Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్
G20 summit 2023 in visakhapatnam: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం కాగా, తాము అధికారంలోకి వచ్చాక 30 లక్షల మందికి ఇళ్లపట్టాలు ఇచ్చాం అన్నారు సీఎం జగన్.
AP CM YS Jagan Speech At G20 Vizag: విశాఖపట్నం వేదికగా జరుగుతున్న జీ20 సన్నాహక సదస్సులో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. నేడు (మార్చి 28), 29 తేదీలలో రెండు రోజులు విశాఖలో జీ20 వర్కింగ్ గ్రూప్ సమావేశాలకు హాజరైన సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం అన్నారు. జి-20 రెండో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశాన్ని ఉద్దేశించి సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం కాగా, తాము అధికారంలోకి వచ్చాక.. 30 లక్షల మందికి ఇళ్లపట్టాలు ఇచ్చాం అన్నారు. మరో 22 లక్షల ఇళ్లు కడుతున్నాం అన్నారు.
ఈ ఇళ్లకు కనీస మౌలిక సదుపాయాలను కల్పించడానికి ప్రభుత్వం ముమ్మరంగా చర్యలు చేపడుతోంది. దీనిపై సరైన చర్చలు జరిపి.. సస్టెయిన్‌బుల్ పద్ధతులను సూచించాలని ఏపీ సీఎం జగన్ కోరారు. దీనిపై సరైన మార్గనిర్దేశకత్వం అవసరం. దీనివల్ల మంచి ఇళ్లు పేదలకు సమకూరుతాయి. దీనిపై మీనుంచి మంచి ఆలోచనలు కావాలన్నారు. సమస్యలకు మంచి పరిష్కారాలు చూపగలగాలి. ఈ అంశంపై మీరు చక్కటి చర్చలు చేయాలి. విశాఖో మీరు ఇక్కడ గడిపే సమయం చెరిగిపోలేని జ్ఞాపకంగా ఉంటుందని ఆశిస్తున్నాను అని జి-20 రెండో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశంలో సీఎం వైయస్ జగన్ ప్రసంగించారు.
మే అధికారంలోకి వచ్చాక.. 30 లక్షల మందికి ఇళ్లపట్టాలు ఇచ్చాం. 22 లక్షల ఇళ్లు కడుతున్నాం. ఈ ఇళ్లకు కనీస మౌలిక సదుపాయాలను కల్పించడానికి ప్రభుత్వం ముమ్మరంగా చర్యలు చేపడుతోంది. దీనిపై సరైన చర్చలు జరిపి.. సస్టెయిన్‌బుల్ పద్ధతులను సూచించాలని కోరుతున్నాను. 2/3 #G20India #Vizag
— YSR Congress Party (@YSRCParty) March 28, 2023
ఈ సదస్సుకు 40 దేశాల నుంచి 57 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. మంగళవారం సాయంత్రం గాళ డిన్నర్ కు సీఎం వైఎస్ జగన్ హాజరయ్యారు. మొదటి రోజు నాలుగు, రెండవ రోజు మూడు సెషన్లు ఉంటాయన్నారు. రెండు రోజులు మొత్తం 7 సెషన్స్ (మొదటి రోజు నాలుగు, రెండో రోజు 3), ఒక వర్క్ షాప్ జరుగుతాయని జాయింట్ సెక్రెటరీ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ సల్మాన్ ఆరోక్య రాజ్ వెల్లడించారు. ఈ 30న జీ 20 దేశాలు నుంచి వారికి ట్రైనింగ్ క్లాస్ లు ఉంటాయన్నారు. మిగతా దేశాలు వారు వారి దేశాల్లో సాధించిన ప్రగతిని వివరిస్తారన్నారు. 31వ తేదీన దేశ వ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్లు విద్యార్థులు హాజరవుతారు. విద్యార్థులతో సౌత్ కొరియా, సింగపూర్ దేశాల ప్రతినిధుల నాలెజ్డ్ ఎక్సేంజ్ ఉంటుందన్నారు. పట్టణీకరణ ద్వారానే 80 శాతం జీడీపీ వస్తుందని సల్మాన్ ఆరోక్య రాజ్ తెలిపారు. జీడీపీ వృద్ధికి కావల్సిన మౌలిక సదుపాయాలు కల్పపనపై ఈ సదస్సులో చర్చ జరుగుతుందన్నారు.
జి-20 రెండో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశానికి హాజరైన సీఎం శ్రీ వైయస్ జగన్. జీ-20 ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడిన ముఖ్యమంత్రి. #G20India #CMYSJagan #Vizag pic.twitter.com/imzBPs7Z12
— YSR Congress Party (@YSRCParty) March 28, 2023
జీ - 20 సదస్సు సందర్భంగా విశాఖ సుందరీకరణ కు 100 కోట్లు కేటాయించింది ప్రభుత్వం . ఆర్కే బీచ్ నుండి రాడిసన్ బ్లూ హోటల్ వరకూ ఉన్నమార్గాన్ని అత్యంత అందంగా తయారుచేశారు . అలాగే అతిధులు చేరుకునే ఎయిర్పోర్ట్ నుండి వైజాగ్ సిటీ వరకూ ఉన్న హైవే ను సరిక్రొత్తగా మార్చేసారు. ఎటుచూసినా అతిధులకు, ప్రతినిధులకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన హోర్డింగ్స్ .. రంగురంగుల లైట్లతో వైజాగ్ ను మరింత బ్యూటిఫుల్ గా తీర్చిదిద్దారు.
వైజాగ్ లో రెడ్ జోన్ గా ప్రకటించిన మార్గాలు ఇవే :
1)రాడిసన్ బ్లూ రిసార్ట్స్,
2)ముడసర్లోవ పార్క్,
3)కైలాసగిరి కొండ,
4)ఆర్.కె. బీచ్,
5)జిందాల్ వేస్ట్ నుండి ఎనర్జీ ప్లాంట్, కాపులుప్పాడ రోడ్
6) ఎస్.సి.ఏ.డి.ఏ , మాధవధార