Visakhapatnam: చాక్లెట్ తీసుకొమ్మని బాలికను వేధించిన వ్యక్తి - దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన చిన్నారి
Visakhapatnam: చాక్లెట్ తీసుకోమ్మంటూ బడికెళ్లే బాలికపై వేధింపులకు పాల్పడుతున్నాడో భవన నిర్మాణ కార్మికుడు. తరచుగా ఇలాగే చేస్తుండడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Visakhapatnam: అతనో భవన నిర్మాణ కార్మికుడు. కానీ 8వ తరగతి చదువుతున్న బాలిక వెంట పడుతున్నాడు. రోజూ చాక్ లెట్ ఇస్తూ తీసుకునే వరకూ వేధిస్తున్నాడు. వేధింపులు భరించలేని బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పగా.. వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతగాడిని అరెస్ట్ చేశారు.
అసలేం జరిగిందంటే..?
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం జిల్లా గాజువాక దరి ఓ కాలనీకి చెందిన 13ఏళ్ల బాలిక ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. అలాగే భవన నిర్మాణ కార్మికుడు అప్పారావు అలియాస్ సంతోష్ కు 23 ఏళ్లు. ఈనెల 16వ తేదీన పాఠశాల నుంచి సోదరితో కలిసి ఇంటికి వెళ్తున్న సమయంలో ఇతడు... బాలికను చాక్లెట్ తీసుకోమ్మంటూ వేధించాడు. కానీ అతనెవరో తెలియకపోవడంతో చాక్లెట్ ఇవ్వబోతే బాలిక తిరస్కరించింది. మళ్లీ కొద్ది దూరం వెళ్లాక ఆమెనే అనుసరిస్తూ.. వేధింపులకు గురి చేశాడు. దీంతో భయపడిపోయిన బాలిక ఏడు్తూ ఇంటికి వెళ్లింది. విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు సంతోష్ ను నిలదీశారు. తర్వాత న్యూ పోర్టు పోలీసులకు విషయాన్ని తెలిపి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు సంతోష్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే అతడు ఏడాది కాలంగా ఇలాగే ప్రవర్తిస్తున్నాడని, మూడు నెలల క్రితం కూడా చాక్లెట్ స్తే తిరస్కరించినందున వేధిస్తున్నట్లు తెలుసుకున్నారు.
నిందితుడు సంతోష్ ను దిశ పోలీసులకు అప్పగించారు. పోక్సో చట్టం, వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి సంతోష్ ను అరెస్ట్ చేశారు. సంతోష్ కు తండ్రి లేడని, సోదరుడి వద్ద పెరుగుతూ ఆకతాయిలతో కలిసి మద్యం తాగే అలవాటు ఉన్నట్లు గుర్తించారు. ఈనెల 16వ తేదీన కూడా తాగి బాలికతో అసభ్యకరగా ప్రవర్తించినట్లు ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు.
గతేడాది అక్టోబర్ లో బాలికను వేధించిన టీడీపీ నేత
ఫేస్‌బుక్‌లో పరిచయం ఓ బాలిక పాలిట శాపం అయింది. ఇటీవల కాలంలో సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయాలు పెంచుకొని యువతీ యువకులు ఎన్ని విధాలుగా నష్టపోతున్నారు. ఇది మరోసారి తెలియజేసే సంఘటన తనకల్లు మండలం ఎర్రబెల్లి గ్రామంలో బుధవారం ఉదయం జరిగింది. ఈ సంఘటనతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
తనకల్లు మండలం ఎర్రబల్లికి చెందిన శ్రీనివాసులు, రాధమ్మ ఏకైక కుమార్తె సంధ్యారాణి మొలకలచెరువులో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఫేస్‌బుక్‌లో నల్లచెరువు మండలం తెలుగు యువత కార్యదర్శిగా పనిచేస్తున్న రాళ్లపల్లి ఇంతియాజ్ పరిచయమయ్యాడు. ఈ స్నేహం పేరుతో బాలిక ఫోటోలు తీసిన ఇంతియాజ్ మాయమాటలు చెప్పాడు. తల్లిదండ్రులకు గొర్రెలు ఇప్పిస్తానని, బాలికను ముంబాయికి తీసుకెళ్తానని చెప్పాడు. వాటిని నమ్మిన ఆ ఫ్యామిలీ అతను చెప్పినట్టే చేసింది. అదే వారిని విషాదంలోకి నెట్టేసింది. బాలిక ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తానని బెదిరించాడు ఇంతియాజ్. తనకు లొంగిపోవాలని లేకుంటే పరిస్థితులు దారుణంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చాడు. తన వద్ద అన్ని వీడియోలు ఉన్నాయని ఫొటోలు ఉన్నాయని బ్లాక్ మెయిల్ చేశాడు. దీంతో కంగారు పడిపోయిన ఆ బాలిక ఎవరికీ చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకుంది.