అన్వేషించండి

Andhra Gold Man : ఒంటిపై ఐదు కేజీల బంగారం - ఆంధ్రా గోల్డ్ మ్యాన్ ముక్కా శ్రీనివాస్

విశాఖకు చెందిన ముక్కా శ్రీనివాస్ ఆంధ్రా గోల్డ్ మెన్‌గా దేశం దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆయన తన ఒంటిపై ఐదు కేజీల బంగారాన్ని ధరిస్తారు.


పెళ్లి ఫంక్షన్లలో ఎవరైనా ఆడవాళ్లు కాస్త బంగారం ఎవరైనా ఎక్కువ ధరిస్తే  గోల్డ్ ఉమన్ అంటూ ఉంటారు. అదే మగవాళ్ల చేతులకి ఓఉంగరం ఎక్కువగా కనిపించినా " వీడేందిరా?" అనుకుంటారు. అదే ఏకంగా ఐదు కేజీల బంగారాన్ని ఒంటిపైన వేసుకుని తిరుగుతూ ఉంటే ఊరుకుంటారా ? ఊరుకోరు కానీ గోల్డ్ మ్యాన్ ఆఫ్ ఆంధ్రా అనే  బిరుదిచ్చేశారు. ఈ గోల్డ్ మ్యాన్ ఆఫ్ ఆంధ్రా ఎవరో మీకు పరిచయం చేస్తాం. 

ముక్కా శ్రీనివాస్. ఉండేది విశాఖ పట్నం. ఆయన బయటకు వస్తే ఒళ్లంతా బంగారమే ఉంటుంది. దాదాపుగా ఐదు కేజీల బంగారాన్ని ఆయన ధరిస్తారు. చైన్లు, బ్రాస్‌ లెట్లు, ఉంగరాలు.. ఇలా ఎన్ని రకాలుగా బంగారు ఆభరణాలు పెట్టుకోవచ్చో అన్నీ పెట్టుకుంటారు. ఒకటి కాదు.. అంత కంటే ఎక్కువే పెట్టుకుంటారు. ఆయన బయటకు వస్తే చూసేందుకు జనం ఎగబడుతూంటారు. సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు. ఎప్పుడూ చూసేవాళ్లయినా సరే ఆయన బయటకు వస్తే అబ్బురంగా చూస్తూ ఉంటారు. ఎందుకంటే బంగారానికి ఉన్న ఆకర్షణ అలాంటిది మరి. 

ముక్కా శ్రీనివాస్ ఇలా బంగారం ఒంటి నిండా ఎందుకు దిగేసుకుంటున్నారు ? అనే డౌట్ చాలా మందికి వచ్చింది. ఆయన తనకు ఉంది .. దాన్ని ఇలా ప్రదర్శించుకుంటున్నారని కొంత మంది విమర్శలు చేస్తారు. కానీ నిజం మాత్రం వేరే. పసుపు రంగులో ఉండే లోహాలను ధరిస్తే.. మంచిదని ఆయన నమ్మకం . శాస్త్రం కూడా అదే చెప్పిందని అంటారు. అదే సమయంలో చిన్న తనంలో ముక్కా శ్రీనివాస్ తల్లి బంగారం ధరించడాన్ని ప్రోత్సహించింది. బంగారం ధరిస్తే ఎంతో ఆత్మవిశ్వాసం వస్తుందని ఆమె తల్లి చెప్పింది. చిన్నప్పటి నుండి అలా అలవాటు చేసుకున్న ముక్కా శ్రీనివాస్ తన ఒంటిపై బంగారాన్ని అలా పెంచుకుంటూ పోతున్నారు. చివరికి ఇప్పటికి ఐదు కేజీలు అయింది. ముందు ముందు ఇంకా పెంచుకునేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు. 

ఇలా బంగారం వేసుకుని తిరుగుతూంటే మరి సెక్యూరిటీ ఎలా అనే డౌట్ రావొచ్చు.. దానికి కూడా ఆయన ఏర్పాట్లు చేసుకున్నారు. నమ్మకంతో ధరిస్తున్న బంగారం ఇప్పుడు ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. ఇలాంటి గోల్డ్ మ్యాన్‌లు ఇతర రాష్ట్రాల్లోనూ ఉన్నారు. పుణెకు చెందిన ప్రశాంత్ కుమార్ ఇదే తరహాలో బంగారం ధరించి ప్రజల దృష్టిని ఆకర్షించారు. కొసమెరుపేమిటంటే.. ముక్కా శ్రీనివాసే ఐదు కేజీలు బంగారం ధరిస్తూంటే.. ఆయన భార్యకు ఇంకా ఎంత బంగారం కొనిచ్చి ఉంటారోనని సోషల్ మీడియాలో  నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. 

ముక్కా శ్రీనివాస్ పవన్ కల్యాణ్ అబిమాని. జనసేన పార్టీలో కూడా కీలకంగా  ఉన్నారు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నడి సంద్రంలో ఇద్దరే మహిళలు, భూగోళాన్ని చుట్టే్సే అద్భుత యాత్రట్రంప్ ఎన్నికతో మస్క్ ఫుల్ హ్యాపీ! మరి కూతురికి భయమెందుకు?ఉడ్‌బీ సీఎం అని  లోకేశ్ ప్రచారం - అంబటి రాంబాబుఅధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
Safest Cars: ఇండియాలో సేఫెస్ట్ కార్లు ఇవే - టాటా పంచ్ నుంచి ఎక్స్‌యూవీ700 వరకు!
ఇండియాలో సేఫెస్ట్ కార్లు ఇవే - టాటా పంచ్ నుంచి ఎక్స్‌యూవీ700 వరకు!
TDP: గొడ్డలి వేటు పడినా పోలింగ్‌ బూత్‌లో ఏజెంట్‌గా విధులు - పల్నాడు కార్యకర్తకు పదవి ఇచ్చిన టీడీపీ
గొడ్డలి వేటు పడినా పోలింగ్‌ బూత్‌లో ఏజెంట్‌గా విధులు - పల్నాడు కార్యకర్తకు పదవి ఇచ్చిన టీడీపీ
TG Praja Vijayotsavalu: రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్‌కు ఏడాది! - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్‌కు ఏడాది! - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
CM Chandrababu: తిరుమల తరహాలో శ్రీశైలం అభివృద్ధికి కమిటీ - త్వరలోనే శుభవార్త చెబుతానంటూ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
తిరుమల తరహాలో శ్రీశైలం అభివృద్ధికి కమిటీ - త్వరలోనే శుభవార్త చెబుతానంటూ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Embed widget