Visakhapatnam: దేవాదాయశాఖలో భగ్గుమన్న విభేదాలు..డిఫ్యూటీ కమిషనర్‌పై ఇసుక పోసిన అసిస్టెంట్ కమిషనర్
దేవాదాయశాఖ అధికారుల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే వరకు పరిస్థితులు దారితీశాయి.
విశాఖలో దేవాదాయశాఖ అధికారుల మధ్య విభేదాలు తలెత్తాయి. డిప్యూటీ కమిషనర్ పుష్ఫవర్ధన్‌పై అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఇసుక పోశారు. ఈ దాడి అంతా కార్యాలయంలోని సీసీకెమరాలో రికార్డు అయ్యాయి. కొద్ది రోజులుగా తనను కించపరిచేవిధంగా డిప్యూటీ కమిషనర్ పుష్ఫవర్ధన్ ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించింది. లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఆరోపించారు.
అయితే డిప్యూటీ కమిషనర్ పుష్ఫవర్ధన్ మాత్రం ఆరోపణలు అవాస్తవం అంటున్నారు. శాంతి చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. ఎలాంటి కారణాలు లేకుండా తనపై దాడికి పాల్పడ్డారని అంటున్నారు. పోలీసు విచారణలో అసలు వాస్తవాలు బయటపడతాయని తెలిపారు. ఈ ఘటనతో దేవాదాయ శాఖలో కలకలం సృష్టించింది. ఒక అధికారి సస్పెన్షన్ ఘటనలో డీసీ, అసిస్టెంట్ కమిషనర్ మధ్య తలెత్తిన విభేదాలే ఈ ఘర్షణకు దారి తీశాయని సమాచారం. ఇదిలా ఉంటే అధికారుల తీరుపై జనం మాత్రం తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఉన్నతాధికారులే ఇలా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంటే ప్రజలకు ఇంకేం చేస్తారంటూ సందేహాలు వ్యక్తంచేస్తున్నారు.
క్రిమినల్ కేసు పెడతా.... : శాంతి
డిప్యూటీ కమిషనర్ వేధిస్తున్నారని అసిస్టెంట్ కమిషనర్ శాంతి కన్నీటి పర్యంతమయ్యారు. తనను మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. గతంలో జరిగిన కొన్ని సంఘటనలను మనసులో పెట్టుకుని వ్యక్తిగత కక్షలకు పాల్పడుతున్నారని తెలిపారు. గతంలో కూడా ఆయనపై ఆర్‌జేడీకి ఫిర్యాదు చేశానని శాంతి తెలిపారు. మళ్లీ ఇప్పుడు పుష్ఫవర్ధన్ పై క్రిమినల్ కేసు పెడతానని చెప్పారు. డిప్యూటీ కమిషనర్ తనను మానసిక ఇబ్బందులకు గురిచేస్తున్న కారణంగా ఆయనపై ఇసుక చల్లానని అసిస్టెంట్ కమిషనర్ శాంతి వివరణ ఇచ్చారు. డీసీ పుష్పవర్ధన్ తన విధులకు అడ్డుపడడమే కాకుండా మానసికంగా వేధిస్తున్నారని తెలిపారు.
విభేదాలు లేవు : డీసీ
తమ మధ్య ఎలాంటి వివాదాలు, విబేధాలు లేవని డిప్యూటీ కమిషనర్ పుష్ఫవర్ధన్ అంటున్నారు. తాను విశాఖలో డ్యూటీకి వచ్చి నెలరోజులే అయ్యిందని అంటున్నారు. అసిస్టెంట్ కమిషనర్ శాంతి వచ్చి ఇసుక పోసి, తనను నిందించడంతో షాక్ అయ్యాయని చెప్పారు. తాను చాలా చోట్ల పనిచేసినట్లు చెప్పిన ఆయన.. ఎక్కడా ఇలాంటి పరిస్థితులు ఎదురుకాలేదన్నారు. శాంతి తనపై ఇసుక వేయడాన్ని దేవాదాయ శాఖ కమిషనర్‌కు, పోలీసులకు ఫిర్యాదు చేస్తానని పుష్ఫవర్ధన్ చెప్పారు.
Also Read: Chittoor: చిత్తూరు జిల్లాలో వింత...గుడ్లు పెట్టిన కోడిపుంజు...నెట్టింట హల్ చల్
Hyderabad Viral Video: బతికున్న పామును కరకరా నమిలేస్తూ.. ఈ యువకుడిది హైదరాబాదేనా.. వైరల్ వీడియో