By: ABP Desam | Updated at : 31 Aug 2023 10:03 AM (IST)
విశాఖ అడిషనల్ చీప్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు సంచలన తీర్పు ( Image Source : pixabay )
విశాఖ అడిషనల్ చీప్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తికి ఏడాది జైలు శిక్షతో పాటు వెయ్యి రూపాయల జరిమానా విధించింది. 2020లో చాకా లోవాంగ్ అనే మహిళను నోవాటెల్ వద్ద ఉన్న ఓ స్పాలో...బ్యూటీషియన్ గా పని చేస్తున్నారు. విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా...దుప్పడ రాంబాబు ఆమె వెంట పడేవాడు. కొన్ని రోజులు ఆమెను అనుసరించిన తర్వాత...జులై 31న చాకా లోవాంగ్ ప్రైవేట్ భాగాలను తాకి...అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె ప్రతిఘటించడంతో తీవ్రగాయంగ పరిచి పరారయ్యాడు. బాధితురాలు దిశ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 354, సెక్షన్ 354 ఏ కేసు నమోదు చేశారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. దుప్పడ రాంబాబును కోర్టులో పరిచారు. కేసు విచారించిన న్యాయస్థానం...దుప్పడ రాంబాబుకు ఏడాది జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధించింది. పోలీసుల తీసుకున్న చర్యలను కోర్టు అభినందించింది.
ఈ మధ్య ఎల్బీనగర్‌లో లాయర్ తండ్రీకుమారుడికి శిక్ష
ఇంట్లో పని చేసే బాలికపై అత్యాచారం చేసిన కేసులో ఎల్బీనగర్ కోర్టు సంచలన తీర్పు చెప్పింది. న్యాయవాదులుగా పని చేస్తున్న తండ్రీ కుమారుడు ఇంట్లో పని చేస్తున్న బాలికపై అత్యాచారం చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. కోర్టులో ట్రయల్ నడిచింది.
ఈ కేసులో రెండు పక్షాల వాదనలు విన్న ఎల్బీనగర్ పోక్సో కోర్టు నిందితులకు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. న్యాయవాదులుగా పని చేస్తున్న మేడిపల్లి భరత్, ఆయన తండ్రి మేడిపల్లి సధాకర్ ఇంట్లో పని చేస్తున్న బాలికపై అత్యాచారం చేశారని అభియోగాలు నమోదు అయ్యాయి.
బాలిక ఫిర్యాదుతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. జరిగింది వాస్తవమేనని తెల్చారు. దీంతో కోర్టులో వాదనలు నడిచాయి. నమ్మి ఇంట్లో పనికి వచ్చిన బాలికపై అత్యాచారం చేయడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది.
ఇరు పక్షాల వాదనలు విని, సాక్ష్యాలు పరిశీలించిన తర్వాత నిందితులకు శిక్షలు ఖరారు చేసింది. కుమారుడు భరత్‌కు యావత్‌జీవిత శిక్ష విధించింది. తండ్రి మేడిపల్లి సుధాకర్‌కు ఏడేళ్ల పాటు శిక్ష వేసింది. అంతే కాకుండా బాధితురాలికి పది లక్షల రూపాయల నష్ట పరిహారం కూడా ఇవ్వాలని ఆదేశించింది
ANGRAU Admissions: ఎన్జీరంగా వ్యవసాయ వర్సిటీలో ప్రవేశాలకు 27 నుంచి వెబ్ ఆప్షన్లు
Breaking News Live Telugu Updates: ఆసియా గేమ్స్‌లో మహిళా క్రికెట్ జట్టుకు స్వర్ణం
చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో రేపు నిర్ణయం
Andhra University: ఆంధ్రా యూనివర్సిటీలో ఉద్యోగాల నియామకానికి గ్రీన్ సిగ్నల్- 528 పోస్టులకు వారంలో నోటిఫికేషన్
Top Headlines Today: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రాజయ్య యూటర్న్- రికార్డుల వేటలో గిల్- మార్నింగ్ టాప్ టెన్ న్యూస్
బీజేపీపార్టీ ప్రతినిధా, రాష్ట్ర గవర్నరా ? తమిళిసై పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం
AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్
God Trailer: మీరు సెన్సిటివ్ అయితే ఈ ట్రైలర్ చూడకండి - డిస్టర్బింగ్ సైకోథ్రిల్లర్‌తో వచ్చిన జయం రవి!
Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!
/body>