూజియంలో ఉంది. తాండ్ర పాపారాయుడు జరిపిన పోరులో ఖడ్గానికి బుల్లెట్‌ తగిలిన గుర్తు ఖడ్గం మీద సందర్శకులను ఆకట్టుకుంటుంది. బ్రిటిష్‌ ప్రభుత్వం నుంచి తెచ్చిన సింహాసనం, తుపాకులు, రాజులు ధరించిన అతిఖరీదైన వస్త్రాలు, తలపాగాలు, కిరీటాలు, వేటాడిన పెద్దపులుల చర్మాలు, ఏనుగు అంబానీ, చారిత్రక ఆధారాలను చూపించే మరిన్నిచిత్రాలు వందల కొలదీ ఈ మ్యూజియంలో కొలువుదీరాయి.

Published at : 20 Jan 2023 03:56 PM (IST) Tags: AP News Vizianagaram News Bobbili Kings Bobbili Fort Bobbili Kings descendants

సంబంధిత కథనాలు

Fish Tunnel Exhibition : విశాఖలో ఆకట్టుకుంటున్న ఫిష్ టన్నెల్, ప్రదర్శనకు అరుదైన చేపలు  

Fish Tunnel Exhibition : విశాఖలో ఆకట్టుకుంటున్న ఫిష్ టన్నెల్, ప్రదర్శనకు అరుదైన చేపలు  

Minister Roja On Lokesh : లోకేశ్ కాదు పులకేశి, అడుగుపెడితే ప్రాణాలు గాల్లోనే- మంత్రి రోజా సెటైర్లు

Minister Roja On Lokesh : లోకేశ్ కాదు పులకేశి, అడుగుపెడితే ప్రాణాలు గాల్లోనే- మంత్రి రోజా సెటైర్లు

ఆంధ్రాను తాకిన బీబీసీ డాక్యు మెంటరీ వివాదం- ఏయూలో అర్థరాత్రి ఉద్రిక్తత

ఆంధ్రాను తాకిన బీబీసీ డాక్యు మెంటరీ వివాదం-  ఏయూలో అర్థరాత్రి ఉద్రిక్తత

Banwarilal Purohit: శారదాపీఠం మహోత్సవాల్లో పంజాబ్ గవర్నర్- రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు 

Banwarilal Purohit: శారదాపీఠం మహోత్సవాల్లో పంజాబ్ గవర్నర్- రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు 

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచారా!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచారా!

టాప్ స్టోరీస్

Taraka Ratna Health Update: తారకరత్నను గిచ్చితే రెస్పాండ్ అయ్యారు, ఇంకా టైం పడుతుంది: బాలకృష్ణ

Taraka Ratna Health Update: తారకరత్నను గిచ్చితే రెస్పాండ్ అయ్యారు, ఇంకా టైం పడుతుంది: బాలకృష్ణ

Delhi Khalistan Attacks : దిల్లీలో ఖలిస్థానీ స్లీపర్ సెల్స్, ఉగ్రదాడులకు ప్లాన్- నిఘా సంస్థల హెచ్చరిక

Delhi Khalistan Attacks : దిల్లీలో ఖలిస్థానీ స్లీపర్ సెల్స్, ఉగ్రదాడులకు ప్లాన్- నిఘా సంస్థల హెచ్చరిక

Odisha Health Minister Injured: ఆరోగ్యశాఖ మంత్రిపై కాల్పులు - తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స

Odisha Health Minister Injured: ఆరోగ్యశాఖ మంత్రిపై కాల్పులు - తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స

Chiranjeevi - Ram Charan: రామ్ చరణ్ స్థానంలో నేనే ఉన్నంత గర్వంగా ఉంది: చిరంజీవి

Chiranjeevi - Ram Charan: రామ్ చరణ్ స్థానంలో నేనే ఉన్నంత గర్వంగా ఉంది: చిరంజీవి