By: ABP Desam | Updated at : 18 Aug 2023 06:01 PM (IST)
మన్యంలో అవకాడో సాగుతో రైతులకు లాభాల పంట
Manyam Farmers Grows Avocado: ఆరోగ్య ప్రయోజనాల కారణంగా ఇటీవల ఎక్కువ మంది ఇష్టపడుతున్న పండుగా అవకాడో మారిపోయింది. మెక్సికో, మధ్య అమెరికా లాంటి ప్రాంతాల్లో పండించే పంట అవకాడో. దీన్ని శీతల ప్రాంతాల్లోనే పండిస్తారు. అయితే ఏపీ, తెలంగాణలోనూ అవకాడో పండించటం మొదలుపెట్టి రైతులు లాభాలు గడిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం దెబ్బగూడకు చెందిన 30 ఏళ్ల జైపాల్ నాయక్ అవకాడో సాగుచేయడం తెలిసిందే. విదేశాలకు సైతం అవకాడోను ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.
ఏపీలోనూ మన్యం ప్రాంతంలో ఓ రైతు అవకాడోను సాగు చేస్తున్నారు. స్ట్రాబెరీ, డ్రాగన్ ఫ్రూట్, ఆపిల్ లాంటి తోటల సాగుకు ఏజెన్సీలోని చల్లని వాతావరణం అనువుగా ఉంటుంది. అమెరికా, బ్రెజిల్, మెక్సికో, కొలంబియా లాంటి ప్రాంతాల్లో పండించే ఆ పంటను అల్లూరి ఏజెన్సీలోని చింతపల్లిలో సాగు చేస్తున్నారు. ఆంధ్ర కాశ్మీర్ గా పిలుచుకునే ప్రాంతం లంబసింగి. ఇక్కడి గిరిజనలు అవకాడోను పండించి లాభాలు గడిస్తున్నారు. పోషకాలు ఎక్కువగా అవకాడోను సాగు చేస్తున్నాడు చింతపల్లి మండలం గొందిపాకలకు చెందిన ఆదివాసి రైతు రాంబాబు. ఏజెన్సీ వాతావరణం ఇలాంటి పండ్ల తోటల పెంపకానికి అనువుగా ఉంటుంది. అయితే కాఫీ సాగు కోసం అవకాడో సాగు మొదలుపెట్టారు ఆ రైతు. కాఫీ మొక్కలకు నీడ ఇస్తుందని అవకాడో సాగు వైపు మొగ్గుచూపారు.
లాభాలు పండిస్తున్న పంట..
ఏజెన్సీలోని చింతపల్లి మండలం గొందిపాకలులో ఆదివాసి రైతు రాంబాబు అమెరికా లాంటి శీతల ప్రదేశాల్లో సాగు చేసే అవకాడో పంట వేశారు. వాస్తవానికి కావాలని అవకాడోను సాగు చేయలేదు, ఇక్కడి కాఫీ మొక్కలకు నీడ కోసం అవకాడో సరిపోతుందని భావించి రైతు ప్లాన్ చేశారు. దాదాపు రెండు దశాబ్దాల కిందట కాఫీ బోర్డు అధికారులు గిరిజన రైతు రాంబాబుతో పాటు మరికొందరు స్థానిక రైతులకు అవకాడో మొక్కలు పంపిణీ చేశారు. పదేళ్ల కిందట సైతం అవకాడోను రైతులకు పంపిణీ చేయగా, వారు ప్రయోగాత్మకంగా ఏజెన్సీలో కాఫీ పంటలో అంతర పంట తరహాలో అవకాడో సాగు చేశారు. ఆ పంట్ల మొక్కలు కాఫీ పంటలకు నీడ నివ్వడంతో పాటు ఇప్పుడు గిరిజన రైతులకు కాసులు కురిస్తున్నాయి. కాఫీ పంటకు నీడను ఇచ్చే వీటిని రూ.25 ఒకటి చొప్పున కొనుగోలు చేశారు. రాంబాబు అవకాడో మొక్కల్ని నాటారు. 10 ఏళ్ల తరువాత వాటి లాభాలు అందుకుంటున్నారు. మొదటి ఐదేళ్లలో ఒక్క చెట్టుకు కేవలం 5 నుంచి 10 అవకాడో మాత్రమే కాసేవి. తరువాత భారీ సంఖ్యలో దిగుబడి వస్తోంది. మార్కెట్లో కేజీ రూ.200 వరకు ధర ఉంది.
నీడకోసం వేసి, నేడు లాభాల పంటగా మారి..
అప్పట్లో రైతులు కేవలం కాఫీ తోటలకు నీడ అందించేందుకు అవకాడో సాగు చేశారు. అందులోనూ ఇక్కడ అవకాడో ప్రాధాన్యత తెలియకపోవడం, దిగుబడి తక్కువగా ఉండేది. ఇప్పుడు ఆ చెట్లకు గుత్తులు గుత్తులుగా 600కు పైగా కాయలు కాయడంతో రైతు రాంబాకు లాభసాటిగా మారింది. సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్న అవకాడో పోషకాల గనిగా మారింది. 15 నుంచి 35 సెంటీగ్రేడ్ డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే వాతావరణం అవకాడోకు అనుకూలం. పంట మొదలుపెట్టిన 5 ఏళ్ల తరువాత ఫలాలు రావడంతో రైతులు దీనిపై అంతగా ఫోకస్ చేయలేదు. పదేళ్ల తరువాత డిమాండ్ వస్తుందని గ్రహించి రైతులు అవకాడో సాగును విస్తరించాలని భావిస్తున్నారు. డ్రాగన్ ఫ్రూట్, ఆపిల్ సాగుకే పరిమితమైన ఏజెన్సీ రైతుల ఇప్పుడు అవకాడోను విస్తరించి లాభాలు గడించాలని భావిస్తున్నారు. అధికారులను తమకు సాయం చేయాలని కోరుతున్నారు.
అవకాడోతో ప్రయోజనాలు..
కేరళ, కర్ణాటక ప్రాంతాల్లో పండించే ఈ పంటను ప్రస్తుతం ఏపీ, తెలంగాణలోనూ సాగు చేస్తున్నారు. గతంలో దిగుమతి చేసుకున్న ఈ పంటను ఇప్పుడు విదేశాలకు ఎగుమతి చేసేలా సాగు అవుతోంది. అవకాడో తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో కేలరీలు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. మోనోశాచురేటెడ్ కొవ్వు అయినప్పటికీ దాన్ని అధిక మొత్తంలో తీసుకుంటే బరువు పెరగడానికి దోహదపడుతుంది. ఇన్ స్టంట్ ఎనర్జీ కోసం అవకాడో తింటే ప్రయోజనం ఉంటుంది. పొటాషియం, మెగ్నీషియం ఉండటంతో ఇవి డయాబెటిస్ ను నియంత్రిస్తాయి. వీటిని నాచో చిప్స్, బ్రెడ్ టోస్ట్, వెజిటబుల్ క్రూడిట్స్, సలాడ్ పై డ్రెస్సింగ్, టాపింగ్ గా కూడా తీసుకోవచ్చు ఇవి సూపర్ మార్కెట్లో, ఆన్ లైన్ గ్రోసరీలలో మాత్రమే ఇవి దొరుకుతాయి.
Navy Day: విశాఖలో ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు - ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్
Inter Exams: ఏపీలో మార్చి 1 నుంచి ఇంటర్, 21 నుంచి టెన్త్ పరీక్షలు - షెడ్యూలుపై త్వరలో స్పష్టత
Breaking News Live Telugu Updates: యశోద హాస్పిటల్లో కేసీఆర్‌ను పరామర్శించిన చిన్న జీయర్ స్వామి
Chandra Babu Comments on Tickets: తెలంగాణ ఫలితాలతో చంద్రబాబు అలర్ట్ -అలాంటి వారికి డోర్స్ క్లోజ్
తాకట్టు కోసం వచ్చిన బంగారంతోనే వ్యాపారం- ఎస్బీఐ ఉద్యోగి ఘరానా మోసం - శ్రీకాకుళంలో సంచలనం
General elections in February : ఫిబ్రవరిలోనే సాధారణ ఎన్నికలు ? కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోందా ?
Guntur: అంబేడ్కర్ విగ్రహం ముందు బట్టలిప్పి అసభ్య ప్రవర్తన! పొన్నూరులో రేగిన దుమారం
Samuthirakani: ఎమ్మెల్యే బయోపిక్‌లో సముద్రఖని - తెరపైకి తెలంగాణ రాజకీయ నాయకుని కథ!
Chhattisgarh CM: ఛత్తీస్‌గఢ్ సీఎంగా మాజీ కేంద్రమంత్రి విష్ణుదేవ సాయి - మొత్తానికి క్లారిటీ ఇచ్చిన పార్టీ
/body>