అన్వేషించండి

TDP News: రెడ్ బుక్ లో పేర్లున్న నేతలు ఇకపై రోజులు లెక్కపెట్టుకోవాల్సిందే - ఎంపీ రామ్మోహన్ నాయుడు

Nara Lokesh Ichchapuram Meeting: రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో ఇచ్చాపురం నియోజకవర్గంలో పసుపుజెండా ఎగురవేసి లోకేష్ కు కానుకగా ఇద్దామని టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు.

Andhra Nadi AP Elections 2024: ఇచ్చాపురం: తెలుగుదేశం పార్టీ ఇచ్ఛాపురంలో ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా పసుపు జాతరే అని, రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో ఇచ్చాపురం నియోజకవర్గంలో పసుపుజెండా ఎగురవేసి లోకేష్ కు కానుకగా ఇద్దామని శ్రీకాకుళం(Srikakulam) ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు (RamMohan Naidu) ప్రజలకు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం (Ichapuram)లో 'శంఖారావం' పేరిట నారా లోకేష్ చేపట్టిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు పాల్గొని ప్రసంగించారు. రెడ్ బుక్ లో పేర్లున్న అధికారులు, నేతలు ఇకపై రోజులు లెక్కపెట్టుకోవాల్సిందే అని హెచ్చరికలు పంపారు. 

రాబోయే ఎన్నికలకు శంఖారావం ద్వారా యువనేత లోకేష్ దిశానిర్దేశం చేయబోతున్నారు అన్నారు. రాష్ట్ర ప్రజలందరి గొంతును యువగళంగా మార్చుకుని లోకేష్ పాదయాత్ర చేశారని, తెలుగువారి గళం డిల్లీలో వినపడాలంటే తెలుగుదేశం పార్టీని ఘనవిజయంతో గెలిపించాలని ప్రజలను రామ్మోహన్ నాయుడు కోరారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఇచ్ఛాపురంలో  ముగించాల్సి ఉన్నా, కొన్ని అవాంతరాల వల్ల రాలేకపోయారని చెప్పారు. అందుకే ఇచ్చిన మాట ప్రకారం ఇచ్ఛాపురం వచ్చి నేడు ఈ గడ్డపై శంఖారావంతో లోకేష్ అడుగుపెట్టారని చెప్పారు.

TDP News: రెడ్ బుక్ లో పేర్లున్న నేతలు ఇకపై రోజులు లెక్కపెట్టుకోవాల్సిందే - ఎంపీ రామ్మోహన్ నాయుడు

సీఎం జగన్ రెడ్డి పాలన అంతానికి లోకేష్ శంఖారావం పూరించారని, ఈ శంఖారావం మనం కోసం, రైతులు, యువకులు, బడుగు, బలహీనవర్గాల కోసం అన్నారు. జగన్ రెడ్డిని నమ్మి రాష్ట్రం అన్ని విధాల నష్టపోయిందని.. ఐదేళ్లు తాడేపల్లి ప్యాలెస్ లో గడిపిన జగన్ రెడ్డి ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు అని విమర్శించారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్తే.. మీడియా ఏం అడుగుతుందోనని సీఎం జగన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయని ఎద్దేవా చేశారు. కానీ జగన్ రెడ్డి ఢిల్లీ వస్తే ఆ పార్టీ ఎంపీలు ఒక్కరు కూడా రాలేదన్నారు. జగన్ పని అయిపోయిందని, వైసీపీ నేతలకు కూడా తెలిసిపోయిందన్నారు. ఒకరు దుబాయి పారిపోయారు, మరికొందరు నియోజకవర్గాలకు పారిపోయారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

2014-19 మధ్య అనేక నిధులు తీసుకువచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. అనేక తుఫానులను ఎదుర్కొన్నాం, జగన్ రెడ్డిని ఓడించడం పెద్ద లెక్క కాదని రామ్మోహన్ నాయుడు ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులు అన్నీ పూర్తిచేస్తామన్నారు. టీడీపీ అంటే తెలుగు ప్రజల గుండెల్లో ఉండే పార్టీ అని, పార్లమెంట్ లో రాష్ట్ర సమస్యలపై గళమెత్తింది తామేనన్నారు. 
హోదాపై మాట తప్పిన జగన్!
25 మంది ఎంపీలను ఇస్తే హోదా తెస్తామన్న జగన్ రెడ్డి మాట తప్పారని, అందుకే ప్రజలవద్దకు వెళ్లి ఓట్లడిగే దమ్ము లేక భయపెట్టి ఓట్లు వేయించుకునేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ప్రకృతి విపత్తులకే భయపడని మేం... జగన్ ఉడత ఊపులకు భయపడతామా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. టిడిపి హయాంలో కోట్లాదిరూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం, రైతులకు సాగునీటి కాల్వల కోసం రూ.4కోట్ల రూపాయలు ఖర్చుపెట్టామని చెప్పారు.

TDP News: రెడ్ బుక్ లో పేర్లున్న నేతలు ఇకపై రోజులు లెక్కపెట్టుకోవాల్సిందే - ఎంపీ రామ్మోహన్ నాయుడు

రాబోతున్న కాలంలో ఇచ్చాపురం నియోజకవర్గం అభివృద్ధి బాట పట్టాలంటే టిడిపిని గెలిపించాలన్నారు. అయిదేళ్లలో జగన్ సర్కార్.. కెనాల్స్ లో తట్టెడు మట్టి తీసిన పాపాన పోలేదని విమర్శించారు. టీడీపీ, జనసేన ప్రభుత్వం వస్తేనే రాష్ట్రంలో సమగ్రాభివృద్ధి సాధ్యమన్నారు. ప్రత్యేక హోదా తెస్తానంటే నమ్మి.. ఎంపీలను గెలిపిస్తే ముఖం చాటేసిన ఘనుడు సీఎం జగన్ అని ఎద్దేవా చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Group 3 Exams: భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Embed widget