News
News
X

నేటి నుంచి శాశ్వత భూ హక్కు పత్రాల పంపిణీ- శ్రీకాకుళంలో ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2020 డిసెంబర్‌ 21న వైఎస్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకాన్ని ప్రారంభించింది. డ్రోన్లతోపాటు జీఎన్‌ఎస్‌ఎస్‌ రోవర్స్‌ వంటి అత్యాధునిక సర్వే సాంకేతికతలను ఉపయోగించింది.

FOLLOW US: 
 
వంద సంవత్సరాల తరువాత దేశంలోనే తొలిసారిగా చేపట్టిన సమగ్ర భూ రీసర్వేలో భాగంగా, 2వేల గ్రామాల రైతులకు జగనన్న భూ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమానికి ఏపీ సర్కార్ రెడీ అయ్యింది. రాబోయే 15 రోజులలో ఈ 2వేల గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలను ప్రారంభించనున్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో బుధవారం(23 నవంబర్ 2022)ఈ కార్యక్రమాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మహా యజ్ఞాన్ని చేపట్టిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం దశల వారీగా ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు సన్నాహాలను పూర్తి చేసింది. రాష్ట్రంలోని భూముల రీసర్వే పూర్తి, రీసర్వే పూర్తైన గ్రామాల్లో అవసరమైన ప్రక్రియను పూర్తిచేసి ఆయా సచివాలయాల్లో స్ధిరాస్తుల రిజిస్ట్రేషన్లను చేయనున్నారు.

ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకం...
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2020 డిసెంబర్‌ 21న వైఎస్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకాన్ని ప్రారంభించింది. రెండు వేల గ్రామాల్లో రీసర్వే సమయంలో రైతులు దరఖాస్తు చేసుకోకుండా 8–9 నెలల వ్యవధిలో 4.3 లక్షల సబ్‌డివిజన్‌లు, 2 లక్షల మ్యుటేషన్‌లు భూమి, రెవెన్యూ రికార్డుల్లో జరిగాయి. మీసేవ, గ్రామ సచివాలయాల ద్వారా ప్రతి సంవత్సరం స్వీకరించిన 35వేల సబ్‌డివిజన్‌ దరఖాస్తులతో దీనిని పోల్చవచ్చుని అధికారులు అంటున్నారు. భూ కమతం ఒక సర్వే నెంబర్‌ కింద ఉండి, కాలక్రమేణా విభజన జరిగి చేతులు మారినా కూడా సర్వే రికార్డులు అప్‌డేట్‌ కాకపోవడంతో వస్తున్న భూ వివాదాలు, రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో ఇబ్బందులు ఎదురయ్యే పరిస్ధితులు ఉండవని వెల్లడించారు. భూ రికార్డులను ప్రక్షాళన చేసి ప్రతి భూ కమతానికి (సబ్‌ డివిజన్‌కు కూడా) విశిష్ట గుర్తింపు సంఖ్య కేటాయింపు చేశారు.

అత్యాధునిక సాంకేతికత...

డ్రోన్లు, కంటిన్యూయస్లీ ఆపరేటింగ్‌ రిఫరెన్స్‌ స్టేషన్లతోపాటుగా జీఎన్‌ఎస్‌ఎస్‌ రోవర్స్‌ వంటి అత్యాధునిక సర్వే సాంకేతికతలను ఉపయోగించి ఈ సమగ్ర రీసర్వేని దేశంలోనే మొదటిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రారంభించింది. భూహక్కు పత్రం అందించడం ద్వారా భూ యజమానులకు హక్కు భద్రత కల్పించడం, 5 సెంమీ లేదా అంతకంటే తక్కువ కచ్చితత్వంతో జియో–రిఫరెన్స్‌ కోఆర్డినేట్‌ల ఆధారంగా భూ రక్ష సర్వే రాళ్లను నాటడం ద్వారా భూమికి భౌతిక భద్రత కల్పించడం ఈ సమగ్ర సర్వే ప్రధాన లక్ష్యాలు.

News Reels

ప్రతి భూ కమతానికి విడిగా అక్షాంశ, రేఖాంశాలు, విశిష్ట గుర్తింపు సంఖ్య, సమగ్రంగా భూవివరాలు తెలిపే క్యూఆర్‌ కోడ్‌తో కూడిన భూకమత పటం భూ యజమానులకు జారీ చేయనున్నారు. గ్రామ స్ధాయిలో భూ రికార్డులన్నీ క్రోడీకరించి, మ్యాపులు (భూ కమతాలతో కూడిన గ్రామ పటం) ఇతర భూ రికార్డులు ఇక గ్రామాల్లోనే అందుబాటులో ఉంచుతారు.

ఇక పై శాశ్వత భూ హక్కు...

సింగిల్‌ విండో పద్దతిలో ప్రతి ఆస్తికీ ప్రభుత్వ హమీతో కూడిన శాశ్వత భూ హక్కు పత్రం జారీ చేసే దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. భూ లావాదేవీలు, బ్యాంకు రుణాలు ఇకపై సులభం అవుతాయని ప్రభుత్వం చెబుతుంది. ప్రతి భూకమతానికి ఉచితంగా భూరక్ష హద్దు రాళ్ళు ఇవ్వటంతోపాటుగా, డూప్లికేట్‌ రిజిస్ట్రేషన్లకు ఇక చెక్‌ పెడతామని ప్రభుత్వం ధీమాగా చెబుతుంది. దళారీ వ్యవస్ధ , లంచాలకు ఇక చోటు లేని పాలన ఉంటుందని వెల్లడించింది.

నకిలీ పత్రాలకు ఇక తావులేదు....
భూ యజమానికి తెలియకుండా రికార్డుల్లో ఎలాంటి మార్పులు వీలుపడదని, భూ లావాదేవీల ఆధారంగానే భూ రికార్డుల్లో మార్పులు, అవసరమైన చోట సబ్‌ డివిజన్‌ మార్పులు చేసిన తర్వాతే రిజిస్ట్రేషన్లు ఉంటాయని వెల్లడించింది. సర్వే ప్రతి అడుగులో భూ యజమానుల భాగస్వామ్యం చేయటం, మండల మొబైల్‌ మెజిస్ట్రేట్‌ బృందాల ద్వారా అభ్యంతరాల పరిష్కారం
తొలిసారిగా గ్రామ కంఠాల్లోని స్తిరాస్తుల సర్వే, యాజమాన్య ధృవీకరణ పత్రాల జారీ చేయనున్నారు.

Published at : 23 Nov 2022 05:35 AM (IST) Tags: YS Jagan AP News Jagan Srikakulam Tour YSR BHU HAKKU LAUNCH

సంబంధిత కథనాలు

Petrol-Diesel Price, 2 December 2022: పెట్రోల్ డీజిల్ ధరల్లో భారీ మార్పులు- మీ ప్రాంతంలో రేట్లు ఇవే!

Petrol-Diesel Price, 2 December 2022: పెట్రోల్ డీజిల్ ధరల్లో భారీ మార్పులు- మీ ప్రాంతంలో రేట్లు ఇవే!

Gold-Silver Price 2 December 2022: 54 వేలు దాటేసిన పసిడి- తెలుగు రాష్ట్రాల్లోనే కాస్త బెటర్‌!

Gold-Silver Price 2 December 2022: 54 వేలు దాటేసిన పసిడి- తెలుగు రాష్ట్రాల్లోనే కాస్త బెటర్‌!

Bhogapuram Land Turns Gold : భోగాపురం ఎయిర్‌పోర్టుకు ఇటుక పడలేదు కానీ భూములు మాత్రం బంగారం ! కోటీశ్వరులైన రైతులు

Bhogapuram Land Turns Gold : భోగాపురం ఎయిర్‌పోర్టుకు ఇటుక పడలేదు కానీ భూములు మాత్రం బంగారం ! కోటీశ్వరులైన రైతులు

Road Accident : ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు విశాఖ వాసులు మృతి

Road Accident : ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు విశాఖ వాసులు మృతి

YSRCP BC Meeting : 84 వేల మందితో జయహో బీసీ సభ - బెజవాడలో ఏర్పాట్లు ప్రారంభించిన వైఎస్ఆర్‌సీపీ !

YSRCP BC Meeting : 84 వేల మందితో జయహో బీసీ సభ - బెజవాడలో ఏర్పాట్లు ప్రారంభించిన వైఎస్ఆర్‌సీపీ !

టాప్ స్టోరీస్

Gummanuru Jayaram: ఏపీ మంత్రి భార్యకు ఐటీ నోటీసులు! అవి ఎలా కొన్నారు? డబ్బు ఎక్కడిదని ప్రశ్నలు - మంత్రి క్లారిటీ

Gummanuru Jayaram: ఏపీ మంత్రి భార్యకు ఐటీ నోటీసులు! అవి ఎలా కొన్నారు? డబ్బు ఎక్కడిదని ప్రశ్నలు - మంత్రి క్లారిటీ

Hit 2 Review - 'హిట్ 2' రివ్యూ : అడివి శేష్ హీరోగా నాని తీసిన సినిమా ఎలా ఉందంటే?

Hit 2 Review - 'హిట్ 2' రివ్యూ : అడివి శేష్ హీరోగా నాని తీసిన సినిమా ఎలా ఉందంటే?

Elon Musk Announces Brain Chips : మనిషి మెదడులో అడ్వాన్స్డ్ చిప్స్ ప్రయోగం | Neuralink | ABP Desam

Elon Musk Announces Brain Chips : మనిషి మెదడులో అడ్వాన్స్డ్ చిప్స్ ప్రయోగం | Neuralink | ABP Desam

IT Raids In Telangana: తెలంగాణ మంత్రి మల్లారెడ్డి నివాసం, ఆఫీసుల్లో ఐటీ రైడ్స్‌- సీన్‌లో 50 బృందాలు

IT Raids In Telangana: తెలంగాణ మంత్రి మల్లారెడ్డి నివాసం, ఆఫీసుల్లో ఐటీ రైడ్స్‌- సీన్‌లో 50 బృందాలు