Botsa Satyanarayana: మాజీ సైనికుడి ఇల్లు కూల్చివేత దారుణం, 39 ఏళ్లలో ఇలాంటివి చూడలేదు: మాజీ మంత్రి బొత్స ఫైర్
Andhra Pradesh News | నెల్లిమర్ల మండలం దన్నానపేటలో మాజీ సైనికుడి ఇల్లు కూల్చివేత దారుణం అన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. 39 ఏళ్లలో ఇలాంటివి చూడలేదన్నారు.
విజయనగరంలో మాజీ సైనికుడి ఇల్లును కూల్చివేయించిన @JaiTDP
— YSR Congress Party (@YSRCParty) July 27, 2024
వైయస్ఆర్సీపీకి ఓటు వేశారనే కారణంతో మాజీ సైనికుడు పతివాడ వెంకునాయుడు కుటుంబాన్ని కొన్ని రోజులుగా వేధిస్తున్న టీడీపీ నాయకులు
ఇంటి కూల్చివేతకి గ్రామస్థులు అడ్డుపడటంతో 60 మంది పోలీసుల బలగంతో వచ్చిన రెవెన్యూ అధికారులు… pic.twitter.com/JqStGKfRvd
మాజీ జవాన్ ఇల్లు కూల్చివేసిన సిబ్బంది
ఏపీ ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేశారన్న కారణంగా విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేటలో ఆర్మీ మాజీ జవాన్ పతివాడ వెంకునాయుడు ఇంటిని రెవిన్యూ సిబ్బంది కూల్చివేశారని వైసీపీ ఆరోపించింది. టిడిపి కార్యకర్తలు పార్టీ ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్రీవెన్స్ లో ఆర్మీ జవాన్ పై ఫిర్యాదు చేయగా.. అధికారులు సిబ్బందితో వచ్చి దారుణం చేశారని విమర్శించారు.
దన్నాన పేట లో రామతీర్దాలు దేవాలయ సంబందిత భూ అక్రమణలు జరిగి, కొందరు ఇక్కడ ఇళ్లు కట్టుకొని ఉంటున్నారు. అనంతరం ఈ భూముల క్రయవిక్రయాలు సైతం జరిగాయి. తాజాగా టిడిపి కార్యకర్తలు పార్టీ గ్రీవెన్స్ లో పతివాడ వెంకునాయుడుపై ఫిర్యాదు చేశారు. దీంతో రెవన్యూ సిబ్బంది ఆగమేఘాల మీద వచ్చి మాజీ జవాన్ ఇళ్లు నిర్ధాక్షిణ్యంగా కూల్చివేశారని వైసీపీ నేతలు ఆరోపించారు. ఒక్కడి ఇల్లు ఎందుకు కూల్చుతున్నారు, చాలా మంది ఇండ్లు అలాగే కట్టారని చెప్పినా రెవెన్యూ సిబ్బంది పట్టించుకోలేదని బాధిత కుటుంబసభ్యులు చెబుతున్నారు.