అన్వేషించండి

Expert committee in Rushikoda: రిషికొండ నిర్మాణాలను పరిశీలించిన కేంద్ర కమిటీ-ఏం తేల్చిందంటే..?

రుషికొండ మీద జరుగుతున్న నిర్మాణాలను కేంద్ర కమిటీ పరిశీలించింది. అధికారులతో మాట్లాడి వివరాలు సేకరించింది. నిర్మాణాల కోసం తవ్విన ప్రాంతంలోని మట్టి డంప్ను కూడా పరిశీలించారు.

Central Committee Inspect Rushikonda: ఆంధ్రప్రదేశ్‌ విశాఖలోని రుషికొండ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన జగన్‌  సర్కార్‌... రుషికొండపై సీఎం క్యాంపు కార్యాలయంతోపాటు కొన్ని భవనాలు నిర్మిస్తోంది. అయితే.. కొండపై జరుగుతున్న నిర్మాణాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని  ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. హైకోర్ట్‎లో కూడా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది.  కోర్టు ఆదేశాల మేరకు రుషికొండపై అక్రమ తవ్వకాలు, నిర్మాణాల్లో నిబంధనల ఉల్లంఘనల తీవ్రతను తేల్చేందుకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ నియమించిన  నిపుణుల కమిటీ విశాఖ చేరుకుని... రుషికొండపై నిర్మిస్తున్న భవనాలను పరిశీలించింది. 

నిన్న (గురువారం) మధ్యాహ్నం 12గంటల సమయంలో రుషికొండకు చేరుకున్న కేంద్ర కమిటీ బృందం సభ్యులను.. ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) అధికారులు  రిసీవ్‌ చేసుకున్నారు. అధికారులు స్వాగతం పలికారు. కె.గౌరప్పన్ నేతృత్వంలో నేషనల్ సెంటర్ ఫర్ సస్టెయినబుల్ కోస్టల్ మేనేజ్మెంట్ (NCSCN), పబ్లిక్స్ వర్క్స్ విభాగం,  కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, ఎంవోఈఎఫ్ ప్రాంతీయ కార్యాలయం నుంచి కమిటీ సభ్యులు వచ్చారు. వీరంతా రుషికొండకు చేరుకుని టూరిజం శాఖ నిర్మిస్తున్న  నిర్మాణాలను పరిశీలించారు. 

ముందుగా కొండను ఆనుకొని ఉన్న క్యాంపు కార్యాలయానికి వెళ్లిన బృంద సభ్యులు అక్కడ కొద్ది నిమిషాలు అధికారులతో మాట్లాడారు. ఆ తర్వాత ప్రతీ బ్లాక్ దగ్గరకు వెళ్లి  నిర్మాణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఏపీటీడీసీ, జీవీఎంసీ అధికారులు దగ్గరుండి కేంద్ర కమిటీ సభ్యులు అడిగిన అన్నీ వివరాలను అందించారు. నిన్న(గురువారం)  మధ్యాహ్నం 3 గంటల వరకు రుషికొండపై జరుగుతున్న నిర్మాణాలను పరిశీలించి కేంద్ర కమిటీ సభ్యులు... ఆతర్వాత అక్కడి నుంచి తీరం వెంట మట్టిని డంప్‌ చేసిన  ప్రాంతాలను కూడా చూశారు. సాయంత్రం ఆరు గంటల వరకు కేంద్ర బృందం తనిఖీలు జరిగాయి. 

నిజానికి గత ఏడాది హైకోర్ట్ నియమించిన నిపుణుల కమిటీ రుషికొండపై జరుగుతున్న నిర్మాణాలపై ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ప్రకారం ఎక్కడైనా నిబంధనల ఉల్లంఘన జరిగి ఉంటే సరిచేయాలని హైకోర్టు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖను ఆదేశించింది. అయితే మళ్లీ పిటిషన్ దార్లు సరికొత్త ఆరోపణలను కోర్ట్ ముందుకు తీసుకువచ్చారు. రుషికొండపై నిర్మిస్తున్న ప్రతి బ్లాకులోనూ సీఆర్‌జెడ్‌-తీర ప్రాంత క్రమబద్ధీకరణ జోన్ ఉల్లంఘనలు జరిగాయని... వాటిపై చర్యలు తీసుకోవాలంటూ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు... నిబంధనల ఉల్లంఘనలపై ఎలాంటి చర్యలు చేపట్టారో వివరించాలని కేంద్ర పర్యావరణ అటవీశాఖను ఆదేశించింది హైకోర్టు. దీంతో ఎంవోఈఎఫ్ ఉల్లంఘనల పరిశీలనకు మరో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు గత నెల 29న కోర్టుకు తెలిపింది కేంద్ర పర్యావరణ అటవీశాఖ. ఆ కమిటీ.. ఇప్పుడు రుషికొండపై జరుగుతున్న నిర్మాణాలను పరిశీలించింది. 

ఇవాళ (శుక్రవారం), రేపు (శనివారం) రుషికొండపై నిర్మాణాలను పూర్తిగా పరిశీలించ నుంది కేంద్ర కమిటీ. ఆ తర్వాత పూర్తి వివరాలతో హైకోర్టుకు నివేదిక సమర్పించనుంది. ఆ నివేదికను పరిశీలించిన తర్వాత హైకోర్టు ధర్మాసనం.. ఏ విధమైన ఉత్తర్వులు ఇస్తుందో చూడాలి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget