అన్వేషించండి
Advertisement
AP News Developments Today: హైదరాబాద్‌కు సీఎం జగన్- కర్నూలులో చంద్రబాబు టూర్
మూడు రాజధానులను తెరపైకి తీసుకొచ్చిన ప్రభుత్వం మరో ఉత్సవాన్ని అధికారికంగా జరుపుతోంది. మరోవైపు టీడీపీ అధినేత నేడు కర్నూలులో పర్యటించనున్నారు.
AP News Developments Today:
హైదరాబాద్ కు సీఎం జగన్ :
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి హైదరాబాద్ వెళ్లనున్నారు. మంగళ వారం మరణించిన సినీ నటుడు కృష్ణ పార్థివ దేహాన్ని దర్శించి నివాళి అర్పించనున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత ఆత్మీయుడిగా పేరున్న కృష్ణ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నయి. అందుకే సీఎం జగన్ స్వయంగా తాడేపల్లి నుంచి హైదరాబాద్ తరలి వెళ్లనున్నారు.
రాష్ట్రం లో శ్రీభాగ్ ఒడంబడిక 85 వ సంస్మరణ వేడుకలు -ఏపీప్రభుత్వ ఆధ్వర్యంలో
శ్రీభాగ్ ఒడంబడిక 85వ సంస్మరణ వేడుకలు జరుపుకునేందుకు రాష్ట్రం సిద్దమవుతోంది. వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధి గురించి మొట్టమొదటి సారి ప్రస్తావించినది నవంబర్ 16, 1937. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుపై కోస్తాంధ్ర, రాయలసీమ నాయకుల మధ్య ఏర్పడిన అపోహలను, విభేదాలను తొలగించే ఉద్దేశ్యంతో కుదిరిన ఒప్పందమే శ్రీబాగ్ ఒడంబడిక. శ్రీబాగ్ ఒడంబడికలో కీలకంగా ఉద్దేశించిన వికేంద్రీకరణ సారాంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా నేడు రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు జరగనున్నాయి.
సీఎం జగన్ ప్రభుత్వం తలపెట్టిన సామాజిక, ప్రాంతీయ మరియు ఆర్థిక అభివృద్ధి వికేంద్రీకరణతోనే సాధ్యమని మేధావులు, విశ్లేషకులు విశ్వసిస్తున్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధానిగా మూడు రాజధానులను ప్రకటించిన సంగతి తెలిసిందే.
శ్రీ బాగ్ ఒప్పందం కుదిరిన ఈ రోజు బుధవారం అనగా నవంబర్ 16న కర్నూలు, వైఎస్సార్ కడప, అన్నమయ్య, నంద్యాల, అనంతపురం, తిరుపతి, శ్రీ సత్యసాయి, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, అసెంబ్లీ ఇంచార్జిలు మానవహారంగా ఏర్పడి ప్రజాకూటమికి మద్దతు తెలపనున్నారు. దీని తర్వాత రాష్ట్రంలో మూడు రాజధానుల ఆవశ్యకతను తెలియజేస్తూ మీడియాతో సమావేశం నిర్వహించనున్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో 7 వేల మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నట్టు ప్రభుత్వం చెబుతోంది
కర్నూలులో పర్యటించనున్న చంద్రబాబు నాయుడు :
ఏపీ ప్రధాన విపక్ష నేత చంద్ర బాబు నాయుడు కర్నూల్ లో పర్యటించనున్నారు . ఉదయం 11గంటలకు హైదరాబాద్ లో బయలు దేరి 12 గంటలకు కర్నూల్ ఎయిర్ పోర్ట్ చేరుకుంటారు . అక్కడి నుండి నంద్యాల ,నన్నూరు ,కర్నూల్ బైపాస్ ,బళ్లారి చౌరస్తా ,పెద్దపాడు ,కోడుమూరు , కరివేముల ,దేవనకొండ ,దూదే కొండ మీదుగా 4 గంటలకు పత్తికొండలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్దకు చేరుకుంటారు . 4 గంటల నుంచి 5: 30 వరకూ రోడ్ షో లో పాల్గొని 5:30 కు పత్తికొండ లోని కోరమండల్ ఫెర్టిలైజర్స్ సమీపంలో పబ్లిక్ మీటింగ్ లో పాల్గొంటారు . రాత్రి 7 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో 8 గంటలకు ఆదోని లోని చేకూరి ఫంక్షన్ హాల్ చేరుకొని అక్కడే నైట్ హాల్ట్ చేస్తారు. మొత్తంగా మూడు రోజులపాటు కర్నూలు లోనే పర్యటించనున్నారు చంద్రబాబు నాయుడు .
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
ఆట
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement