Ayyanna On Vijayasai Reddy: బోత్ ఆర్ నాట్ సేమ్- విజయసాయిరెడ్డికి అయ్యన్న కౌంటర్
అఖండ సినిమాలో బోత్ ఆర్ నాట్ సేమ్ డైలాగ్ ఎంత ఫేమస్సో తెలిసిందే. చాలా సందర్భంగాల్లో చాలామంది మీమ్స్‌లో వాడుకున్నారు. అదే డైలాగ్స్‌తో వైసీపీ లీడర్లపై విరుచుకుపడ్డారు టీడీపీ లీడర్ అయ్యన్నపాత్రుడు.
వివిధ యూనివర్శిటీల్లో అధికార పార్టీ వైఎస్‌ఆర్‌సీపీ ఉద్యోగ మేళాలు నిర్వహిస్తోంది. మొన్న తిరుపతిలోని వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జాబ్‌మేళా నిర్వహించి యువతకు ఉద్యోగాలు కల్పించింది. ఇవాళ ఆంధ్రాయూనివర్శిటీలో జాబ్‌మేలా కండక్ట్ చేసింది. ఈ ప్రోగ్రామ్‌ను వైసీపీ ఎంపి విజయసాయి రెడ్డి దగ్గరుండి మరీ విజయ వంతం చేస్తున్నారు.
వివిధ యూనివర్శిటీల్లో వైఎస్‌ఆర్‌సీపీ నిర్వహిస్తున్న జాబ్‌మేళాపై తెలుగుదేశం నేత అయ్యన్న పాత్రుడు సెటైర్లు వేశారు. అఖండ సినిమాలో బాలకృష్ణ చెప్పిన బోత్ ఆర్ నాట్ సేమ్ లాగ్‌తో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ట్విట్టర్ వేదికగా అయ్యన్న విమర్శలు చేశారు.
కియా, ఎల్జీ, హెచ్సీఎల్, అపోలో లాంటి కంపెనీలు తెచ్చి యువతకి నికార్సైన ఉద్యోగాలు కల్పించే రేంజ్ చంద్రబాబుదని.. అదే కియా, ఎల్జీ, హెచ్సీఎల్, అపోలో కంపెనీల్లో సెక్యూరిటీ ఉద్యోగాల కోసం జాబ్ మేళా నిర్వహించే స్థాయి జగన్ రెడ్డిదని పోస్ట్ చేశారు. బోత్ ఆర్ నాట్ సేమ్ విసా రెడ్డి అంటు విజయసాయిరెడ్డిని ఉద్దేశించి కామెంట్స్ చేశారు.
కియా, ఎల్జీ, హెచ్సీఎల్, అపోలో
— Ayyanna Patrudu (@AyyannaPatruduC) April 23, 2022
లాంటి కంపెనీలు తెచ్చి యువత కి నికార్సైన ఉద్యోగాలు కల్పించే రేంజ్ మా నేత చంద్రబాబు గారిది... అదే కియా, ఎల్జీ, హెచ్సీఎల్, అపోలో కంపెనీల్లో సెక్యూరిటీ ఉద్యోగాల కోసం జాబ్ మేళా నిర్వహించే స్థాయి మీ నేత జగన్ రెడ్డిది. బోత్ ఆర్ నాట్ సేమ్ @VSReddy_MP . pic.twitter.com/QGzcMPWK49
టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన కామెంట్స్‌పై ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయ్యన్నపాత్రుడు తాగుబోతు అని... ఆయన భూమికి భారంగా మారాడని అన్నారు. తెల్లవారి లెగిస్తే, ఏం పని లేక విమర్శలు చేయడం తప్పితే, ఆ ప్రాంతానికి గాని రాష్ట్రానికి గాని ఎలాంటి ఉపయోగం లేదన్నారు.
అయ్యన్న కుమారులు నిరుద్యోగులుగానే ఉన్నారని.. వస్తే వారికి కూడా ఉపాధి కల్పిస్తామని కామెంట్ చేశారు విజయసాయిరెడ్డి. జాతీయ రాజకీయాలపై, రాష్ట్రానికి ఎవరు ప్రయోజనం చేకూర్చే వారితోనే తాము వెళ్తామని.. అది ఎప్పుడో తీసుకున్న నిర్ణయం అలాగే ముందుకు వెళ్తామని ఎంపీ స్పష్టం చేశారు. ఆ నిర్ణయంపై ఎలాంటి మార్పు ఉండదన్నారు. ఎన్నికల టైంలో ఇచ్చిన హామీ ప్రకారం నాలుగు నుంచి ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. పబ్లిక్, ప్రైవేట్ రంగంలో కలిపి ఉపాధి కల్పించామని వివరించారు. ఈ రోజుల్లో నైతిక విలువలు పడిపోతున్నాయని.. విద్యార్థులు పాటించాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు.
మంత్రి కాక ముందు రోజా కూడా బోత్ ఆర్ నాట్ సేమ్ అంటూ సభలో ప్రసగించి దుమ్ము రేపారు. చంద్రబాబును జగన్‌తో పోలుస్తూ మాటకు కట్టుబడిన వ్యక్తికి మాట తప్పే వ్యక్తి అంటూ విమర్శలు చేశారు. బోత్ ఆర్ నాట్ సేమ్ అంటు అప్పట్లో రోజా చేసిన ప్రసంగం సోషల్ మీడియాలో కూడా వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే డైలాగ్‌తో అయ్యన్న వైసీపీపై విమర్శలు చేశారు.