Srikakualam fisher Men: సొంతూరిలో ఉపాధి లేదు- వలస వెళ్తే వస్తారో రారో తెలీదు- మత్స్యకారుల "జట్టీ" ప్రభుత్వం గుర్తించేది ఎప్పుడు?
Srikakulam latest news: సుదీర్ఘ సముద్ర తీరం ఉన్న శ్రీకాకుళం జిల్లా తుపాను విపత్తులు ఎదుర్కోవడానికి తప్ప మరేందుకు ఉపయోగం లేదు. గుజరాత్ తరహాలో జట్టిలు నిర్మించాలని మత్స్యకారులు కోరిక కలగానే మిగులుతోంది.
Srikakulam Fishermen : శ్రీకాకుళం జిల్లా మత్స్యకార కుటుంబాలను తడితే ప్రతి కంట సముద్రాలు ఉప్పొంగుతాయి. సముద్రం లోతు ఎంతో వాళ్ళ కష్టాలు అంతే ఉన్నాయి. కెరటానికి ఎదురెళ్లి ప్రాణాలర్పిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో అతి పొడవైన సముద్ర తీర ప్రాంతం 193. కిలోమీటర్లు ఉంటుంది చూడ్డానికి ఎక్కడ ఒక జట్టి కూడా ఉండదు. మత్స్యకారులు మాత్రం 14 గ్రామాల్లో మూడు లక్షల 37 వేల మంది ఉన్నారు. వీరిలో వలస కార్మికులుగా లక్షకు పైబడే ఉన్నారని అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలో మత్స్య సంపద ఉన్నప్పటికీ వారికి సరైన బోట్లు లేక వేట చేయలేకపోతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఇంజన్ బోటులతో పోటీ పడలేకపోతున్నారు. అటు మత్స్య సంపద కూడా పూర్తిగా కనుమరుగవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పొట్టకూటి కోసం ఉండలేక ఇతర ప్రాంతాలకు వెళ్లి నానా అవస్థలు పడి కాస్త కూస్తూ సంపాదించుకొని వస్తున్నారు. అది కూడా చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు పడుతున్నారు. మత్స్యకార కుటుంబాల్లో వలసలు ఉన్నాయి చెబుతున్న అధికారులు నివారించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవడం లేదు. చేపడుతున్నామని చెబుతున్నా అవి ఏ మూలకూ రావడం లేదు.
ఇక్కడ వారంతా కేరళ. తమిళనాడు. గుజరాత్. మహారాష్ట్ర ప్రాంతాలకు ఎక్కువగా వలస వెళ్తున్నారు. అక్కడ కూడా చాలీచాలని జీతాలతో సతమతమవుతున్నారు. ఇక్కడ సరైన ఉపాధి లేక బయట బతకలేక ఇబ్బంది పడుతున్నారు. ఎన్నికల సమయాల్లో మత్స్యకార గ్రామాల్లో చాలా హామీలు ఇస్తున్నారు కానీ వాటిని అమలు చేయడంలో మాట తప్పుతున్నారు. నేతల మాటలు విని మద్దతు ఇచ్చినప్పటికీ మొండి చెయ్యే చూపిస్తున్నారు. ఎవరు ఎన్ని చేసినా సరే ఇతర ప్రాంతాల్లోకి వెళ్లి పనులు చేసుకుని వస్తే గాని పూట గడవడం లేదు.
మత్స్యకారు కులస్తుడైన మంత్రి కనీసం తమ వైపు చూడలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు జిల్లాలో చాలావరకు జట్టిలు నిర్మాణం లేక ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. సంవత్సరం పాటు అక్కడ పని చేసి వచ్చిన డబ్బులతో సొంత ఊరికి వచ్చి వెళ్తుంటారు. పొరపాటున సముద్రంలో పడవలు బోల్తాపడి చనిపోతే కనీసం చూడడానికి శవాన్ని కూడా ఇచ్చే పరిస్థితులు లేవని వాపోతున్నారు. బోర్డర్ దాటి పాకిస్తాన్. శ్రీలంక. బంగ్లాదేశ్ బోర్డర్లు దాటి వెళ్లిన వాళ్లు బందీలుగా అయిపోతున్నారు. ఇలాంటి ఘటనలు చాలానే ఉన్నాయి.
చేపల వేటకు వెళ్తూ పాకిస్తాన్ సైన్యానికి చిక్కిన శ్రీకాకుళం పొడగట్లపాలెం వాసులు 24 మంది 18 నెలల పాటు నరకయాత్ర అనుభవించారు. వజ్రపు కొత్తూరు, ఎచ్చెర్ల మత్స్యకారులు వేటకు వెళ్లి 9 నెలల పాటు బంగ్లాదేశ్ జైల్లో మగ్గిపోయారు. వేటకు వెళుతుండగా తుపాను రావడంతో పడవ దిశ మారిపోయి శ్రీలంక బార్డర్లో చిక్కుకున్నారు కొందరు జాలర్లు. ఈ టైంలో ఒక వ్యక్తి చనిపోయాడు. మిగతా వాళ్లు ఆరు నెలలు పాటు జైల్లో ఉన్నారు. జైల్లో ఇంటి పెద్దలు ఉంటే ఇక్కడ ఆ కుటుంబ సభ్యులైతే పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు.
జిల్లాలో 193 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉన్నప్పటికీ జెట్టీలు లేక వలసలు వెళ్ళవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను చూస్తే సమస్య గట్టెక్కింది అనేట్టు ఉంటుందని... ఎన్నికలు అయిపోగానే పరిష్కారం ఉండటం లేదని అంటున్నారు. ఒక్క పోర్టు జిల్లాలో నిర్మించిన తమ బతుకుల్లో చీకటి పోతుందని అంటున్నారు. ఇప్పటికీ నాటు పడవలపై ప్రమాదకర స్థితిలో వేట సాగిస్తున్నామని అంటున్నారు. తెచ్చిన చేపలకు స్థానికంగా వేట గిట్టుబాటు కూడా ఉండటం లేదని వాపోతున్నారు. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ఇదే తమ వృత్తి అంటున్నారు. వేరే వృత్తిలోకి వెళ్లలేక మళ్లీ సువీశాల తీరంలో ఆ గంగమ్మను నమ్ముకుని వేటకు వెళ్లి అక్కడ పడరాని కష్టాలు పడుతున్నామంటున్నారు. మత్య్సకారుల జీవన భృతికి సంబంధించి ఒక్క ప్రాజెక్టు అయినా పట్టాలెక్కుంటే తమకీ కష్టాలుండేవి కావంటున్నారు.
Also Read: మట్టి బొమ్మలకు ప్రాణం పోస్తున్న వృద్ధులు- టెర్రకోట్ కళాకృతులతో మానసిక ఉల్లాసం