అన్వేషించండి

Ganja Cultivation: అనుమతి ఇచ్చేయండి సార్‌- గంజాయి పండించుకుంటాం ! 

Ganja Cultivation: విశాఖకు చెందిన జనజాగరణ సమితి డిమాండ్ గురించి తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. వైజాగ్ ప్రాంతంలో గంజాయి సాగుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేసింది.

Ganja Cultivation: ప్రకృతి అందాలకు, ఆకుపచ్చని కాఫీ తోటల సౌందర్యానికి నిలయమైన ఏజెన్సీ ప్రాంతాలు గంజాయి కేంద్రాలుగా మారుతున్నాయి. మన్యం ప్రాంతాల్లో అడవి అందాల మాటున గంజాయి సాగు ఏటేటా విస్తరిస్తోంది. ఏజెన్సీలో ఒక్కప్పుడు గిరిజనులు పోడు వ్యవసాయం చేస్తూ జీవనం సాగించే వారు. కొండకొనల్లో దొరికే అటవీ ఉత్పత్తులను సేకరించి పొట్టపోషించుకునే వారు. అయితే స్మగ్లర్లు వారిని గంజాయి సాగువైపు మళ్లించారు. ఒక్క విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో వేల ఎకరాల్లో గంజాయి సాగు అవుతోందని అంచనా.

దక్షిణ భారతంలో గంజాయి రవాణాకు విశాఖ మన్యం అనువైన ప్రాంతం కావడంతో స్మగ్లర్లు విశాఖ మన్యంను టార్గెట్‌ చేసుకున్నారు. తమిళనాడు, కేరళ నుంచి వచ్చి గిరిజనులతో గంజాయి సాగు చేయిస్తున్నారు. ఏటా 5 వేల కోట్లుకుపైగా గంజాయి స్మగ్లింగ్ జరుగుతోందని అంచనా. అధికారులు ఎంత పకడ్బంది చర్యలు తీసుకున్న గుట్టు చప్పుడు కాకుండా గంజాయి రవాణా జరుగుతోంది. అడ్డదారిలో అడ్డగోలుగా సంపాదించడానికి అలవాటు పడ్డవారు గంజాయిని అక్రమంగా తరలిస్తూ సోమ్ము చేసుకుంటున్నారు. 

ఈ దందా అరికట్టటం పోలీసులకు పెద్ద సవాల్‌గా మారిపోయింది. అంబులెన్స్, బొగ్గు లారీ, ఇటుకల లారీ ఇలా గంజాయి స్మగ్లర్లు రూటు మార్చి అర్ధం కాకుండా ఇతర రాష్ట్రాలకు సైతం విశాఖ ఏజెన్సీ నుంచి గంజాయి తరలిస్తున్నారు. వాటిని ఎప్పటిప్పుడు ఎక్సైజ్ పోలీసులు అడ్డుకుంటూ గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నారు. విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీలో పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడుతోంది. మరి కొందరు ఆదాయం కోసం ఏకంగా ఇళ్లలోనే గంజాయి మొక్కలు పెంచుతున్నారు.

పర్మిషన్ ఇస్తే గంజాయి పండిస్తాం
అయితే విశాఖకు చెందిన జనజాగరణ సమితి డిమాండ్ గురించి తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. వైజాగ్ ప్రాంతంలో గంజాయి సాగుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేసింది. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 15 వేల ఎకరాల్లో గంజాయి పంట సాగు చేస్తున్నారని. ఒక్కో ఎకరాకు ఏడాదికి రూ.4 లక్షల పెట్టుబడి పెడితే రూ.40 లక్షల ఆదాయం వస్తుందని తెలిపింది. ప్రపంచంలోనే రైతులకు అత్యధిక ఆదాయం ఇచ్చే పంట గంజాయి అని. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇచ్చి, రైతులను అప్పుల నుంచి బయటపడేయాలని కోరింది.

దొరికేది తక్కువ.. తరలించేది ఎక్కువ
గంజాయి మొక్క పెంచడమే నేరం. తెలుగు రాష్ట్రాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగు ఆదాయ వనరుగా మారింది. తెలుగు రాష్ట్రాల పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు చేసి గంజాయి రవాణాను అడ్డుకుంటున్నారు. గంజాయి సాగు చేస్తున్నట్లు తెలిస్తే అక్కడికి వెళ్లి వాటిని నాశనం చేస్తున్నారు. అయినా వారి కళ్లు గప్పి చాలా చోట్ల గంజాయి సాగు జరుగుతూనే ఉంటుంది. పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహిస్తూ కొంతవరకు అడ్డుకట్ట వేయగలుగుతున్నా.. దొరికే దాని కంటే సరిహద్దులు దాటి వెళ్లేదే ఎక్కువగా ఉంటోంది. 

గంజాయి సాగవ్వకుండా అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. సాగు, విక్రయం, సరఫరా చేసే వారిపై పోలీస్‌, ఎక్సైజ్‌ అధికారులు నిఘా పెడుతున్నారు. గతంలో గంజాయి సాగు చేసిన వారి వివరాలు ఆరా తీస్తున్నారు. వారిని సన్మార్గంలో నడిపించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం ఎక్సైజ్‌, పోలీస్‌, రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ, తండాలు, పట్టణ ప్రాంతాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గంజాయి సాగుతో ప్రజలకు కలిగే ఇబ్బందులు, యువతపై ప్రభావం, రైతులకు కలిగే నష్టాలు, సంక్షేమ పథకాలపై ప్రభావం చూపే అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Chandra Babu About Mega DSC 2025: మెగా డీఎస్సీ2025 ఆరోపణలపై సాక్ష్యాలు ఉంటే సభ ముందు పెట్టండి, వైసీపీకి చంద్రబాబు సవాల్‌!
మెగా డీఎస్సీ2025 ఆరోపణలపై సాక్ష్యాలు ఉంటే సభ ముందు పెట్టండి, వైసీపీకి చంద్రబాబు సవాల్‌!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget