By: ABP Desam | Updated at : 26 Apr 2023 09:48 AM (IST)
మొన్న కాణిపాకం - నేడు సింహాచలం- సోషల్ మీడియాలో మూలవిరాట్ ఫొటోలు
చందనోత్సవం సందర్భంగా సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారని సింహాద్రి అప్పన్న దేవస్థానం, అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరోపణలపై వివరణలు ఇచ్చుకుంటున్న ప్రభుత్వానికి మరో వివాదం చుట్టుముట్టింది.
సింహాంద్రి అప్పన్న స్వామి నిజరూప దర్శన వీడియో సోషల్ మీడియాలో కనిపించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వయంభూ మూర్తులు, మూలవిరాట్‌ను ఫొటోలు తీయడం కానీ, వీడియోలు తీయడం కానీ నిషేధం. అలా చేసిన వారిపై చర్యలు తీసుకుంటా ఉంటారు. అయితే మొన్న జరిగిన చందనోత్సవంలో భాగంగా దర్శనానికి వచ్చిన వ్యక్తుల్లో కొందరు వీడియో తీసి సోషల్ మీడియా పెట్టడం ఇప్పుడు దుమారం రేపుతోంది.
గతేడాది కూడా ఇలానే కొందరు వ్యక్తులు నిజరూపాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఆ ఘటనపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు తాజాగా అలాంటి ఘటనే మళ్లీ జరిగింది. వరుసగా రెండేళ్లు ఇలా జరగడంపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోనూ రాష్ట్రమంత్రి గన్‌మన్ ఒకరు తీశారని ప్రచారంలో ఉంది. వీడియో తీస్తున్న విషయాన్ని గమనించిన దేవాదాయశాఖాధికారులు ఆయన సెల్‌ఫోన్ లాక్కున్నట్టు సమాచారం. అయినా వీడియో బయటకు రావడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతేడాది జరిగినప్పుడే సీరియస్‌గా అధికారులు చర్యలు తీసుకొని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని అంటున్నారు సింహాద్రి అప్పన్న భక్తులు.
వివాదాల కాణిపాకం -సోషల్ మీడియాలో మూలవిరాట్ ఫొటోలు
చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయం తరచూ వివాదాల కారణంగా వార్తల్లో నిలుస్తోంది. అధికారుల నిఘా వైఫల్యం బయటపడిందని భక్తులు మండిపడుతున్నారు. వైసీపీ నాయకుడు బాలవెంకటరెడ్డి యాదవ్ దంపతులు ఆలయానికి వచ్చారు. వారితో పాటు వచ్చిన అనుచరుడు ఒకరు దర్శన సమయంలో మూలవిరాట్ ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అధికారులు, అర్చకులు ఎవరూ దీన్ని అడ్డుకోలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీకాళహస్తి ఆలయంలో మంగ్లీ పాట చిత్రీకరణపై వివాదం
దక్షిణ భారతదేశంలో ప్రముఖ వాయు లింగ క్షేత్రంగా ప్రఖ్యాతిగాంచిన శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఇటీవల సింగర్ మంగ్లీ చిత్రీకరించిన పాట వివాదాస్పదంగా మారింది. శ్రీకాళహస్తీ ఆలయంలోకి ఎటువంటి సెల్ఫోన్లు, కెమెరాలు, అనుమతించమంటూ ఆలయ అధికారులు, పాలక మండలి విధించిన ఆంక్షలు పక్కన పెట్టి ఆలయ అధికారులే మంగ్లీ పాటల చిత్రీకరణకు అనుమతించారు. ఆలయం లోపలికి కెమెరాలు తీసుకుని వెళ్లి పాట చిత్రీకరణ చేశారు. ముక్కంటి ఆలయంలోనే పాటలు చిత్రీకరణ రాహుకేతు సర్ప దోష పూజ మండపంలో, కాళభైరవ ఆలయం ముందు భాగంలో మంగ్లీ పాటను చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
జ్ఞాణఫ్రశూంనాభ, వాయులింగేశ్వరుడి కొలువైవున్న కాళహస్తిలో సింగర్ మంగ్లీ బృందం శివరాత్రి పాట చిత్రీకరించారు. శివరాత్రికి పది రోజుల ముందు పాట షూట్ చేశారు. పాట చిత్రీకరణలో శ్రీకాళహస్తి ఆలయ ప్రధాన అర్చకులు అర్ధగిరిస్వామి, మిగిలిన స్వాములు కూడా ఉన్నారు. అసలు ఆలయంలోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, కెమెరాలు, సెల్ ఫోన్లు తీసుకు వెళ్లకూడదని నిషేధం ఉన్నా మంగ్లీ బృందం ఏ విధంగా ఆలయంలో పాటను చిత్రీకరించారని భక్తులు ప్రశ్నించారు.
AP DEECET 2023: జూన్ 12న ఏపీ డీఈఈసెట్ పరీక్ష, హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోండి!
Top 10 Headlines Today: తెలుగు రాష్ట్రాల్లో జై బాలయ్య మేనియా- మహబూబ్‌నగర్ టూర్‌లో కేటీఆర్
Top 10 Headlines Today: తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ఎందుకీ గడ్డుకాలం, తొలిరోజు పైచేయి సాధించిన ఆస్ట్రేలియ జట్టు
AP KGBV: కేజీబీవీల్లో 1,358 పోస్టుల దరఖాస్తుకు జూన్ 8 వరకు అవకాశం!
AP EdCET 2023: జూన్ 14న ఏపీ ఎడ్‌సెట్ పరీక్ష, వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో!!
KTR: యువత స్కిల్ సంపాదించాలి, ఉద్యోగం దానికదే వస్తుంది - కేటీఆర్
Steve Smith: టెస్టు ఛాంపియన్ ఫైనల్లో స్మిత్ సెంచరీ - మాథ్యూ హేడెన్ రికార్డు బద్దలు!
YSRCP News : రిలాక్స్ అయింది చాలు - పార్టీ అనుబంధ సంఘాలకు విజయసాయిరెడ్డి క్లాస్ !
అప్పు పేరుతో తప్పుడు పనులు- హైదరాబాద్‌లో కాల్‌మనీ తరహా ఘటన- షీ టీం ఎంట్రీతో నిందితులు ఎస్కేప్