అన్వేషించండి

Anganwadi Strike: మంత్రి బొత్సకు చేదు అనుభవం, కాన్వాయ్ అడ్డగించి నిలదీసిన అంగన్వాడీలు

Botsa Satyanarayana: తమ డిమాండ్లను నెరవేర్చకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందంటూ అంగన్వాడీలు మంత్రి బొత్స సత్యనారాయణ కాన్వాయ్ ను అడ్డుకున్నారు.

Anganwadi workers stop Botsa Car: మెంటాడ: ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణకు చేదు అనుభవం ఎదురైంది. తమ డిమాండ్లను నెరవేర్చకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందంటూ అంగన్వాడీలు మంత్రి బొత్స కాన్వాయ్ ను అడ్డుకున్నారు. దాదాపు అరగంటపాటు మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana)కు అంగన్వాడీలు దారివ్వలేదు. కొందరు ఈ తతంగాన్ని వీడియో తీసే ప్రయత్నం చేయగా, వీడియో తీయవద్దంటూ సీరియస్ అయ్యారు. పోలీసులు జోక్యం చేసుకుని అంగన్వాడీలకు సర్దిచెప్పడంతో మంత్రి బొత్స కారులో వెళ్లిపోయారు. సమ్మె (Anganwadi Strike) కొనసాగిస్తామని అంగన్వాడీలు స్పష్టం చేశారు.

మూడు నెలల తరువాతే వేతనాల పెంపు
మంత్రి బొత్స సత్యనారాయణ విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్నారు. మెంటాడ మండలం పర్యటన ముగించుకుని ఆయన విజయనగరం వెళుతున్నారు. ఈ క్రమంలో గజపతినగరంలో అంగన్వాడి వర్కర్స్ మంత్రి బొత్స సత్యనారాయణ వాహనాన్ని అడ్డుకున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ జీతాలు పెంచాలని కోరుతూ అంగన్వాడీలు వినతిపత్రం అందజేశారు. తాను ఇంతకుముందే చెప్పినట్లు మూడు నెలల తరువాతే మీ వేతనాలు పెంచుతామని చెప్పారు. మొత్తం 11 డిమాండ్లు చేయగా ఇప్పటికే అంగన్వాడీల 10 డిమాండ్లు నెరవేర్చామన్నారు. ప్రస్తుతం జీతాల పెంపు గురించి అడగవద్దని, 3 నెలల్లో వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని అప్పుడు మీ డిమాండ్లు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అంగన్వాడీ వర్కర్స్ రేపటి (మంగళవారం) నుంచి విధులకు హాజరుకావాలని సూచించారు. కానీ అంగన్వాడీలు మాత్రం జీతాలు పెంచితే గానీ సమ్మె విరమించేది లేదన్నారు. చివరకు పోలీసులు, స్థానిక నేతలు జోక్యం చేసుకుని అంగన్వాడీలకు సర్దిచెప్పారు. అనంతరం మంత్రి బొత్స తన వాహనంలో విజయనగరం వెళ్లారు. 

వరుస సమ్మెలతో సర్కార్‌కు తప్పని తిప్పలు 
ఏపీలో ఓవైపు అంగన్వాడీలు, మరోవైపు మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తూ వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకపోవడం వల్లే తాము సమ్మెను ముందుకు తీసుకెళ్తున్నామని కార్మికులు, అంగన్వాడీలు చెబుతున్నారు. రెండు, మూడేళ్లకు ఒకసారి జీతాల పెంపు వీలు కాదంటూ ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదివరకే అంగన్వాడీలు సమ్మె విరమించపోవడంతో వారిపై ఏపీ ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడం తెలిసిందే. ఆ కారణంగా 6 నెలల వరకు వారు సమ్మె చేయడానికి అవకాశం ఉండదు. ఐదేళ్లకు ఒక్కసారే ఉద్యోగుల జీతాల పెంపు సాధ్యమని, ఇలా 2, 3 సంవత్సరాలకు వేతనాల పెంపు సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagan Mohan Reddy Latest News: ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Tirumala News: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఆర్జిత సేవా టికెట్లు విడుదల, శ్రీవాణి టికెట్లు పెంపు
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఆర్జిత సేవా టికెట్లు విడుదల, శ్రీవాణి టికెట్లు పెంపు
Sai Durgha Tej - Pawan Kalyan: జనసేనాని నుంచి మేనల్లుడు సాయి దుర్గ తేజ్‌కు స్పెషల్ గిఫ్ట్ - దాని ప్రత్యేకత ఏంటో తెలుసా?
జనసేనాని నుంచి మేనల్లుడు సాయి దుర్గ తేజ్‌కు స్పెషల్ గిఫ్ట్ - దాని ప్రత్యేకత ఏంటో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలుఅరటిపండు రాకెట్ కూలిపోయింది, ట్రంప్ ముందు పరువు పోయిందిగా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagan Mohan Reddy Latest News: ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Tirumala News: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఆర్జిత సేవా టికెట్లు విడుదల, శ్రీవాణి టికెట్లు పెంపు
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఆర్జిత సేవా టికెట్లు విడుదల, శ్రీవాణి టికెట్లు పెంపు
Sai Durgha Tej - Pawan Kalyan: జనసేనాని నుంచి మేనల్లుడు సాయి దుర్గ తేజ్‌కు స్పెషల్ గిఫ్ట్ - దాని ప్రత్యేకత ఏంటో తెలుసా?
జనసేనాని నుంచి మేనల్లుడు సాయి దుర్గ తేజ్‌కు స్పెషల్ గిఫ్ట్ - దాని ప్రత్యేకత ఏంటో తెలుసా?
Hydra Real Estate: చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
Adani Group: లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందన - కఠిన నిర్ణయం తీసుకున్న గౌతమ్‌ అదానీ
లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందన - కఠిన నిర్ణయం తీసుకున్న గౌతమ్‌ అదానీ
Warangal Bank Robbery: గూగుల్‌లో చూసి వరంగల్‌ బ్యాంకు దోపిడీ- ఖాతాదారులు నష్టపోవాల్సిందేనా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
గూగుల్‌లో చూసి వరంగల్‌ బ్యాంకు దోపిడీ- ఖాతాదారులు నష్టపోవాల్సిందేనా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
PPP Model Chandrababu:  ప్రాజెక్టులు,రోడ్లను వాడుకుంటే డబ్బులు కట్టాల్సిందే - ఏపీలో PPP మోడల్ - చంద్రబాబు రిస్క్ చేస్తున్నారా ?
ప్రాజెక్టులు,రోడ్లను వాడుకుంటే డబ్బులు కట్టాల్సిందే - ఏపీలో PPP మోడల్ - చంద్రబాబు రిస్క్ చేస్తున్నారా ?
Embed widget