అన్వేషించండి

Pawan Kalyan In Gajuwaka: దోపిడీ చేసే జగన్ కు 151 సీట్లు, కానీ గాజువాకలో నాకు ఓటమి దెబ్బ: వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్

Pawan Kalyan Gajuwaka Varaahi Yatra: గాజువాకలో వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఓ ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చిన వారికి ఓటమిని ఎలా తీసుకోవాలో తెయదన్నారు.

Pawan Kalyan Gajuwaka Varaahi Yatra: గాజువాకలో ఓడిపోయిన తనకు ప్రజలు ఇంత ఘన స్వాగతం పలకడంతో ఇక్కడ నిజంగా ఓటమి తెలియట్లేదన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. తనను ఓడించిన గాజువాక ప్రజల ముందుకు వెళితే ఆదరిస్తారా అని సందేహపడ్డానని, అయితే ఇక్కడికి వచ్చి చూస్తే ఘన స్వాగతం పలికారని గుర్తుచేసుకున్నారు. 2019 ఎన్నికల్లో త్రికరణ శుద్ధిగా పనిచేశాను, ఈరోజు అదే ఉద్దేశంలో నా నియోజకవర్గానికి వచ్చాను అన్నారు. గాజువాకలో వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఓ ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చిన వారికి ఓటమిని ఎలా తీసుకోవాలో తెయదన్నారు. ఇటీవల జగదాంబ సెంటర్ లో తాను ఇదే విషయాన్ని ప్రస్తావించినట్లు చెప్పారు. అంబేద్కర్, గాంధీ ఆశయాలు.. నేతాజీ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చానన్నారు.

వైఎస్ జగన్ లాంటి వ్యక్తి దోపిడీ చేస్తాడని తెలుసు, అయినా 151 సీట్లు, 22 పార్లమెంట్ సీట్లు ఇచ్చి ఆ వ్యక్తిని ప్రజలు గెలిపించారన్నారు. భవన నిర్మాణ కార్మికులు వచ్చి తమ సమస్యలు చెప్పుకున్నారు, కానీ 3 నెలల్లోనే 30 మందికి పైగా కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. లక్షల మంది కార్మికుల జీవితాలు రోడ్డున పడ్డాయన్నారు. ఓసారి ఎయిర్ పోర్టుకు వస్తే ప్రజలు ఎక్కువ రాలేదని, కొంచెంసేపు ఎదురుచూద్దామని జనసేన నేతలు చెబితే.. తాను జనాలు వస్తారని రాజకీయాల్లోకి రాలేదన్నారు. మనం చేసే మంచి గుర్తించి వస్తారని దీమా వ్యక్తం చేశారు. ఎయిర్ పోర్టు నుంచి బయటకు వచ్చి చూస్తే లక్షల మంది తనకోసం తరలిరావడం సంతోషాన్ని కలిగించిందని, రాజకీయ ఓనమాలు నేర్చుకున్నచోటుకు మళ్లీ వచ్చానన్నారు.

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినాదాలు వినిపిస్తున్నాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏపీకి చాలా కీలకమైనది. తెలంగాణకు చెందిన వారితో కలిపి మొత్తం 30కి పైగా బలిదానాలు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో ఎందరో అమరులై స్టీల్ ప్లాంట్ సాధించుకున్నారని చెప్పారు. కులాలు, మతాలు, ప్రాంతాలు అనే వ్యత్యాసం లేకుండా అంతా విశాఖ ఉక్కు ఎప్పటికీ ఆంధ్రుల హక్కు అని ప్రజలు భావిస్తున్నారు. ఉత్తరాంధ్రలో గానీ, అమరావతిలోగానీ పరిశ్రమలు, ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోయిన వారికి న్యాయం జరగాలన్నారు. పరిశ్రమల కోసం భూములు ఇచ్చిన రైతులు దేవాలయాల వద్ద బిక్షాటన చేసి బతికారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ సీఎం జగన్ మాత్రం వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఒక్క మాట మాట్లాడరని, అలాంటప్పుడు నీకు రాజకీయాలు అవసరమా అని సెటైర్లు వేశారు.

పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ కొందరు నిర్వాసితులకు ఇంకా పరిహారం అందలేదన్నారు. ఎన్నో కష్టాల తరువాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ మనకు దక్కితే, సీఎం జగన్ మాత్రం సైలెంట్ గా ఉన్నారని విమర్శించారు. అసెంబ్లీతో పాటు పార్లమెంట్ లోనూ భారీగా సీట్లు వైసీపీకి మెజార్టీ అందిస్తే.. తమకు ప్రజల సమస్యలు పట్టవన్నట్లు జగన్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మాకు ఎంపీ సీటు ఇచ్చి ఉంటే పార్లమెంట్ లో మా గళం విప్పి ప్రశ్నించేవాళ్లమన్నారు. కానీ వైజాగ్ ప్రజలు రౌడీ షీటర్ ను ఎన్నుకుంటే, ఆ రౌడీ ఎంపీ ప్రజల కోసం ఎందుకు నిలబడతారు. ఏపీకి ప్రత్యేక హోదా లాంటి విషయంలోనూ వైసీపీ ప్రభుత్వం రాజీపడిందని, తమ ప్రయోజనాలే ముఖ్యమని సెలైంట్ గా ఉన్నారని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Sharmila On Jagan : జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి -  షర్మిల డిమాండ్
జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి - షర్మిల డిమాండ్
Bloody Beggar Review: బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
Minister Atchannaidu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Sharmila On Jagan : జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి -  షర్మిల డిమాండ్
జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి - షర్మిల డిమాండ్
Bloody Beggar Review: బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
Minister Atchannaidu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
UP Women Commission: మహిళల దుస్తుల కొలతలు పురుషులు తీసుకోవద్దు - యూపీ మహిళా కమిషన్ కీలక ప్రతిపాదనలు
మహిళల దుస్తుల కొలతలు పురుషులు తీసుకోవద్దు - యూపీ మహిళా కమిషన్ కీలక ప్రతిపాదనలు
Dharmavaram lands: ధర్మవరం మాజీ ఎమ్మెల్యేకు చెరువు కబ్జా నోటీసులు - కోర్టుకెళ్తానన్న కేతిరెడ్డి - ఆ చెరువు ఇల్లు మాత్రం నెక్ట్ లెవల్ !
ధర్మవరం మాజీ ఎమ్మెల్యేకు చెరువు కబ్జా నోటీసులు - కోర్టుకెళ్తానన్న కేతిరెడ్డి - ఆ చెరువు ఇల్లు మాత్రం నెక్ట్ లెవల్ !
KTR Arrest : అరెస్ట్‌కు మానసికంగా సిద్ధం అయిన కేటీఆర్ - కాంగ్రెస్ ఆటంబాంబు ఈ సారి పేలడం ఖాయమేనా ?
అరెస్ట్‌కు మానసికంగా సిద్ధం అయిన కేటీఆర్ - కాంగ్రెస్ ఆటంబాంబు ఈ సారి పేలడం ఖాయమేనా ?
HBD Revanth Reddy: రేవంత్ రెడ్డికి కేటీఆర్ బర్త్‌డే విశెష్‌- సీఎం పుట్టిన రోజు కేక్ కట్‌ చేస్తానంటూ ట్వీట్ 
రేవంత్ రెడ్డికి కేటీఆర్ బర్త్‌డే విశెష్‌- సీఎం పుట్టిన రోజు కేక్ కట్‌ చేస్తానంటూ ట్వీట్ 
Embed widget