Love Attack: అనకాపల్లిలో ప్రేమ పేరుతో దారుణం- గుడికి వెళ్లిన యువతి గొంతు కోసిన ఆటో డ్రైవర్
అనకాపల్లిలో తనను ప్రేమించలేదని ఓ యువతిపై ఆటోడ్రైవర్ దాడి చేశాడు. బ్లేడ్‌తో గొంతు కోశాడు. ఇది సంచలనంగా మారింది.
ఆంధ్రప్రదేశ్‌లో మరో దారుణం జరిగింది. ఆటో డ్రైవర్ ఓ యువతిపై దాడి చేశాడు. ప్రేమ పేరుతో కొన్ని రోజుల నుంచి వేదిస్తున్న వ్యక్తి ఇవాళ ఉదయం ఎటాక్ చేశాడు.
అనకాపల్లి జిల్లా వి.మాడుగులలో దారుణమై ఘటన జరిగింది. దైవదర్శానికి వెళ్లిన ఓ యువతిపై ఆటో డ్రైవర్ నగేష్ దాడి చేశారు. బ్రేడ్‌తో అమ్మాయి గొంతు కోశాడీ ఉన్మాది. ప్రేమిస్తున్నానంటూ కొంత కాలంగా ఆ యువతి వెంటపడుతున్నాడు నగేశ్ అనే యువకుడు. అయితే అందుకు యువతి ఒప్పుకోకపోవడంతోనే నగేశ్ ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది.
ఈ రోజు ఉదయం యువతి స్థానికంగా ఉండే ఆంజనేయ స్వామి గుడికి ఆ అమ్మాయి వెళ్లింది. ఆమెను ఫాలో అయ్యాడు నగేష్. గుడిలోనే ఆమెపై ఎటాక్ చేశాడు. ప్రేమిస్తావా లేదా అంటు నిలదీశారు. ఆమె సమాధానం చెప్పకపోయేసరికి తనతో తెచ్చుకున్న బ్లేడ్‌తో దాడి చేశాడు.
నగేష్ దాడిలో తీవ్రంగా గాయపడిన యువతిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి స్థానికులు ఆమెను మాడుగుల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
ఆ యువతిపై నగేష్ దాడి చేయడం ఇది రెండోసారి. గతంలో కూడా ఓసారి దాడి చేశాడు. అప్పుడు పోలీసులు నగేష్‌ను పిలిచి విచారించారు. ఇకపై ఇలాంటి పిచ్చిపనులు చేయొద్దని హెచ్చరించారు. అయినా నగేష్ తన ప్రవర్తన మార్చుకోలేదు. ఇప్పుడు రెండోసారి దాడి చేయడం సంచలనంగా మారింది.