భోగాపురం విమానాశ్రయానికి ఎన్నిసార్లు శంకుస్థాపనలు?
భోగాపురం విమానాశ్రయం శంకుస్థాపనకు ఇప్పటికే మూడు ఆహ్వానాలు పంచారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు విమర్శించారు. విజయనగరంలో మీడియాతో మంగళవారం ఆయన మాట్లాడారు. ఇప్పటికే ఒక ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారని... మరోసారి ప్రధానమంత్రితో వర్చువల్ గా చేయిస్తామన్నారని.. ఇప్పుడు మూడోసారి శంకుస్థాపన చేస్తున్నారు.. దీంతో అయిపోతుందా? అని ఇంకోసారి జరుగుతుందా అని అశోక్ గజపతిరాజు ప్రశ్నించారు.
ఎవరు సీఎం అవుతారో, ప్రధాని మంత్రి ఎవరో!
ఇప్పటికే ఎన్నోసార్లు తేదీలు ప్రకటించి.. 2024 నాటికి పూర్తి కూడా చేసేస్తామని అన్నారని గుర్తు చేశారు. ఇప్పుడు మూడు, నాలుగు సంవత్సరాలు అంటున్నారు. అప్పటికి ఎవరు ప్రధాన మంత్రి అవుతారో, ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటారో అని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని వెనక్కి తోయడం, అప్పుల్లోకి పడేయడం తమకు ఇష్టం లేదన్నారు. భోగాపురం విమానాశ్రయానికి రైతులు భూములను త్యాగం చేశారన్నారు. అందులో 500 ఎకరాలు వ్యాపారాల కోసం పక్కకు పెట్టారని.. రైతుల త్యాగాలను గుర్తించరా? అని ప్రశ్నించారు. 'అమరావతి రైతులు 33 వేల ఎకరాలిచ్చారు. ఆ త్యాగాలను గుర్తించరా? గన్నవరం ఎయిర్ పోర్టుకు 900 ఎకరాలు త్యాగాలు చేశారు. ఆ త్యాగాలను గుర్తించరా?' అని ప్రశ్నించారు.
రాష్ట్ర విభజన అయిన వెంటనే రాష్ట్రంలో కనెక్టివిటీ తక్కువగా ఉందని, ప్రత్యేకించి ఎయిర్పోర్టు కనెక్టివిటీ తక్కువగా ఉండటం వల్ల అందరినీ ఒప్పించి విమానాశ్రయాలకు అనుమతులు తెచ్చామని అశోక్ గజపతిరాజు అన్నారు. అందరి సహకారంలో కడప, రాజమండ్రి, విజయవాడ ఎయిర్పోర్టులు యాక్టివ్ చేయించగలిగామన్నారు. భోగాపురం, గోవా లాంటి చోట్ల గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలకు అనుమతులు వచ్చాయన్నారు. విమానాలంటే ధనవంతులకే అవి భ్రమ ఉండేదని, సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో కొన్ని ఎయిర్ పోర్టులను తీసుకురాగా... అప్పట్లో మంజూరైన గోవా వంటి చోట్ల ప్రారంభం కూడా అయ్యి విమానాలు టేక్ ఆఫ్ అవుతున్నాయన్నారు. భోగాపురానికి వచ్చేసరికి ఫౌండేషన్ సమయానికి తాను మాజీ మంత్రి, మాజీ ఎంపీ అయ్యానని సెటైర్లు వేశారు.
విమానాశ్రయం వల్ల 1:6 నిష్పత్తిలో ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయన్నారు. మన రాష్ట్రంలోని యువతకు ఉపాధి చూపించేందుకు ఇదొక మార్గమన్నారు. ఉద్యోగ అవకాశాలు పెరగాలని, ఉత్తర కోస్తా జిల్లాలు అభివృద్ధి చెందాలని తామూ కోరుకుంటున్నామన్నారు. 'మరో మూడు, నాలుగు సంవత్సరాలు అంటున్నారు.. ఈలోగా పదవులన్నీ మారుతాయి. మళ్లీ ఎన్నికలు జరుగుతాయి. అప్పటికి కొత్త ముఖ్యమంత్రిగా ప్రజలు ఎవరిని గెలిపిస్తారో, కొత్త ప్రధానమంత్రి ఎవరొస్తారో... అప్పుడు కొత్త ముఖ్యమంత్రి, ప్రధానులు తామే ఫౌండేషన్ వేయాలంటారేమో! అదే జరిగితే ఉత్తర కోస్తా ప్రజలను హేళన చేసినట్లే. మీ కోపాన్ని ఉత్తర కోస్తా ప్రజల మీద అభివృద్ధి మీద చూపవద్దు' అని' అశోక్ గజపతిరాజు వ్యాఖ్యానించారు.
Top 10 Headlines Today: బాలినేనితో సీఎం జగన్ ఏం మాట్లాడతారు? ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్
Top 10 Headlines Today: తెలంగాణలో రాష్ట్రావతరణ వేడుక ఉత్సాహం- ఏపీలో పోస్టర్ వివాదం- మార్నింగ్ ఏబీపీ దేశం టాప్ న్యూస్
APPSC Group1 Mains: జూన్ 3 నుంచి 'గ్రూప్-1' మెయిన్స్ పరీక్షలు! హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారా?
CPI Ramakrishna: సీఎం జగన్ ముందస్తుకు వెళ్తే అదే జరుగుతుంది, మేం స్వాగతిస్తాం - సీపీఐ రామక్రిష్ణ వ్యాఖ్యలు
APKGBV Notification: ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో 1,358 టీచింగ్ పోస్టులు - దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం!
Telangana New Party : తెలంగాణలో కొత్త పార్టీ ఖాయమా ? బీఆర్ఎస్ ను ఓడించడానికా ? గెలవడానికా ?
AP Flexi War : ఫ్లెక్సీల వార్ చేసుకుంటున్న ఏపీ రాజకీయ పార్టీలు - వైసీపీ పోస్టర్లకు టీడీపీ, జనసేన కౌంటర్లు !
Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!
Road Accident News : తెలుగు రాష్ట్రాలో ఘోర రోడ్డు ప్రమాదాలు - వేర్వేరు ఘటనల్లో తొమ్మిది మంది మృతి!