News
News
X

Srikakulam: దోచుకెళ్లిన డబ్బును మర్నాడు అక్కడే పెట్టేసిన దొంగ! ఒక లెటర్ కూడా - అది చదివి అంతా షాక్!

Srikakulam: దొంగే ఆ డబ్బు తీసుకొచ్చి అక్కడ పెట్టేసి వెళ్లాడు. ఈసారి ఆ డబ్బుతో పాటు ఓ నోట్ కూడా పెట్టి వెళ్లాడు.

FOLLOW US: 

శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఓ చోరీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మొదటి రోజు చోరీకి గురైన డబ్బు.. రెండో రోజు ఇంటికి వచ్చేసింది. దొంగే ఆ డబ్బు తీసుకొచ్చి అక్కడ పెట్టేసి వెళ్లాడు. ఈసారి ఆ డబ్బుతో పాటు ఓ నోట్ కూడా పెట్టి వెళ్లాడు. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ బూర్జ మండలం కొల్లివలసలో ఈ వింత చోరీ వెలుగుచూసింది. 

వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన బెజ్జిపురపు చక్రధరరావు ఫ్యామిలీతో కలిసి ఈ సండే రోజున చుట్టాలింటికి వెళ్లాడు. వారు ఇంట్లో లేని రోజే.. పక్కాగా స్కెచ్ వేసి ఇంట్లో డబ్బులు కొట్టేశాడు దొంగ. సోమవారం చక్రధరరావు రిటన్ వచ్చేటప్పటికి.. ఇంటి తాళం పగలగొట్టి ఉండటంతో.. అనుమానంతో లోపలికి వెళ్లి చెక్ చేయగా.. బీరువాలో నగదు మొత్తం మిస్సయ్యింది.  మొత్తం రూ.11.20 లక్షలు దోచుకెళ్లాడు దొంగ. దీంతో కుటుంబ సభ్యులంతా లబోదిబోమన్నారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్ టీమ్ రంగంలోకి దిగి వివరాలు సేకరించింది. వారు డబ్బు పోయాయని బాధలో ఉండగానే, సోమవారం నైట్ వెనుక డోర్‌కు వేసిన మరో తాళాన్ని పగలగొట్టి మళ్లీ ఇంట్లోకి ప్రవేశించాడు దొంగ. తీసుకెళ్లిన డబ్బుతో పాటు ఓ నోట్‌ను అక్కడ పెట్టి వెళ్లాడు. ‘అన్నావదిన సారీ.. ఇదే నా ఫస్ట్ దొంగతనం.. తెలియక తప్పు జరిగింది.  క్షమించండి, నన్ను పట్టుకుంటే సూసైడే శరణ్యం’ అని అందులో రాసి ఉన్నట్లు తెలిసింది.

దీంతో మళ్లీ చక్రధరరావు పోలీసులను పిలిచి జరిగిన విషయం చెప్పాడు. వారు ఆ నగదును కోర్టులో అందజేసి.. తదుపరి దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఎవరో తెలిసిన వ్యక్తుల పనే అని భావిస్తున్నారు.  తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌గా దొంగలు రెచ్చిపోతున్నారని..  ప్రజలు LHMS (Locked House Monitoring System) సర్వీస్ వినియోగించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

Published at : 29 Jul 2022 08:52 AM (IST) Tags: Srikakulam Thieves srikakulam theft thief stoles money thief news

సంబంధిత కథనాలు

Visakha News : సివిల్స్ కోచింగ్ కు వచ్చి ప్రేమ పేరుతో  జల్సాలు, అప్పులు చేసి ఆత్మహత్య!

Visakha News : సివిల్స్ కోచింగ్ కు వచ్చి ప్రేమ పేరుతో జల్సాలు, అప్పులు చేసి ఆత్మహత్య!

Vizianagaram News : గోడ నుంచి బయటపడ్డ పురాతన లాకర్, వాటా కోసం ఓనర్ తో కూలీలు వాగ్వాదం!

Vizianagaram News : గోడ నుంచి బయటపడ్డ పురాతన లాకర్, వాటా కోసం ఓనర్ తో కూలీలు వాగ్వాదం!

IAS Transfers: ఏపీలో ఐదుగురు ఐఏఎస్ అధికారుల బదిలీ - కొత్త పోస్ట్ క్రియేట్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

IAS Transfers: ఏపీలో ఐదుగురు ఐఏఎస్ అధికారుల బదిలీ - కొత్త పోస్ట్ క్రియేట్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

Rains in AP Telangana: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నేడు ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు IMD ఎల్లో అలర్ట్ జారీ

Rains in AP Telangana: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నేడు ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు IMD ఎల్లో అలర్ట్ జారీ

Petrol-Diesel Price, 13 August: ఈ నగరంలో బాగా పెరిగిన ఇంధన ధరలు, ఇక్కడ తగ్గుదల - మీ ప్రాంతంలో ఈరోజు ఇలా

Petrol-Diesel Price, 13 August: ఈ నగరంలో బాగా పెరిగిన ఇంధన ధరలు, ఇక్కడ తగ్గుదల - మీ ప్రాంతంలో ఈరోజు ఇలా

టాప్ స్టోరీస్

Tirumala Heavy Rush : తిరుమలలో భారీ రద్దీ, ఈ నెల 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు

Tirumala Heavy Rush : తిరుమలలో భారీ రద్దీ, ఈ నెల 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు

Kia Seltos: కొత్త మైలురాయి అందుకున్న కియా సెల్టోస్ - ఏకంగా 60 శాతానికి పైగా!

Kia Seltos: కొత్త మైలురాయి అందుకున్న కియా సెల్టోస్ - ఏకంగా 60 శాతానికి పైగా!

Minister Srinivas Goud : నా ఎదుగుదల ఓర్చుకోలేకే కుట్రలు, అది బుల్లెట్లు లేని బ్లాంక్ గన్ - మంత్రి శ్రీనివాస్ గౌడ్

Minister Srinivas Goud : నా ఎదుగుదల ఓర్చుకోలేకే కుట్రలు, అది బుల్లెట్లు లేని బ్లాంక్ గన్ - మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఇక ఆన్‌లైన్‌లో ఉన్నా కనిపించదు - మూడు సూపర్ ఫీచర్లు తీసుకొస్తున్న వాట్సాప్!

ఇక ఆన్‌లైన్‌లో ఉన్నా కనిపించదు - మూడు సూపర్ ఫీచర్లు తీసుకొస్తున్న వాట్సాప్!