అన్వేషించండి

సైకిల్ ఎక్కిన పట్టభద్రులు - ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమల్లో టీడీపీ జోరు - అక్కడ వైసీపీ!

వైసీపీ బలపర్చిన అభ్యర్థి సీతం రాజు సుధాకర్ ను గెలిపించడం ద్వారా విశాఖ రాజధాని కావాలన్న ఆకాంక్షను బలంగా చాటాలని అధికార పార్టీ ఇచ్చిన పిలుపును గ్రాడ్యుయేట్లు పట్టించుకోలేదు.

నువ్వూ వద్దు.. నీ రాజధాని వద్దు అన్నట్లుగా ఉత్తరాంధ్ర పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీర్పునిచ్చారు. వైసీపీ బలపర్చిన అభ్యర్థి సీతం రాజు సుధాకర్ ను గెలిపించడం ద్వారా విశాఖ రాజధాని కావాలన్న ఆకాంక్షను బలంగా చాటాలని అధికార పార్టీ ఇచ్చిన పిలుపును గ్రాడ్యుయేట్లు, మరీ ముఖ్యంగా ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలు తిప్పి కొట్టాయి. ఫలితంగా టీడీపీ అభ్యర్థి డాక్టర్ వేపాడ చిరంజీవిరావుకు ఏడో రౌండ్ లెక్కింపు పూర్తయ్యేసరికే 26,358 ఓట్ల మెజార్టీ లభించింది. ఏ రౌండ్లోనూ అధికార పార్టీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ చిరంజీవిరావుకు పోటీ ఇవ్వలేకపోయారు.

పీడీఎఫ్ అభ్యర్థి కోరెడ్ల రమాప్రభ గెలిస్తే అధికార వైసీపీకి ఓడిపోయారనే సందేశం వెళ్లదని భావించిన గ్రాడ్యుయేట్లు గంపగుత్తగా తెలుగుదేశం అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేశారు. మిగిలిన ఒక రౌండ్ లెక్కింపు ఉండగానే ఏడో రౌండ్ పూర్తి అయ్యే సరికి టీడీపీకి 80,762 ఓట్లు పడగా, వైకాపాకు 54,404 ఓట్లు వచ్చాయి.పీడీఎఫ్ అభ్యర్థికి 33,364, బీజేపీకి 8,988 ఓట్లు వచ్చాయి. ఈ ఆరు రౌండ్లలో 10,117 ఓట్లు చెల్లకుండా పోవడం విశేషం. దీంతో టీడీపీ అభ్యర్థికి 26,358 ఓట్లు ఆధిక్యత లభించినట్లయింది. 2007, 2011, 2017 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండో ప్రాధాన్యత ఓటు ఆధారంగా ఫలితం తేలింది. కానీ వేపాడ చిరంజీవికి మాత్రం ఆ అవసరం లేకుండానే మొదటి ప్రాధాన్యత ఓటుతోనే డిక్లేర్ చేసే అవకా శాలు కనిపిస్తున్నాయి.

టీడీపీకి జై కొట్టిన ఉపాధ్యాయులు 
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించారు. ఉత్తరాంధ్ర ఉమ్మడి మూడు జిల్లాల్లో ఉన్న దాదాపు 28వేల మంది ఉపాధ్యాయులు ఈసారి టీడీపీకి అనుకూలంగా ఓటు వేశారు. ఉపాధ్యాయ యూనియన్లతో ఉన్న సంబంధ బాంధవ్యాల ప్రకారం రాయలసీమలో జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొటాబొటీ మెజార్టీతోనైనా అధికార పార్టీ అభ్యర్థులే గెలుస్తారని ముందుగానే తెలుసుకున్న టీచర్లు ఉత్తరాంధ్రలో మాత్రం కసితీరా తెలుగుదేశానికి ఓట్లేశారు. రాష్ట్రంలో మూడు చోట్ల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండుచోట్ల ప్రతిపక్ష టీడీపీ అభ్యర్థులే ముందంజలో ఉన్నా రు. ఉత్తరాంధ్ర టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావుతో పాటు తూర్పు రాయలసీమలో పట్టభద్రుల ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ ఐదో రౌండ్ పూర్తయ్యేసరికి 17వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో ఉన్నారు. ఇక్కడ కూడా టీడీపీ గెలుపు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

ఇక పశ్చిమ రాయలసీమలో టీడీపీ, వైసీపీ మధ్య పోరు హోరాహోరీని తలపిస్తోంది. ఐదు రౌండ్లు పూర్తయ్యేసరికి వైకాపా అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి 1972 ఓట్ల ఆధిక్యతతో మాత్రమే ఉన్నారు. ఇది మొదటి ప్రాధాన్యత ఓటు కావ డం గమనార్హం. రెండో ప్రాధాన్యత ఓటును పరిశీలిస్తే టీడీపీయే గెలుస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. 

జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగేళ్లుగా తమను పట్టిం చుకోలేదని వైసీపీ గ్రామ, మండల నాయకులతో పాటు కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు. ఈ ఎన్నికల్లో అధిష్టానానికి బుద్ధి చెప్పడానికైనా పార్టీ అభ్యర్థులను ఓడించి తీరాలన్న పట్టుదల, కసితో అధికార పార్టీకి చెందిన విద్యావంతులే జగన్కు వ్యతిరేకంగా ఓటు వేశారని ఈ ఫలితాలు చెబుతున్నాయి. ప్రతి రౌండ్లోనూ వైసీపీ అభ్యర్థులు వెనుకంజలో ఉండటం హాట్ టాపిక్ గా మారింది. తాజా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై వైసీపీ ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. చివరకు సీఎం వైఎస్ జగన్ కు అడ్డా అయిన పశ్చిమ రాయలసీమలో సైతం టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టబోయినట్లుగా వైసీపీ అభ్యర్థి గట్టెక్కారు. లక్షలాది విద్యావంతులు పాల్గొన్న ఎన్నిక ల్లో జగన్ కు తమ ధర్మాగ్రహాన్ని తెలియజేయడానికే మొగ్గు చూపారు.

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికకు సంబంధించి జగన్ మీద ఎంత కసితో ఉన్నారో స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేల మీద కూడా అంతకు మించిన వ్యతిరేకతతో ఓటర్లు ఉన్నారు. వేపాడ చిరంజీవిరావు గెలుపు లో ఉద్యోగవర్గాల వ్యతిరేకత, తూర్పుకాపుల ఐక్యత, వలస అభ్యర్థు లపై ఆగ్రహం, వైకాపా ఎమ్మెల్యేల నిరాసక్తత, వేపాడ శిష్యగణం శ్రమ కీలక పాత్ర పోషించాయి. ఈ ఎన్నికతో వైసీపీ కొన్ని విషయాల్లో అలర్ట్ అయింది. వాలంటీర్లు ఓటర్లను బూత్ వరకు రప్పించగలరు గానీ అధికార పార్టీకి ఓటు వేయించలేరన్నది మొదటిది. సర్పంచ్ లు, ఎంపీటీసీలు ప్రాధాన్యత కోల్పోవడం వల్లే పట్టభద్రులను ప్రభావితం చేయలేకపోయారన్నది రెండో అంశం.

అధికార పార్టీకి పట్టభద్రుల షాక్ 
పట్టుభద్రులు, ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైకాపాకు మిశ్రమ ఫలితాలు లభించాయి. రాష్ట్రంలో తొమ్మిది స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలతోపాటు మూడు పట్టభద్రుల, రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాలకు ఈ నెల 13న ఎన్నికలు జరిగాయి. వీటిలో ఐదు స్థానిక సంస్థల నియోజకవర్గాలను వైకాపా ఏకగ్రీవంగా దక్కించుకుంది. ఎన్నిక జరిగిన నాలుగు స్థానాలను కూడా ఆయా జిల్లాల్లోని స్థానిక సంస్థల్లో తనకున్న మెజారిటీతో దాదాపు ఏకపక్షం గా విజయం సాధించింది. గురువారం జరిగిన కౌంటింగ్లో ఆ నాలుగు స్థానాల్లో (శ్రీకాకుళం-1, ఏలూరు-2, కర్నూలు-1)నూ వైకాపా విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. వీటితోపాటు ప్రారంభమైన పట్టభద్రులు, ఉపాధ్యాయులకు చెందిన ఐదు నియోజక వర్గాల ఓట్ల లెక్కింపు సుదీర్ఘంగా కొనసాగుతోంది. శుక్రవారం సాయంత్రం లేదా రాత్రికి తుది ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. వీటిలో పట్టభద్రుల నియోజకవర్గాల ఓటర్లు అధికార వైకాపా కు షాక్ ఇచ్చారు. ఆరు రౌండ్ల లెక్కింపు పూర్తి అయ్యే సమయానికి మొత్తం మూడు స్థానాల్లో పశ్చిమ రాయలసీమ స్థానంలోనే వైకాపా స్వల్ప ఆధిక్యంలో ఉంది. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమల్లో తెలుగు దేశం అభ్యర్థులు ఆధిక్యతతో దూసుకుపోతున్నారు.

రౌండ్లవారీగా ఆధిక్యతలు 
కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలతో కూడిన పశ్చిమ రాయల సీమ నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి 1972 ఓట్ల స్వల్ప ఆధిక్యత లో కొనసాగుతున్నారు. ఐదు రౌండ్ల లెక్కింపు పూర్తి కాగా వైకాపా అభ్యర్థి వెన్నపూస రవీంద్రరెడ్డికి 47,086 ఓట్లు, టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంభూపాల్రెడ్డికి 45,114 ఓట్లు లభించాయి. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో కూడిన తూర్పు రాయలసీమ నియోజక వర్గంలో ఐదు రౌండ్ల లెక్కింపు పూర్తి అయ్యే సమయానికి టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ 17,139 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థికి 82,260 ఓట్లు, వైకాపా అభ్యర్థికి 65,121 ఓట్లు లభిం చాయి. ఇక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలతో కూడిన ఉత్తరాంధ్ర నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి డాక్టర్ వేపాడ చిరంజీవి రావు 23, 278 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక్కడ ఆరు రౌండ్ల లెక్కింపు పూర్తి అయ్యింది. ఇంతవరకు టీడీపీ అభ్యర్థికి 69,910 ఓట్లు, వైకాపా అభ్యర్థికి 46,632 ఓట్లు లభించాయి.

ఓటు వైసీపీకే! 
ఈ ఎన్నికల్లో ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో మాత్రం అనూహ్య ఫలితాలు వచ్చాయి. గత ఏడాది కాలంగా వేతనాలు, పీఆర్సీ, డీఏ ఇతర బకాయిల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరితో ఉద్యోగులతోపాటు ఉపాధ్యాయవర్గాలు తీవ్ర అసంతృప్తి, వ్యతిరేకతతో ఉన్నాయి. ఉద్యమాలు కూడా నిర్వహిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వా నికి వ్యతిరేకంగా ఓటు వేస్తారని, ఆ నియోజకవర్గాల్లో వైకాపాకు పరాభవం తప్పదని అందరూ భావించారు. కానీ ఫలితాలు ఆశ్చర్య పరిచాయి. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ వైకాపా అభ్యర్థులే విజ యం సాధించడం విశేషం. తూర్పు రాయలసీమ టీచర్స్ నియోజక వర్గంలో వైకాపా అభ్యర్థి పర్వతరెడ్డి చంద్రశేఖర్ గెలుపొందగా, పశ్చిమ రాయలసీమ టీచర్స్ నియోజకవర్గంలో అదే పార్టీ అభ్యర్థి ఎంవీ రామచంద్రారెడ్డి గెలుపొందారు.

టాప్ హెడ్ లైన్స్

Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Padikkal Permanent Slot: సాయి సుదర్శన్ వచ్చినా పడిక్కల్ కే నంబర్ 3 ప్లేస్.. అతనిలో అద్భుత నైపుణ్యముంది.. మాజీ క్రికెట‌ర్ ప్రశంసలు!
సాయి సుదర్శన్ వచ్చినా పడిక్కల్ కే నంబర్ 3 ప్లేస్.. అతనిలో అద్భుత నైపుణ్యముంది.. మాజీ క్రికెట‌ర్ ప్రశంసలు!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
సింగిల్‌ ఛార్జ్‌తో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లొచ్చు - Avore EX2 ధర, బ్యాటరీ, ఫీచర్లపై పూర్తి వివరాలు!
సింగిల్‌ ఛార్జ్‌తో ఏకంగా 255km ప్రయాణం.. Avore EX2 కొనే ముందు ఈ 5 విషయాలు తెలుసుకోండి!
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
Embed widget