Vizag News: జీవితం క్షణభంగురం - ఈ మహిళ మరణమే సాక్ష్యం - వైరల్ వీడియో
Vizag Woman: స్కూటిపై వెళ్తున్న మహిళ పై చెట్టు కొమ్మ విరిగిపడి చనిపోయింది. సీసీ ఫుటేజీలో ఈ వీడియో దృశ్యాలు రికార్డయ్యాయి.

Vizag Woman dies after tree branch falls on her: జీవితం చాలా చిన్నది. ఎంత చిన్నది అంటే తర్వాత క్షణంలో బతికి ఉంటామో లేమో చెప్పలేనంత. కళ్ల ముందు అలాంటివి నిజం అనిపించే దృశ్యాలు ఎన్నో కనిపిస్తూ వస్తున్నాయి. తాజాగా విశాఖలో ఘటన ఇలాంటిదే జరిగింది.
విశాఖలోని సీతమ్మధార ప్రాంతం ఎప్పుడూ బిజీగా ఉంటుంది. గంటకు కొన్ని వందలు, వేల వాహనాలు ఆ రోడ్డు మీదుగా వెళ్తూంటాయి. అలా ఆ దారిలో పూర్ణమ అనే మహిళ కూడా.. ఆ దారి గుండా వెళ్తోంది. అక్కడ ఓ చెట్ట కింద నుంచి ఆమె వెళ్తున్నారు. చెట్టు పూర్తిగా దాటలేదు..కానీ ప్రాణాలు కోల్పోయారు. ఖచ్చితంగా పూర్ణిమ ఆ చెట్టు కిందకు వచ్చిన వెంటనే ఆ చెట్టుకూలిపోయింది. కఛ్చితంగా పూర్ణిమపై పడింది.
🚨🚨SHOCKING INCIDENT🚨🚨
— Telugu Feed (@Telugufeedsite) May 5, 2025
విశాఖలో చెట్టు కూలి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మహిళ మృతి.
మృతురాలు సీతమ్మధార సితార అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్న పూర్ణిమ ( 38)గా గుర్తింపు pic.twitter.com/Hf4ezV3VsR
పూర్ణిమ తప్పించుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. నేరుగా వచ్చి మీద పడటంతో ఏం జరిగిందో తెలియక ముందే..క్షణాల్లో ఆమె కన్ను మూశారు. చెట్టు కొమ్మను ఆమె పై నుంచి తీసేసి.. ఆస్పత్రికి తరలించారు కానీ... అప్పటికే చనిపోయినట్లుగా వైద్యులు తేల్చారు. ఈ ఘటనలో చెట్టు కింద ఉన్న రాక్టర్, కారు కూడా ధ్వంసం అయ్యాయి.
విశాఖ సీతమ్మధార ఏ ఏం జి హాస్పిటల్ వద్ద దారుణ ఘటన.
— Vizag News Man (@VizagNewsman) May 5, 2025
స్కూటీ మీద పూర్ణిమ అనే మహిళ వెళ్తుండగా చెట్టు ఒక్కసారిగా కూలి ఆమెపై పడటంతో అక్కడే మృతి. ట్రాక్టర్, కారు కూడా ధ్వంసం.#AndhraPradesh #Visakhapatnam #Vizag #TeluguNews #VizagNews pic.twitter.com/HliPV5rfr8
పూర్ణిమ ఆ దారి గుండా కొన్ని వందల సార్లు ప్రయాణించి ఉంటారు. గతంలో ఎండకు..నీడకు ఆ చెట్టు కింద సేదదీరి ఉంటారు. కానీ..ఇప్పుడు మాత్రం ఆ చెట్టు కొమ్మలే ఆమె ప్రాణం పోవడానికి కారణం అయ్యారు. ఈ చెట్టు ఆమెపై పడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.





















