Payakaraopet: పాయకరావుపేట పోటీ ఆసక్తికరం! ఏ పార్టీ జెండా ఎగిరేనో?
Payakaraopet Politics: ఉమ్మడి విశాఖ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గంలో పాయకరావుపేట ఒకటి. ప్రస్తుతం ఈ నియోజకవర్గం అనకాపల్లి జిల్లాలో భాగంగా ఉంది. ఇక్కడ తొలిసారి 1952లో ఎన్నికలు జరిగాయి.
Payakaraopet: ఉమ్మడి విశాఖ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గంలో పాయకరావుపేట ఒకటి. ప్రస్తుతం ఈ నియోజకవర్గం అనకాపల్లి జిల్లాలో భాగంగా ఉంది. ఇక్కడ తొలిసారి 1952లో ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో 2,04,516 మంది ఓటర్లు ఉండగా, పురుషు ఓటర్లు 99,772 మంది కాగా, మహిళా ఓటర్లు 1,04,735 మంది ఉన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలు ఈ నియోజకవర్గానికి 16వ ఎన్నికలు కావడం గమనార్హం. ఇప్పటివ వరకు జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే ఏడుసార్లు తెలుగుదేశం పార్టీ, నాలుగు సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా, రెండుసార్లు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యరర్థులు విజయం సాధించారు.
ఇవీ ఎన్నికలు ఫలితాలు
పాయకరావుపేట నియోజకవర్గంలో తొలిసారి 1952లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన ఆర్‌ఎస్‌ఎన్ రాజు విజయం సాధించారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఎస్‌ఏ నాయుడుపై 4020 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1962లో జరిగిన ఎన్నికల్లో సీపీఐ నుంచి పోటీ చేసిన ఎం పిచ్చయ్య తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఎం పోతురాజుపై 2085 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1967లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన జి సూర్యనారాయణ ఇక్కడి నుంచి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన బి నాగభూషణంపై 1639 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1972లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన జి సూర్యనరాయణ మరోసారి విజయం దక్కించుకున్నారు. తన సమీప ప్రత్యర్థి ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన జి నాగభూషణంపై 18,256 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు.
1978లో జరిగిన ఎన్నికల్లో ఇండియన్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మారుతి ఆదేయ్య విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన జీసీ నూకరాజుపై 15,467 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1983లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన గంటెల సుమన ఇక్కడ విజయం దక్కించుకున్నారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆర్ నీలవరిపై 23,778 ఓట్ల తేడాతో గెలుపొందారు. 1985లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన కె నూకరాజు విజయం దక్కించుకున్నారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన జీవీ హర్షకుమార్‌పై 29,768 ఓట్ల తేడాతో విజయం దక్కించుకున్నారు. 1989లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన కె నూకరాజు మరోసారి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన గంటెల సుమనపై 3278 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
1994లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన కె నూకరాజు మరోసారి విజయం దక్కించుకున్నారు. ఈ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన గంటెల సుమనపై 4009 ఓట్ల తేడాతో ఆయన గెలుపొందారు. 1999లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన చెంగల వెంకట్రావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి గంటెల సుమనపై 7576 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 2004లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన చెంగల వెంకట్రావు మరోసారి ఇక్కడ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన గంటెల సుమనపై 13,689 ఓట్ల తేడాతో విజయం దక్కించుకున్నారు. 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన గొల్ల బాబూరావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన చెంగల వెంకట్రావుపై 656 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన గొల్ల బాబూరావు మరోసారి వవిజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన చెంగల వెంకట్రావుపై 14,452 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు.
ఆస్తికిగా మారనున్న పోటీ
2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన వంగలపూడి అనిత విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి వైసీపీ నుంచి పోటీ చేసిన చెంగల వెంకట్రావుపై 2828 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గొల్ల బాబూరావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి బరిలోకి దిగిన బి బంగారయ్యపై 31,189 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. రానున్న ఎన్నికల్లో ఇక్కడి నుంచి తెలుగుదేశం, వైసీపీ అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు. సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గొల్ల బాబూరావును వైసీపీ రాజ్యసభకు పంపించింది. ఈ స్థానాన్ని రాజాం సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కంభాల జోగులకు కట్టబెట్టింది. టీడీపీ నుంచి వంగలపూడి అని పోటీ చేయబోతున్నారు. వీరి మధ్య పోటీ ఆసక్తికరంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.