Vizag Lovers Video: రోడ్డుమీద బైక్‌పై లవర్స్ పాడు పని! ఛీ ఛీ అని షాక్‌కు గురైన జనం - బుద్ధి చెప్పిన పోలీసులు
యువకుడు పల్సర్ బైక్ నడుపుతుండగా అతనికి వ్యతిరేక దిశలో పెట్రోల్ ట్యాంకు పైన యువతి అసభ్యకరంగా కూర్చుంది. ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.
విశాఖపట్నంలో ఇద్దరు యువతియువకులు నిస్సిగ్గుగా ప్రవర్తించారు. నాలుగు గోడల మధ్య చేయాల్సిన పనిని బహిరంగంగా చేస్తూ చుట్టుపక్కల వారిని నివ్వెరపోయేలా చేశారు. ఓ యువతి తన ప్రియుడ్ని ముందు నుంచి వాటేసుకొని ముద్దులు పెట్టుకోవడం చూస్తున్న వారిని షాక్ కు గురి చేసింది. అంతేకాకుండా, బైక్ డ్రైవ్ చేస్తూ వారు ఈ పని చేయడం గమనించదగ్గ విషయం. సాధారణంగా ప్రేమికులు బైక్ పై వెళ్తూ హత్తుకోవడం లాంటివి అక్కడక్కడా కనిపిస్తున్నప్పటికీ ఈ ఘటనలో మాత్రం మరీ అసభ్యకర రీతిలో వారి ప్రవర్తిన ఉంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అయింది.
యువకుడు పల్సర్ బైక్ నడుపుతుండగా అతనికి వ్యతిరేక దిశలో పెట్రోల్ ట్యాంకు పైన యువతి అసభ్యకరంగా కూర్చుంది. ఆమె కాళ్లను అతని నడుముకు, చేతులను మెడకు పెనవేసి అదే పనిగా చుంబనాలు కురిపించింది. ఈ ఘటన నడి రోడ్డుపైనే జరగ్గా, అటుగా వెళ్తున్న తోటి వాహనదారులు ఈ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. వెనుక కారులో వస్తున్న వారు ఈ వీడియో తీసి బైక్ ఆపించి, వారిని గదమాయించి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
విశాఖపట్నం సిటీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లి జిల్లా చోడవరానికి చెందిన యువతి, యువకుడు కలిసి స్టీల్ ప్లాంట్ దగ్గరలో పలు ప్రదేశాలకు కలిసి తిరిగారు. సెక్టర్ 06కి వచ్చేటప్పటికి ఇద్దరూ బైక్ పై నిర్లక్ష్యంగా అసభ్యకరమైన రీతిలో ఉంటూ నడుపుతూ వెళ్లారు. పై విషయం తెలిసిన రెండు గంటలలోపే సదరు ద్విచక్ర వాహనం నడుపుతున్న వ్యక్తిని పట్టుకొని అరెస్టు చేసి, ఇరువురిపై కేసు నమోదు చేసి, వాహనాన్ని సీజ్ చేశారు. వారి తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు.
ప్రమాదాలు తగ్గుముఖం పట్టే విధంగా పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో నగర పోలీసులు పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ప్రజలందరూ ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని చెబుతున్నా యువత ఇటువంటి చర్యలకు పాల్పడడం చాలా బాధాకరమని సీపీ శ్రీకాంత్ తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం మీకు, మీ కుటుంబాలకు ఎంతో ఆవశ్యకమని పదేపదే చెబుతున్నామని చెప్పారు. తిరిగి ఇటువంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే వారి వాహనాలు సీజ్ చేయడంతో పాటుగా, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.