Visakhapatnam: చనిపోతామంటూ భార్యాభర్తల సెల్ఫీ వీడియో! చూస్తే కన్నీళ్లే - కాలువ వద్ద షాకింగ్ సీన్
అనకాపల్లి కొప్పాక ఏలూరు కాలువ దగ్గర చెప్పులు, హ్యాండ్ బ్యాగు, ఓ సెల్ ఫోనును గుర్తించారు. ఇక అంతకుముంచి ఇప్పటిదాకా దంపతులకు సంబంధించి మరే ఇతర వివరాలు లభించలేదని పోలీసులు చెప్పారు.
విశాఖపట్నంలో దంపతులకు చెందిన ఓ సెల్ఫీ వీడియో సంచలనం అయింది. తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా వారు రోదిస్తూ సెల్ఫీ వీడియోలో చెప్పి బంధువులకు పంపారు. ఆ వీడియోలో ఉన్న వ్యక్తిని స్టీల్ ప్లాంట్ ఉద్యోగిగా గుర్తించారు. స్థానిక తిరుమల నగర్‌లో ఉంటున్న స్టీల్ ప్లాంట్ ఉద్యోగి చిత్రాడ వర ప్రసాద్ అనే 47 వ్యక్తి, అతని భార్య మీరా (41) దంపతులు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియోలో వాపోయారు. ఆ సెల్ఫీ వీడియో బయటికి రావడంతో వారి కుమారుడు కృష్ణ సాయితేజ దువ్వాడ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు కేసు నమోదు చేసి ఆ దంపతుల కోసం వెతగ్గా.. అనకాపల్లి కొప్పాక ఏలూరు కాలువ దగ్గర చెప్పులు, హ్యాండ్ బ్యాగు, ఓ సెల్ ఫోనును గుర్తించారు. ఇక అంతకుముంచి ఇప్పటిదాకా దంపతులకు సంబంధించి మరే ఇతర వివరాలు లభించలేదని పోలీసులు చెప్పారు. వారిపై మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు.