News
News
X

GVL Letter : రెండో విడతలో అయినా విశాఖలో 5జీ సేవలు ప్రారంభించండి - కేంద్రమంత్రికి జీవీఎల్ లేఖ !

విశాఖలో 5జీ సేవలు ప్రారంభించాలని కేంద్రమంత్రికి ఎంపీ జీవీఎల్ లేఖ రాశారు. విశాఖ ఎంతో కీలకమైన సిటీ అని కేంద్రమంత్రికి తెలిపారు.

FOLLOW US: 

GVL Letter : దేశంలో పలు మెట్రో సిటీల్లో 5జీ సర్వీసుల్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. అయితే అలా ప్రారంభించిన సిటీల్లో ఒక్కటి కూడా ఏపీకి చెందిన సిటీ లేదు. విశాఖ, విజయవాడ లాంటి నగరాల్లో స్మార్ట్ ఫోన్ల వినియోగం అధికంగా ఉన్నా 5జీ సర్వీసుల ప్రారంభంలో ప్రాధాన్యత కల్పించకపోవడంపై విమర్శలు వచ్చాయి. దీంతో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఈ అంశంపై స్పందించారు.  విశాఖపట్నంతో పాటు  ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర నగరాల్లో 5G సేవలను ప్రారంభించాలని కేంద్ర మంత్రికి ఎంపీ జీవీఎల్ లేఖ రాశారు.  5G సేవల కోసం విశాఖపట్నం ఎంతో అనుకూలమైనది..   ఆర్థిక ప్రాముఖ్యత కూడా ఉందని లేఖలో జీవీఎల్ నరసింహారావు కేంద్రమంత్రికి తెలిపారు. 

విశాఖకు 5జీ సేవల అవసరం ఎంతో ఉందన్న జీవీఎల్ 

 కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి  అశ్విని వైష్ణవ్‌కి జీవీఎల్ రాసిన లేఖలో విశాఖకు  5జీ సర్వీసుల అవసరం ఎంత ఉందో తెలిపారు.  కేంద్రం అల్ట్రా-హై-స్పీడ్ ఇంటర్నెట్ 5G టెక్నాలజీ డిజిటల్ , ఆర్థిక విప్లవానికి నాంది పలుకుతోందని..  తదుపరి దశలోని నగరాల్లో ముఖ్యమైన విశాఖపట్నం మరియు విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, తిరుపతి వంటి నగరాలలో 5G సేవలను ప్రారంభించేందుకు ప్రాముఖ్యతనివ్వాలని లేఖలో కోరారు. అతి ముఖ్యంగా  విశాఖపట్నం నగరానికి 5G సేవలను  తీసుకురావాల్సిన అవసరాన్ని ఎంపీ జీవీఎల్ లేఖలో ప్రత్యేకంగా చెప్పారు. 

ఏపీకి గ్రోత్ ఇంజిన్‌గా విశాఖ 

News Reels

విశాఖపట్నం చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం..  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి  గ్రోత్ ఇంజిన్ లాంటిదన్నారు.  విశాఖపట్నం తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయానికి స్థావరంగా ఉన్నదని..  విశాఖపట్నం పోర్ట్,  హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్,  హిందుస్తాన్ పెట్రోలియం, సమీర్ మొదలైన ఇతర   సంస్థలతో పాటు ప్రధాన భారతీయ కోస్ట్ గార్డ్ కార్యకలాపాలను కలిగి ఉన్నందున విశాఖపట్నం జాతీయ భద్రతా దృష్ట్యా అత్యంత వ్యూహాత్మక మరియు  ముఖ్యమైన ప్రాంతమని ఆయన తెలిపారు. ఆర్థిక, వ్యూహాత్మక మరియు భద్రతా కారణాల దృష్ట్యా 5G సేవలను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు విశాఖపట్నానికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలని రా  జీవీఎల్ కేంద్ర మంత్రి  అశ్విని వైష్ణవ్‌ను అభ్యర్థించారు.

విశాఖ విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న జీవీఎల్ 

జీవీఎల్ నరసింహారావు ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీగా ఎన్నికైనప్పటికీ ఆయన ఏపీ విషయాల్లోనే ఎక్కువగా స్పందిస్తూ ఉంటారు. ఇటీవలి కాలంలో ఆయన విశాఖ నుంచే ఎక్కువగా రాజకీయ కార్యక్రమాలు చేపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన విశాఖ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారన్న ప్రచారం బీజేపీ వర్గాల్లో సాగుతోంది. ఈ కారణంగానే ఆయన విశాఖపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారని.. ఏమైనా సమస్యలు ఉంటే కేంద్రానికి లేఖలు రాస్తున్నారని అంటున్నారు. విశాఖ రైల్వే జోన్ విషయంలోనూ జీవీఎల్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. రైల్వే జోన్ వస్తుందంటున్నారు.  

కేసీఆర్ ను చూసి నేర్చుకోవాల్సిన దౌర్భాగ్య స్థితిలో వైసీపీ లేదు, మంత్రి హరీశ్ రావుపై గుడివాడ అమర్ నాథ్ ఫైర్

Published at : 03 Oct 2022 04:09 PM (IST) Tags: Visakha GVL Visakha 5G Services MP GVL Narasimha Rao

సంబంధిత కథనాలు

Petrol-Diesel Price, 29 November 2022: డీజిల్‌ కొట్టించాలంటే మాత్రం ఈ జిల్లాల్లో బెటర్!

Petrol-Diesel Price, 29 November 2022: డీజిల్‌ కొట్టించాలంటే మాత్రం ఈ జిల్లాల్లో బెటర్!

Gold-Silver Price 29 November 2022: 53వేల రూపాయల కంటే దిగువకు బంగారం- తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇవే!

Gold-Silver Price 29 November 2022:  53వేల రూపాయల కంటే దిగువకు బంగారం- తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇవే!

ఒక సిఎం కుర్చీకి ఎంతమంది అభ్యర్థులు? వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఏం జరగబోతుంది?

ఒక సిఎం కుర్చీకి ఎంతమంది అభ్యర్థులు? వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఏం జరగబోతుంది?

Gudivada Amarnath: అమరావతి అతి పెద్ద స్కాం, చంద్రబాబు ప్లాన్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి: మంత్రి అమర్నాథ్

Gudivada Amarnath: అమరావతి అతి పెద్ద స్కాం, చంద్రబాబు ప్లాన్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి: మంత్రి అమర్నాథ్

ఏప్రిల్ నుంచి విశాఖ కేంద్రంగా ఏపీ సీఎం జగన్ పరిపాలన - మంత్రి గుడివాడ అమర్నాథ్

ఏప్రిల్ నుంచి విశాఖ కేంద్రంగా ఏపీ సీఎం జగన్ పరిపాలన - మంత్రి గుడివాడ అమర్నాథ్

టాప్ స్టోరీస్

వైఎస్ షర్మిల అరెస్ట్ తర్వాత ఏం జరగబోతుంది?

వైఎస్ షర్మిల అరెస్ట్ తర్వాత ఏం జరగబోతుంది?

CM KCR : యాదాద్రి ప్లాంట్ నుంచి హైదరాబాద్ కు కనెక్టివిటీ, 2023 డిసెంబర్ నాటికి విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ చేయాలి- సీఎం కేసీఆర్

CM KCR : యాదాద్రి ప్లాంట్ నుంచి హైదరాబాద్ కు కనెక్టివిటీ, 2023 డిసెంబర్ నాటికి విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ చేయాలి- సీఎం కేసీఆర్

సుప్రీం కోర్టు తీర్పుతో వైసీపీలో జోష్‌- స్వాగతించిన నేతలు, మంత్రులు

సుప్రీం కోర్టు తీర్పుతో వైసీపీలో జోష్‌- స్వాగతించిన నేతలు, మంత్రులు

Nani: హిట్ 3లో హీరో ఎవరో అప్పుడే తెలుస్తుంది - ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నాని ఏమన్నారంటే?

Nani: హిట్ 3లో హీరో ఎవరో అప్పుడే తెలుస్తుంది - ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నాని ఏమన్నారంటే?