అన్వేషించండి

Vizag News: యువ వాలంటీర్‌తో పెళ్లైన మహిళా వాలంటీర్‌ జంప్! భర్త ఫిర్యాదు

మహిళా వాలంటీర్ రెండు రోజులుగా కనిపించడం లేదని, ఆమె భర్త పీఎం పాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విశాఖపట్నంలోని ఉడా కాలనీ సచివాలయంలోని ఇద్దరు వాలంటీర్లు కనిపించకుండా పోయారు. నగరంలోని పీఎం పాలెం పరిధిలో మిథిలాపురి ఉడా కాలనీ సచివాలయంలో ఈ ఇద్దరు వాలంటీర్లు పనిచేస్తున్నారు. వీరిలో ఒకరు పెళ్లైన మహిళ కాగా, మరో వ్యక్తి యువకుడు. ఈ ఇద్దరు వాలంటీర్లు గత కొద్దికాలం నుంచి ప్రేమించుకున్నట్లు తెలుస్తుంది. వీరిలో మహిళా వాలంటీర్ రెండు రోజులుగా కనిపించడం లేదని, ఆమె భర్త పీఎం పాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భార్యను అదే సచివాలయానికి చెందిన వాలంటీర్ తీసుకు వెళ్లినట్లుగా అతను ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈవిషయంపై ఇద్దరు వాలంటీర్లు విధులకు హాజరు కాకపోవడంతో వారిపై చర్యలు తీసుకుంటామని సచివాలయ అడ్మిన్ తెలిపారు.

రెండు రోజుల క్రితమే వృద్ధురాలిని హత్య చేసిన మరో వాలంటీర్

గత రెండు రోజుల క్రితమే విశాఖపట్నంలో ఓ వాలంటీర్ ఘాతుకానికి ఒడిగట్టిన సంగతి తెలిసిందే. ఓ వృద్ధురాలిని గ్రామ వాలంటీర్ అంతం చేశాడు. పెందుర్తి నియోజకవర్గం సుజాత నగర్‌ లో ఈ ఘటన జరిగింది. పురుషోత్తపురం పరిధిలో 95వ వార్డు వాలంటీర్‌గా పని చేస్తున్న వెంకటేష్ అనే వ్యక్తి పెద్దావిడని హత్య చేసినట్లు చెబుతున్నారు. 

హత్యకు గురయిన వృద్ధురాలు వరలక్ష్మి వయసు 73. ఆమె నిర్వహిస్తున్న దుకాణంలో గత కొంత కాలంగా పార్ట్ టైం వర్కర్‌గా కూడా వాలంటీర్ వెంకటేష్ పని చేస్తున్నాడు. రాత్రి 10.30 గంటలకు వృద్ధురాలు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెను వెంకటేష్ హత్య చేశాడని పోలీసులు తెలిపారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. వెంటనే పెందుర్తి పోలీసులు రంగంలోకి దిగారు. క్లూస్ టీమ్ ను పిలిపించి ఘటన స్థలానికి చేరుకున్నారు. ఆధారాలు సేకరించిన క్లూస్ టీం.. వృద్ధురాలిని చంపిన తీరుపై అంచనా వేశారు. ఆమె ముఖంపై దిండుతో అదిమి పట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లుగా క్లూస్  టీం నిపుణులు ఆధారాలు సేకరించారు.

వృద్ధురాలిని హత్య చేయడమే కాకుండా ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలను మొత్తం తీసుకొని నిందితుడు దోచుకొని వెళ్లిపోయాడు. పోస్టుమార్టమ్ కోసం ఆమె శవాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితుడు రాత్రి వృద్ధురాలు నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌ లోపలకు వచ్చి బయటికి వెళ్తున్నట్టు సీసీటీవీ కెమెరాలో వీడియో రికార్డు అయింది. సీసీటీవీ కెమెరాలో దృశ్యాల ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు అతడి కోసం వెతుకుతున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
Telangana News: హైదరాబాద్‌లోని నందినగర్‌లో హైడ్రామా- రాత్రి నుంచి కేటీఆర్‌ ఇంటి వద్దే బీఆర్‌ఎస్ శ్రేణులు
హైదరాబాద్‌లోని నందినగర్‌లో హైడ్రామా- రాత్రి నుంచి కేటీఆర్‌ ఇంటి వద్దే బీఆర్‌ఎస్ శ్రేణులు
Kanguva Review: కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
Matka Review - మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్వికారాబాద్ వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ట్రోఫీ మ్యాచ్‌లపై ఐసీసీకి లెటర్ రాసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్పెద్దపల్లిలో అదుపు తప్పిన గూడ్స్, 11 బోగీలు బోల్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
Telangana News: హైదరాబాద్‌లోని నందినగర్‌లో హైడ్రామా- రాత్రి నుంచి కేటీఆర్‌ ఇంటి వద్దే బీఆర్‌ఎస్ శ్రేణులు
హైదరాబాద్‌లోని నందినగర్‌లో హైడ్రామా- రాత్రి నుంచి కేటీఆర్‌ ఇంటి వద్దే బీఆర్‌ఎస్ శ్రేణులు
Kanguva Review: కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
Matka Review - మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
Andhra Pradesh News: సజ్జల భార్గవ్‌, వర్రా రవీందర్‌పై మరో కేసు- నిందితుల కోసం పోలీసుల గాలింపు
సజ్జల భార్గవ్‌, వర్రా రవీందర్‌పై మరో కేసు- నిందితుల కోసం పోలీసుల గాలింపు
Sri Reddy Open Letter: మా అమ్మానాన్న టీడీపీకే ఓటు వేశారు, క్షమించి వదిలేయండి- లోకేష్‌, జగన్‌కు శ్రీరెడ్డి ఓపెన్ లెటర్
మా అమ్మానాన్న టీడీపీకే ఓటు వేశారు, క్షమించి వదిలేయండి- లోకేష్‌, జగన్‌కు శ్రీరెడ్డి ఓపెన్ లెటర్
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Hyderabad Crime News: ఎగ్జామ్‌ ఆన్సర్ షీట్‌పై సూసైడ్ లెటర్- నా వల్ల కావట్లేదంటూ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
ఎగ్జామ్‌ ఆన్సర్ షీట్‌పై సూసైడ్ లెటర్- నా వల్ల కావట్లేదంటూ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
Embed widget