Vizag News: బెంగళూరు - గౌహతి ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు, సింహాచలంలో నిలిపివేసిన రైల్వే సిబ్బంది
Vizag News: బెంగళూరు - గౌహతి ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు రావడంతో రైల్వే అధికారులు, సింహాచలంలో రైలు నిలిపివేసి మంటలు ఆర్పేశారు.అనంతరం ఎక్స్ ప్రెస్ రైలు గౌహతికి బయలుదేరినట్లు అధికారులు తెలిపారు.
Guwahati Bengaluru Express train News | సింహాచలం: ఇటీవల రైలు ప్రమాదాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో మరో రైలు అగ్ని ప్రమాదానికి గురైంది. విశాఖలో బెంగళూరు - గౌహతి ఎక్స్ ప్రెస్ రైలు పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. సింహాచలం చేరుకునే సమయానికి ఎస్ 7 బోగిలో ఒక్కసారిగా పొగ రావటంతో అప్రమత్తమయ్యారు. సింహాచలంలో బెంగళూరు - గౌహతి ఎక్స్ ప్రెస్ రైలు నిలిపివేశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ ప్రమాదంపై రైల్వే అధికారులు స్పందించారు. S7 బోగీ చక్రాల వద్ద పొగ వచ్చింది. సాంకేతిక లోపంతో బ్రేక్ వద్ద పొగలు వచ్చాయని తెలిపారు. ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చిన అనంతరం సింహాచలం స్టేషన్ నుంచి express train గౌహతి వైపు బయలుదేరింది. అయితే ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు అని వివరించారు.
Also Read: AP Floods: ఏపీలో వరద బాధితులకు పరిహారంపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన, తేదీ ఫిక్స్